ప్రముఖ దర్శకుడు బాపు కన్నుమూత

ప్రముఖ రచయిత,దర్శకుడు,చిత్రకారుడు బాపు గుండెపోటుతో చెన్నై లో కన్నుమూశారు.బాపు వయసు 80 ఏళ్ళు.చెన్నైలోని మలర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు బాపు.బాపూ అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీ నారాయణ.1933 డిసెంబర్ 15న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు.ఆంధ్రపత్రికలో ఆయన కార్టూనిస్తుగా కెరీర్ ప్రారంభించిన ఆయన సంగీతకారుడిగా, చిత్రకారుడిగా, కార్టునిస్ట్ గా, డిజైనర్ గా పలు రంగాల్లో ఆయన సేవలు మరవలేనివి.
బాపు మొదటి సినిమా సాక్షి,చివరి సినిమా శ్రీ రామరాజ్యం.బాపూ తన కెరీర్ లో మొత్తం 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు.రెండు జాతీయ పురస్కారాలు,5 నంది అవార్డులు,ఉత్తమ దర్శకుడిగా రెండు ఫిలిం ఫేర్ అవార్డులు బాపూ గారి సొంతం.2012 సంవత్సరానికి గాను లైఫ్ టైం అచీవ్ మెంట్(ఫిలిం ఫేర్-సౌత్)అవార్డును బాపూ గారు గెలుచుకున్నారు.
ముత్యాలముగ్గు,మిస్టర్ పెళ్లాం చిత్రాలకు జాతీయ పురస్కారం..బాలరాజుకథ, అందాల రాముడు, ముత్యాలముగ్గు, పెళ్లిపుస్తకం, శ్రీరామరాజ్యం చిత్రాలకు నంది అవార్డు..సీతా కల్యాణం,వంశ వృక్షం చిత్రాలకు ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు బాపూ.
1986 సంవత్సరంలో రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్న బాపూ,2013 సంవత్సరంలో పద్మశ్రీ తో ప్రభుత్వం సత్కరించింది.
బాపు మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పవచ్చు.హిందీలో కూడా చిత్రాలు చేసిన బాపూ మొదటి హిందీ సినిమా ప్రేమ్ ప్రతిజ్ఞ 1989 లో వచ్చింది.హమ్ పాంచ్, సీతా స్వయవర్, అనోఖా భక్త్, బేజుబాన్, వో సాత్ దిన్, ప్యారీ బహ్నా, మొహబ్బత్, మేరా ధరమ్ మొదలగు హిందీ చిత్రాలకు బాపూ దర్శకత్వం వహించారు.
బాపూ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.బాపు లేని లోటు తీర్చలేనిది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

3 comments:

  1. "....51 చిత్రాలకు సంగీతం అందించారు...."
    బాపూ గారు సంగీతం అందించటం ఎప్పుడు జరిగిందండీ!సమాచారం అందించేప్పుడు దయచేసి కొంత సరిచూసుకుని అందించగలరు

    బాపూ గారి అస్తమయం తెలుగు సినిమాకు ఒక తీరని లోటు.

    ReplyDelete
    Replies
    1. అవునండి.తొందరలో పొరపాటు జరిగింది.ధన్యవాదాలు ప్రసాద్ గారు.

      Delete
  2. "బాపు"రే అందమైన బొమ్మలు ఇకపై చిటారుకొమ్మన అందని తాయిలాలే !

    ReplyDelete

| Copyright © 2013 Radio Jalsa News