మీర్పూర్ : టీ20 ప్రపంచకప్ ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ టోర్నిలో వరుసగా 3వ ఓటమి చవిచూసింది. పాకిస్తాన్ చేతిలో 50 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. దీంతో పాకిస్తాన్ సెమిఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అహ్మద్ షెహజాద్(62 బంతుల్లో 111 పరుగులు) సెంచరీ తో రాణించాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టు 20ఓవర్లలో 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీస్ ఆశలు కోల్పోయిన బంగ్లా తన చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా తో తలపడుతుంది. ఇక పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ పై గెలవాలి,లేదంటే వెస్టిండీస్ సెమీస్ కు చేరుతుంది.
ఆదివారం ఆస్ట్రేలియా తో జరిగిన టీ20 ప్రపంచకప్ లో భారత్ విజయ పరంపరను అడ్డుకోలేకపోయింది. ప్రపంచకప్ లో వరుసగా 4వ విజయాన్ని అందుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆసీస్ చేతులెత్తేసింది,దీంతో ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.
టాస్ గెలిచి భారత్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించిన ఆసీస్ మంచి బౌలింగ్ ప్రదర్శన చేసింది,ఒక దశలో 66 పరుగులకే 4 వికెట్లు తీసి భారత్ ను కష్టాల్లోకి నెట్టింది. యువరాజ్ సింగ్(60,43 బంతుల్లో 5x4 4x6) రాణించడంతో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
అనంతరం బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆసీస్ ఏ దశలోనూ విజయంవైపు సాగుతున్నట్టు కనిపించలేదు. భారత్ బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు ఈ ప్రపంచకప్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఏకంగా ఆస్ట్రేలియాను 86 పరుగులకే కట్టడి చేసి సెమీస్ కళల మీద నీళ్ళు చల్లారు.
అశ్విన్ 4వికెట్లు, అమిత్ మిశ్రా 2 వికెట్లతో రాణించారు.మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా అశ్విన్ ఎన్నికయ్యారు.
శనివారం చిట్టగాంగ్ లో జరిగిన టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన హోరా హోరి పోరులో దక్షిణాఫ్రికా విజయం సాధించి సెమీ ఫైనల్ లో అడుగుపెట్టింది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఆమ్లా(56),డీ కాక్(29) మొదటి వికెట్ కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో డివిలియర్స్(69* 28బంతుల్లో) చెలరేగడంతో 196 పరుగుల భారీ స్కోర్ ఇంగ్లాండ్ ముందు ఉంచింది.
లక్ష్య చేదనలో ఇంగ్లాండ్ కూడా దీటుగా ఆడింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి కేవలం మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. హేల్స్(38),బట్లర్(34) రాణించారు. డివీలియర్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు.
టీ20 ప్రపంచకప్ లో శనివారం న్యూజిలాండ్ బలహీన నెదర్లాండ్స్ తో తలబడింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్, నెదర్లాండ్స్ ను 151 పరుగులకు కట్టడి చేసింది.
కూపర్(40),బోరెన్(49) రాణించడంతో నెదర్లాండ్స్ నిర్ణీత 20ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 151 చేసింది.
152 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్,కెప్టెన్ మెక్ కల్లమ్ 69 పరుగులు చేసి ఇంకా ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్ కు విజయాన్ని అందించాడు.
న్యూజిలాండ్ సెమీస్ కు చేరాలంటే తన చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ తప్పక గెలవాలి.
టీ20 ప్రపంచకప్ లో భారత్ తన విజయపరంపరను కొనసాగిస్తుంది. ఈరోజు మీర్పూర్ లో జరిగిన మ్యాచ్ లో ధోని సేన బంగ్లాదేశ్ పై విజయంతో వరుసగా 3వ విజయాన్ని అందుకుంది.

టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ చేసిన భారత్ మంచి బౌలింగ్ ప్రదర్శన కనబరిచింది. ఎక్కడ స్కోర్ వేగాన్ని పెంచుకునే అవకాశం బంగ్లాదేశ్ కు దొరకలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు సాధించింది. హక్(44),మహ్మదుల్లా(33) రాణించారు. అమిత్ మిశ్రా 3 వికెట్లు, అశ్విన్ 2 వికెట్లు తీసుకున్నారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే శికర్ ధావన్ వికెట్ కోల్పోయినా రోహిత్ శర్మ (56), విరాట్ కోహ్లి(57*) మరోసారి రాణించారు. చివర్లో ధోని(22*) 2 సిక్సర్లతో మ్యాచ్ ముగించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అశ్విని కి దక్కింది. భారత్ గెలిచిన మొత్తం మూడు మ్యాచ్ ల్లోనూ స్పిన్నర్లకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కడం విశేషం.
ఈ విజయంతో భారత్ సెమీ ఫైనల్ బెర్త్ కరారు చేసుకుంది
  • సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన విండోస్ యొక్క  MS-DOS మరియు వర్డ్ యొక్క సోర్స్ కోడ్ విడుదల చేసింది.
  • As per the World’s Riskiest Cities 2014 report, Kolkata emerged as the world’s 7th most risky city. Most risk city in the world is Tokyo and second risk city is Manila.
  • ప్రఖ్యాత హిందీ రచయిత గోవింద్ మిశ్రాను 'సరస్వతి సమ్మాన్ 2013' వరించనుంది. 2008 లో తను రచించిన 'ధూల్ పౌదో పర్' అనే పుస్తకానికి గాను ఈ పురస్కారం అందుకోనున్నారు.
  • ప్రత్యకంగా మహిళల రక్షణ కోసం 6 షాట్ సిలిండర్ రివాల్వర్ 'నిర్బీక్' అనే గన్ మొదటి సారిగా మహిళల కోసం వస్తుంది. 2102 లో గ్యాంగ్ రేప్ కి గురై మరణించిన నిర్భయకు నివాళిగా ఈ రివాల్వర్  తయారు చేశారు.
మీర్పూర్ :టీ20 ప్రపంచకప్ రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. మీర్పూర్ లో ఈరోజు జరిగిన ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియా పై వెస్టిండీస్ విజయం సాధించింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 178 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్(45),హాడ్జ్(35) మాత్రమే రాణించారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విండీస్ కు గేల్(53) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చిన చివర్లో కొంత తడబాటుకు లోనైంది. చివరి 2 ఓవర్లలో 31 పరుగులు చేయాల్సి ఉండగా కెప్టెన్ సామి(34*) చెలరేగడంతో ఇంకా 2 బంతులు ఉండగానే వెస్టిండీస్ విజయం సాధించింది. సామి మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నారు.
  • స్పెయిన్‌ దేశానికి రాజ్యాంగబద్దంగా ఎన్నికైన తొలి ప్రధాని అడాల్ఫో సూరేజ్ ఆల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ 81 సంవత్సరాల వయస్సులో మాడ్రిడ్‌లో మరణించారు.
  • ఇప్పటి వరకు అన్ని రకాల ప్రభుత్వ సేవలకు ఆధార్ కార్డు తప్పనిసరి. ఇక నుండి ప్రభుత్వ రంగ సేవలకు ఆధార్ తప్పనిసరి అనే నియమాన్ని తొలిగించాలి అని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారి చేసింది.
  • స్కోచ్ అచీవ్ అవార్డు ను కార్పోరేషన్ బ్యాంకు దక్కించుకుంది.
ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్ పై జోక్యం చేసుకోలేమని,షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని,ఐపీఎల్ లో ఆడకుండా ఏ ఆటగాడిని కానీ, జట్టును గాని నిలవరించలేమని సుప్రీంకోర్టు వెలువరించింది.
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు IPL-7 లో ఆడడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అని సుప్రీం కోర్టు పేర్కొంది.బీసీసీఐ ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా వ్యవహరించాలని కూడా సూచించింది.దీంతో ఉపాద్యక్షుల్లో ఒకరైన శివలాల్ యాదవ్ బీసీసీఐ అధ్యక్షుడిగా పూర్తిస్థాయి భాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి.ఐపీఎల్-7 సీజన్ వరకు మాత్రం సునీల్ గవాస్కర్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండాలని సుప్రీం సూచించింది. బీసీసీఐ ఇతర వ్యవహారాలతో గవాస్కర్ కు సంబంధం ఉండదు. వ్యాక్యాతగా ఇప్పటికే చేసుకున్న కాంట్రాక్టులు గవాస్కర్ రద్దు చేసుకోవాలని, అందుకుగాను గవాస్కర్ కు పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు తెలిపింది. ఐసీసీ సంబంధిత వ్యవహారాల్లో శ్రీనివాసన్ పాల్గొనేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న పిటీషన్ ను కొట్టివేసింది కోర్టు.
మార్చి27న వైజాగ్ లో పవన్ కళ్యాణ్ జనసేన సభ చిత్రాలు

కృష్ణ వంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గోవిందుడు అందరివాడేలే చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Click here first look of గోవిందుడు అందరివాడేలే

మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్ తేజ్' జన్మదిన వేడుకలు చిరంజీవి బ్లడ్ బ్యాంకు లో అభిమానుల మధ్య ఘనంగా జరిగాయి.

Click here for Ram Charan Birthday celebration photos

జనసేన పార్టీ సిద్దాంతాలను ‘ఇజం’ పుస్తకం రూపంలో పవన్ ఆవిష్కరించారు.

పవన్ రచించిన ‘ఇజం’ పుస్తకాన్ని భారత ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.

కడుపుమండి రాజకీయాల్లోకి వచ్చా.

ఇంట్లో తినవలసిన భోజనాన్ని రోడ్లమీదకు వచ్చి తినేటట్టు చేశారు.

సోనియా గాంధిలో తల్లి లక్షణాలు లేవు.

కాంగ్రెస్ ను కూకటివేళ్ళతో సహా తొలగించాలి.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి రాజకీయం ఎక్కడా చూడలేదు.

జాతిపిత పేరు ఇంటిపేరుగా పెట్టుకున్నంత మాత్రాన జాతిపితలు కాలేరు.

ప్రతి రోజూ టీవీల్లో కనిపించాలన్న దురద లేదు.

అవినీతి పై పోరాటం చెయ్యడమే తన పార్టీలోని మేనిఫెస్టో.

సైద్ధాంతిక విభేదాలే తప్ప తనకు ఎవ్వరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవు.

అన్నయ్యను తాను వ్యతిరేకించడం లేదంటూ ఇప్పుడు ఇద్దరం చెరోవైపు నిలిచామంటే అది భగవంతుని లీల.

చట్టాలు అందరికీ వర్తించే విధంగా ఉండాలి.

రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చెయ్యటం లేదు.

రాబోయే తరాలకోసమే జనసేన.

ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించం.వాళ్ళ రెండు చెంపలు పగిలిపోయేలా కొడతాం.

ఓట్లను చీల్చడం తనకు ఇష్టం లేదు, కొత్త రాష్ట్రం, రాజధానిని నిర్మించే సత్తా ఉన్న నాయకుడికే ఓటేయండి.

మంచి యువ నాయకులు దొరికితే సీమాంధ్ర లోనె కాదు తెలంగాణ లో కూడా పోటీ చేస్తా.

రాజకీయాలకు అతీతంగా పనిచేసే యువనాయకులు జనసేనకు అవసరం.

సీమాంద్ర ఎంపిలు వారి వ్యాపారాలపైనే దృష్టి పెట్టారు.

బీజేపీ నేత నరేంద్రమోడీని దేశ ప్రధానిగా చూడాలన్నది తమ ఆకాంక్ష. ధైర్యం ఉన్న నాయకుడు మోడీ.

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడలేని నాయకులు మనవాళ్ళు.
సముద్రం ఒకరి కాలి దగ్గర కూర్చొని మొరగదు. తుపాన్ ఒకరికి చిత్తం అనడం ఎరగదని, పర్వతం ఎవరికీ వొంగి సలాం చేయదని, నేనంతా కలిపి పిడికెడు మట్టే కావచ్చు, మనమందరం కలిసి పిడికెడు మట్టే కావచ్చు, కానీ మనం చేయెత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది.

రెండు ప్రాంతాల్లో ఏ పార్టీ అధికారం లోకి వచ్చిన వేషాలు వేసినా,నీతినియమాలు తప్పినా పార్టీ సిద్దంతాలు మాట్లాడవు,జనసేన ఉద్యమాలే మాట్లాడతాయి.

 జై హింద్ జై హింద్ జై హింద్...................................................
టీ20 వరల్డ్ కప్ లో మరొక ఆసక్తికర మ్యాచ్ జరిగింది. ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ రెండు మ్యాచ్ లు ప్రేక్షకులకు కనువిందు చేశాయి. శ్రీలంక,ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆసక్తికర మ్యాచ్ లో ఇంగ్లాండ్ 6వికెట్ల తేడాతో విజయం సాధించింది.
శ్రీలంక విసిరిన 190 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఇంకా నాలుగు బంతులుండగానే ఛేదించి ఫామ్ లో ఉన్న శ్రీలంకకు షాక్ ఇచ్చింది.మొదటి ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయి పరుగులేమి లేకుండానే 2వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ ను హేల్,మోర్గాన్ లు 3 వ వికెట్ కు 150 పరుగుల భాగస్వామ్యం తో ఆదుకున్నారు. మోర్గాన్ 57 పరుగులకు ఔట్ అయినా హేల్(116) అధ్బుత సెంచరీతో ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించాడు. కులశేఖర నాలుగు వికెట్లతో రాణించాడు.
అంతకముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఆదిలోనే పెరేరా ఔట్ అయినా జయవర్ధనే(89),దిల్షాన్(55) రాణించడంతో 20 ఓవర్లలో4 వికెట్ల నష్టానికి189 పరుగులు చేసింది.
బాలకృష్ణ నటించిన ఏ సినిమాకు లేని అంచనాలు 'లెజెండ్' చిత్రానికి ఉన్నాయి.భారీ అంచనాలతో ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది 'లెజెండ్' . బాలకృష్ణ,బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'సింహా' మంచి విజయం సాధించడంతో ఇదే కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రానికి ఊహించని రీతిలో అంచనాలు పెరిగాయి. బాలయ్య గెటప్ ఈ చిత్ర ప్రదానకర్షణ. రాజకీయ సంబంధమైన డైలాగ్ లు ఉన్నాయంటూ సెన్సార్ అధికారులు అభ్యంతరం చెప్పడంతో ఎలక్షన్ అధికారికి సినిమా చూపించి క్లియరెన్స్ తెచ్చుకోవాల్సి వచ్చింది సినిమా నిర్మాతలు. సెన్సార్ బోర్డ్ 'ఎ' సర్టిఫికేట్ జారీ చేయడంతో చిత్రాన్ని ఈనెల 28 న విడుదల చేయడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు నిర్మాతలు. విడుదలకు ముందే చిత్ర నిర్మాతలకు దాదాపు 6.5 కోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్లు సినిమా వర్గాల సమాచారం. సినిమా హిట్ అయితే లాభాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. చూడాలి రేపు విడుదల అవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకులు ఏ తీర్పు ఇస్తారో.
చెత్తగా ఆడి మొదటి మ్యాచ్ ఓడిపోయిన నెదర్లాండ్స్ ఈరోజు పటిష్ఠ దక్షిణాఫ్రికాకు చెమటలు పట్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 9 వికెట్లు 145 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ పటిష్ట బౌలింగ్ తో పరుగులు చేయడానికి సఫారీలు శ్రమించాల్సి వచ్చింది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ మొదటి 8 ఓవర్లలో 80 పరుగులకు 2వికెట్లతో పటిష్ట స్థితిలో ఉన్నా, నిర్లక్షంగా వికెట్లు చేజార్చుకొని గెలిచే అవకాశాన్ని 6 పరుగుల తేడాతో ఓడిపోయింది.
  1. అమెరికాలోని ఫోర్ట్ సిటీ, టెక్సాస్ మోటార్ స్పీడ్ వే లో ప్రపంచంలోనే అతిపెద్ద టీవీ, బిగ్ హాస్ ను ఆవిష్కరించారు. ఈ టీవిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గుర్తించింది.ఇది ఏడంతస్తుల భవనం పొడవు,218 అడుగుల వెడల్పు,94.6 అడుగుల పొడవు,2852 ఇంచులు దీని ప్రత్యేకతలు.
  2. అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన నౌక,సైన్య మరియు వైమానిక అధికారులకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కీర్తి చక్ర,శౌర్యచక్ర పురస్కారాలను ప్రదానం చేసారు.
  3. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ అసోచామ్ కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) ఎక్సలెన్స్ అవార్డు లభించింది.
ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్ పై వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన వెస్టిండీస్ తన మొదటి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. స్మిత్ 72 పరుగులు, గేల్ 48 పరుగులతో రాణించారు. 172 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఏ దశలోనూ పోరాడినట్టు కనిపించలేదు. 19.1 ఓవర్లలో 98 పరుగు చేసి ఆలౌట్ అయింది. బద్రి 4 వికెట్లు తీసుకున్నాడు. స్మిత్ మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
క్వాలిఫైయింగ్ మ్యాచ్ ల్లో దుమ్మురేపిన నెదర్లాండ్స్ ,సూపర్ 10 మ్యాచ్ ల్లో హేమా హేమీ లను తట్టుకొని ఆడడం కష్టమే అని తెలుస్తుంది. ఈరోజు శ్రీలంకతో జరిగిన తన మొదటి మ్యాచ్ లో నెదర్లాండ్స్ కేవలం 39 పరుగులకే ఆలౌట్ అయింది.
మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ మొదటినుండి బ్యాటింగ్ చేయడానికి కష్టపడింది. శ్రీలంక బౌలర్ల దాటికి 10.3 ఓవర్లలో కేవలం 39 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్. కూపర్ 16 పరుగులే అత్యధిక స్కోర్.
40 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక ఒక వికెట్ కోల్పోయి 5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది.  ఎక్కువ బంతులు మిగిలి ఉండగా విజయం సాధించడం టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.
 మాథ్యూస్ 4 వికెట్లు తీసి మ్యాన్ అఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.
బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఈరోజు న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో,దక్షిణాఫ్రికా అధ్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ గా సాగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై చేయి సాధించింది. విజయానికి చేరువకు వచ్చి చేతులెత్తేసింది న్యూజిలాండ్.
గెలుస్తుంది అనుకున్న న్యూజిలాండ్ ను అద్భుతమైన చివరి ఓవర్లో స్టెయిన్ నిప్పులు చెరిగాడు. చివరి ఓవర్లో న్యూజిలాండ్ విజయానికి కావాల్సింది 7 పరుగులుంఒదతి బంతికే వికెట్ తీసుకున్న స్టెయిన్ తరువాతి 3 బంతులకు పరుగులేమి ఇవ్వలేదు, 4వ బంతికి 4పరుగులు, 2 బంతులు 3 పరుగులు ఉన్న దశలో మళ్ళీ వికెట్ సాహించాడు స్టెయిన్, ఇక చివరి బంతికి 3 పరుగులు,బ్యాటింగ్ చేసేది టేలర్,రనౌట్ రూపంలో టేలర్ వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా చారిత్రక విజయాన్ని అందుకుంది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. డుమిని వేంగంగా 86(నాటౌట్) పరుగులు చేయడంతో మంచి లక్ష్యాన్ని న్యూ జిలాండ్ ముందుంచింది. న్యూజిలాండ్ జట్టు ఆది నుండి పరుగులు వేగంగా సాధిస్తూ విజయం వైపు దూసుకెళ్లింది. చివరి ఓవర్లో స్టెయిన్ రూపంలో న్యూజిలాండ్ కు ఓటమి తప్పలేదు. టేలర్ 62, విలియమ్స్ 51పరుగులతో రాణించారు. స్టెయిన్ 17 పరుగులకే 4 వికెట్లు సాధించాడు.
  1. ఎర్ర రక్త కణాలకు నష్టం కలగకుండా, మలేరియా పరాన్న జీవులను చంపడానికి కొత్త అణువు HSP90ని కనుగొన్నారు యునివర్సిటీ ఆఫ్ జనీవా పరిశోధకులు.
  2. దక్షిణాఫ్రికా పాఠశాలల బోధనా ప్రణాళికలో తిరిగి 5 భారతీయ భాషలను ప్రవేశపెట్టారు. హిందీ,తెలుగు,తమిళ్,గుజరాతి మరియు ఉర్దూ భాషలు ఇక నుండి దక్షిణాఫ్రికాలోని పాఠ్య పుస్తకాలలో కనిపించానున్నాయి.
  3. 80:20 పథకాలను  బంగారం దిగుమతి చేసుకోవడానికి RBI(Reserve Bank of India) 5 ప్రైవేటు బ్యాంకులకు విస్తరించింది.
  4. International Hockey Fedaration(FIH)హాకీ ఆటలో కొన్ని సవరణలను చేసింది. హాకీ ఆట వ్యవధి 70 నిమిషాల నుండి 60 నిమిషాలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుండి 15 నిమిషాల చొప్పున నాలుగు విరామ సమయాలు ఉంటాయి.
  5. 'ఎకాన్ నెదేఖ నాదిర్ గ్సిపారే ' అనే అస్సామీ చిత్రం నార్త్ కరోలినా ఫిలిం ఫెస్టివల్ లో 'ఆడియన్ ఛాయిస్ అవార్డ్ 2014' గెలుచుకుంది.
  6. లండన్ లో Indian Journalists's Association(IJA) కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా 'అదితి ఖన్నా' ఎంపికయ్యారు.
క్వాలిఫైయింగ్ మ్యాచ్ ల్లో దుమ్మురేపిన నెదర్లాండ్స్ ,సూపర్ 10 మ్యాచ్ ల్లో హేమా హేమీ లను తట్టుకొని ఆడడం కష్టమే అని తెలుస్తుంది. ఈరోజు శ్రీలంకతో జరిగిన తన మొదటి మ్యాచ్ లో నెదర్లాండ్స్ కేవలం 39 పరుగులకే ఆలౌట్ అయింది.
మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ మొదటినుండి బ్యాటింగ్ చేయడానికి కష్టపడింది. శ్రీలంక బౌలర్ల దాటికి 10.3 ఓవర్లలో కేవలం 39 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్. కూపర్ 16 పరుగులే అత్యధిక స్కోర్.
40 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక ఒక వికెట్ కోల్పోయి 5 ఓవర్లలో విజయాన్ని అందుకుంది.  ఎక్కువ బంతులు మిగిలి ఉండగా విజయం సాధించడం టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి.
 మాథ్యూస్ 4 వికెట్లు తీసి మ్యాన్ అఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు
బంగ్లాదేశ్ లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో ఈరోజు న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో,దక్షిణాఫ్రికా అధ్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ గా సాగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై చేయి సాధించింది. విజయానికి చేరువకు వచ్చి చేతులెత్తేసింది న్యూజిలాండ్.
గెలుస్తుంది అనుకున్న న్యూజిలాండ్ ను అద్భుతమైన చివరి ఓవర్లో స్టెయిన్ నిప్పులు చెరిగాడు. చివరి ఓవర్లో న్యూజిలాండ్ విజయానికి కావాల్సింది 7 పరుగులుంఒదతి బంతికే వికెట్ తీసుకున్న స్టెయిన్ తరువాతి 3 బంతులకు పరుగులేమి ఇవ్వలేదు, 4వ బంతికి 4పరుగులు, 2 బంతులు 3 పరుగులు ఉన్న దశలో మళ్ళీ వికెట్ సాహించాడు స్టెయిన్, ఇక చివరి బంతికి 3 పరుగులు,బ్యాటింగ్ చేసేది టేలర్,రనౌట్ రూపంలో టేలర్ వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా చారిత్రక విజయాన్ని అందుకుంది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. డుమిని వేంగంగా 86(నాటౌట్) పరుగులు చేయడంతో మంచి లక్ష్యాన్ని న్యూ జిలాండ్ ముందుంచింది. న్యూజిలాండ్ జట్టు ఆది నుండి పరుగులు వేగంగా సాధిస్తూ విజయం వైపు దూసుకెళ్లింది. చివరి ఓవర్లో స్టెయిన్ రూపంలో న్యూజిలాండ్ కు ఓటమి తప్పలేదు. టేలర్ 62, విలియమ్స్ 51పరుగులతో రాణించారు. స్టెయిన్ 17 పరుగులకే 4 వికెట్లు సాధించాడు.
నిన్న గుంటూరు లో జరిగిన ఘటన చూస్తుంటే తల్లిదండ్రులు ఇలా కూడా ఉంటారా అనే అనుమానం కలుగుతుంది. కులాంతర వివాహం చేసుకుందని కన్న కూతురునే కడతేర్చారు కసాయి తల్లిదండ్రులు.
     రాజేంద్ర నగర్ 2వ లైన్ లో నివాసముండే హరికృష్ణ, సామ్రాజ్యంల కుమార్తె దీప్తి హైదరాబాద్ లోని HCL కంపెనీలో  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. అక్కడే అనంతపల్లి కిరణ్ కుమార్ తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. దాదాపుగా రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరి ప్రేమను అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ప్రాజెక్ట్ పని మీద ఈ సంవత్సరం జనవరి లో అమెరికాకు వెళ్ళాడు కిరణ్. అమ్మాయి పేరెంట్స్ వేరే సంబంధాలు చూస్తుండడంతో దీప్తి కిరణ్ కు సమాచారం అందించడంతో వచ్చి ఈ నెల 21న ఆర్య సమాజ్ లో ఇద్దరు వివాహం చేసుకున్నారు.
    ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు హైదరాబాద్ కు వచ్చి పెళ్లి గ్రాండ్ గా చేద్దాం అని నమ్మబలికించి గుంటూరుకి తీసుకెళ్ళారు. దీప్తి మరియు కిరణ్ పేరెంట్స్ లాడ్జ్ లో ఉన్నారు. ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్ళింది దీప్తి. కొద్ది సేపటికే కిరణ్ ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి దీప్తి ఇంటికి చేరుకోగా ఇంటికి తాళం వేసి ఉండడంతో పోలీస్ లకు కంప్లైంట్ చేశాడు కిరణ్.  తాళాలు పగలగొట్టి చూస్తే దీప్తిని మంచానికి కట్టి చున్నీతో చంపేసి ఆమె తల్లిదండ్రులు పరారయ్యారు.
    కులమతాలకు పట్టింపులేని ఈరోజుల్లో పరువుకుపోయి కులాంతర వివాహం చేసుకుందని కన్న కూతురునే కర్కషంగా చంపిన తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని పలు సంఘాలు కోరుతున్నాయి. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దీప్తి తల్లిదండ్రులకోసం పోలీసులు గాలిస్తున్నారు. 
మీర్పూర్ : బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్నా టీ20 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ పై భారత్ సునాయాస విజయం సాధించింది. టాస్ గెలిచిన ధోని ముందుగా వెస్టిండీస్ ని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.
భారత్ కట్టిదిట్టమైన బౌలింగ్ తో వెస్టిండీస్ ఆది నుండి పరుగులు చేయడానికి తడబడింది. 20 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చేయగలిగింది విండీస్. 130 పరుగల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ మొదటి ఓవర్లోనే శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయిన విరాట్ కోహ్లి(54), రోహిత్ శర్మ(62నాటౌట్) రాణించారు. చివర్లో మందకోడిగా ఆడడంతో ఇంకా 2 బంతులు ఉండగా విజయాన్ని అందుకుంది భారత్.



మీర్పూర్ : టీ20 ప్రపంచకప్ ఆసక్తికర పోరులో ఆస్ట్రేలియా పై పాకిస్తాన్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఉమర్ అక్మల్ 70 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 94 పరుగులు చేసి చేసి సెంచరీ చేజార్చుకున్నాడు.
192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆది లోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి ఓవర్లోనే వార్నర్,వాట్సన్ ఔట్ అవడంతో కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా. అయితే మ్యాక్స్ వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లోనే 7ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 74 పరుగులు చేసి అఫ్రిది బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. విజయం సునయసమే అనుకున్నా మాక్స్ వెల్ ఔట్ అవడంతో మళ్ళీ కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా. ఒత్తిడిలో వికెట్లు త్వరత్వరగా కోల్పోయి 20 ఓవర్లలో 175 పరుగులు చేసి అన్ని వికెట్లు కోల్పోయిది. ఉమర్ అక్మల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.

ఆంధ్ర ప్రదేశ్ లో తొలి భారతీయ మహిళా బ్యాంక్ ప్రారంభం

1.హైదరాబాద్ లోని అమీర్‌పేట లో మార్చి22న తొలి భారతీయ మహిళా బ్యాంకు శాఖను ప్రారంభించారు.భారతీయ మహిళా బ్యాంకు చైర్మన్ ఉషా అనంత సుబ్రమణియన్ ఈ బ్యాంకు శాఖను ప్రారంభించారు.దేశంలో 19వ శాఖ అమీర్ పేట శాఖ.
భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నవంబర్19,2013 న మొదటి మహిళా బ్యాంకును ముంబై లో ప్రారంభించారు.

ఆయుధాల దిగుమతి వ్యవస్థ లో భారత్ మొదటి స్థానం

2.SIPRI(Stockholm International Peace Research Institute) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం 2004-13 మధ్య కాలంలో ఆయుధాల దిగుమతిలో ఇండియా మొదటి స్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. పాకిస్తాన్, చైనా లతో పోల్చుకుంటే భారత్ ఆయుధాల దిగుమతి వ్యవస్థ మూడు వంతులు అధికంగా ఉన్నట్లు తెలిపింది.
బంగ్లాదేశ్ వేదికగా మహిళా టీ20 ప్రపంచకప్ ఆదివారం ప్రారంభం కానుంది. సిల్ హాట్ లో జరిగే మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ తలబడనున్నాయి.
మిథాలి రాజ్ సారథ్యంలోని భారత్ జట్టు సోమవారం తన మొదటి మ్యాచ్ లో శ్రీలంక తో తలబడుతుంది. మార్చి26న ఇంగ్లాండ్ తో, 30న బంగ్లాదేశ్ తో, ఏప్రిల్1న వెస్టిండీస్ తో భారత జట్టు తలబతుంది.
వెస్టిండీస్ తో భారత్ అమీ-తుమీ నేడు 
ఈరోజు సాయంత్రం 7 గంటలకు వెస్టిండీస్ తో భారత్ తలబడుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న వెస్టిండీస్ బలంగా ఉంది,ఆల్ రౌండర్లు, హార్డ్ హిట్టర్లు ఎక్కువగా ఉన్న వెస్టిండీస్ తక్కువ అంచనా వేయలేమని భారత్ కి తెలుసు. టీ20 లకే అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు గేల్ ఉండడం వెస్టిండీస్ బలం.

వాళ్లకు సిక్సర్లు భాదడమే తెలుసునని, స్పిన్నర్ల బౌలింగ్ లో స్ట్రైక్ రొటేట్ చేయడం తెలియదు, మిశ్రా,అశ్విన్,జడేజా రూపంలో మా స్పిన్ బలంగా ఉంది సురేష్ రైనా అన్నారు. అయితే రైనా వ్యాఖ్యలకు సామి కౌంటర్ ఇచ్చాడు. మేము కేవలం సిక్సర్లు కొట్ట గలమని రైనా భావిస్తే ఆ సిక్సర్లు కొట్టకుండా ఆపుకోవాలని అని సామి అన్నారు.

గత రెండు టీ20 ప్రపంచకప్ (2009,2010)లలో భారత్ పై వెస్టిండీస్ విజయం సాధించింది
టీ20 ప్రపంచకప్ లో నేడు ఆస్ట్రేలియా తన మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ తో తలబడుతుంది. పాకిస్తాన్ మొదటి మ్యాచ్ లో భారత్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ జరుగుతుంది.
ఇక రెండో మ్యాచ్ భారత్ డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ తో తలబడుతుంది.మొదటి మ్యాచ్ లో పాకిస్తాన్ పై విజయంతో ఆత్మ విశ్వాసంతో ఉంది ధోని సేన.
ఇంగ్లాండ్ ఆశలపై వరుణ దేవుడు నీళ్ళు చల్లాడు. 173 పరుగుల విజయ లక్ష్య చేధనను న్యూజిలాండ్  ముందుంచింది ఇంగ్లాండ్. వర్షం అంతరాయం కలిగించే సమయానికి న్యూజిలాండ్ 5.2 ఓవర్లు ముగిసే సరికి 52 పరుగులు చేసి ఒక్క వికెట్ కోల్పోయింది.
   కాని ఆ సమయానికి న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో 43 పరుగులు మాత్రమే అవసరం. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్దతి ప్రకారం న్యూజిలాండ్  9 పరుగుల తేడాతో విజయం సాధించింది.విలియమ్స్ 24,మెక్ కల్లమ్16 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
   టీ20 ప్రపంచకప్ లో భాగంగా శనివారం ఇంగ్లాండ్ మరియు న్యూజిలాండ్ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 172 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. మొయిన్ ఆలీ(36), మైకేల్ లంబ్(33), బట్లర్(32) రాణించారు.
 

టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్ లో శ్రీలంక 5 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. పెరేరా 61,మాథ్యుస్ 43 పరుగులతో రాణించారు.
166 లక్ష్య చేదనతో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా తడబడింది. ఓపెనర్లు రాణించిన చివర్లో వికెట్లు త్వరత్వరగా కోల్పోయారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే సాధించి ఓటమిపాలైంది.
ఇప్పటి వరకు ప్రపంచకప్ లో భారత్ పై గెలవని పాకిస్తాన్ ఈసారైనా విజయం సాధించాలనే కల కలగానే మిగిలిపోయింది. ప్రపంచకప్ లో పాకిస్తాన్ పై భారత్ విజయాల పరంపరను కొనసాగించింది. 131 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ధోని సేన మొదటి 3 ఓవర్లలో కేవలం 7 పరుగులు మాత్రమే చేయగలిగింది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మొదట తడబడినా 50 పరుగుల మొదటి వికెట్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తరువాత 11 పరుగుల వ్యవదిలో శిఖర్ 30(28), రోహిత్24(21),యువరాజ్ సింగ్1(2) లు అవుట్ అవడంతో కష్టాల్లో పడ్డట్టు కనిపించినా సూపర్ ఫామ్ లో ఉన్న కోహ్లి36(32),రైనా35(28) అద్భుతంగా ఆడారు.ఇంకో వికెట్ పడకుండా మ్యాచ్ ముగించారు.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఆది నుండి పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ పరుగులు చేయకుండా భారత్ బౌలర్లు కట్టడి చేశారు. భారత్ బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు మిశ్రా, జడేజా మరియు అశ్విన్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. మిశ్రా 22 పరుగులకు 2 వికెట్లు,జడేజా,షమీ, భువనేశ్వర్ కుమార్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఉమర్ అక్మల్ 33 ,శెహజాద్ 22, మక్సూద్ 21 పరుగులతో రాణించారు.
Man of the match : Amit Mishra

India Innings -131/3 (18.3 overs)

BattingOut DescRB4s6sSR
Rohit Sharmab Ajmal242112114.3
Shikhar Dhawanc Ajmal b U Gul302850107.1
Virat Kohlinot out363241112.5
Yuvraj Singhb B Bhatti120050.0
Suresh Rainanot out352841125.0
Extras 5(b - 0 w - 5, nb - 0, lb - 0)
Total 131(18.3 Overs, 3 Wickets)

Pakistan Innings -130/7 (20 overs)

BattingOut DescRB4s6sSR
Kamran Akmal (wk)run out (Bhuvneshwar)8102080.0
Ahmed Shehzadst Dhoni b A Mishra221720129.4
Mohammad Hafeez (c)c Bhuvneshwar b R Jadeja15221068.2
Umar Akmalc Raina b Shami333020110.0
Shoaib Malikc Raina b A Mishra18201190.0
Shahid Afridic Raina b Bhuvneshwar8101080.0
Sohaib Maqsoodrun out (R Jadeja/Dhoni)211121190.9
Bilawal Bhattinot out00000.0
Extras 5(b - 0 w - 3, nb - 0, lb - 2)
Total 130(20 Overs, 7 Wickets)
BowlerOMRWER
Ravichandran Ashwin402305.8
Bhuvneshwar Kumar302117.0
Mohammed Shami403117.8
Amit Mishra412225.5
Ravindra Jadeja401814.5
Yuvraj Singh1013013.0
| Copyright © 2013 Radio Jalsa News