కబడ్డీలో భారత్ సత్తా ఏంటో మరోసారి ఋజువైంది.ఇంచియాన్ లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు ఇరాన్ ను ఓడించి వరుసగా 7వ సారి బంగారు పతకాన్ని దక్కించుకుంది.హోరాహోరీగా జరిగిన ఫైనల్ లో 27-25 తో ఇరాన్ ను చిత్తు చేసింది.
మొదటి హాఫ్ పూర్తయ్యే సమయానికి భారత్ 13-21 స్కోరు తేడాతో వెనకబడింది.ద్వితీయార్థంలో ఒక్కసారిగా పుంజుకున్న భారత్ ఆటగాళ్ళు 14 పాయింట్లు సాధించగా ఇరాన్ కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది.జస్వీర్,రాహుల్,రాకేశ్ రైడింగ్ లో రాణించారు.
1990లో మొదటిసారి ఆసియా క్రీడల్లో కబడ్డీ ఆటను ప్రవేశపెట్టారు.అప్పటినుండి ఇప్పటి వరకు భారత్ పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని గెలుస్తూ వస్తుంది.భారత మహిళల జట్టు కూడా ఇరాన్ ను ఫైనల్ లో ఓడించి వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని దక్కించుకుంది
రాష్ట్రపతి,ప్రధాని ఇద్దరూ భారత్ జట్టుకు శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

భారత మహిళా కబడ్డీ జట్టు 17వ ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని నెగ్గి తమకు ఎదురులేదని మరోసారి నిరూపించింది.ఇది భారత మహిళా కబడ్డీ జట్టు వరుసగా రెండో స్వర్ణ పతకం.
శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా జట్టు ఇరాన్ పై 31—21 తో గెలిచింది.కబడ్డీలో ఎదురులేని భారత మహిళా జట్టు కష్టపడకుండానే సునాయాసంగా గెలిచింది.గత ఆసియా క్రీడల నుండే మహిళా కబడ్డీ చేర్చారు.
భారత్ మహిళా జట్టు స్వర్ణం గెలవడం గర్వకారణమని,వారికి నా కృతజ్ఞతలు అని ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
గురువారం హైదరాబాద్ లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20 రెండో సెమీఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ 65 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మీద ఘనవిజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది.అక్టోబర్ 4 శనివారం బెంగళూరులో జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై,కోల్ కతాలు తలబడనున్నాయి.
హోరాహోరీగా జరుగుతుంది అనుకున్న మ్యాచ్ కాస్త ఏకపక్షంగా సాగింది.టాస్ గెలిచిన పంజాబ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.మొదట్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన పంజాబ్ బౌలర్లు చెన్నై మొదటి మూడు వికెట్లు 41 పరుగులకే కూల్చారు.తరువాత జతకలిసిన డుప్లేసిస్,బ్రావో స్కోర్ వేగాన్ని పెంచారు.డుప్లేసిస్ 33 బంతుల్లో 46 పరుగులు చేయగా బ్రావో 39 బంతుల్లో 7 ఫోర్లు,4 సిక్సుల సహాయంతో 67 పరుగులు చేసి ఔటయ్యారు.తరువాత వెంటనే రెండు వికెట్లు కోల్పోయినా చివర్లో జడేజా(27*) వేగంగా పరుగులు చేయడంతో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది చెన్నై.
183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఏ క్షణంలోనూ లక్ష్య చేదన దిశగా సాగలేదు.పంజాబ్ భారీ హిట్టర్లు సెహ్వాగ్,మ్యాక్స్ వెల్,పెరేరాలు పరుగులేమి చేయకుండానే అవుటయ్యారు.చెన్నై బౌలర్ల ధాటికి పంజాబ్ ఒక దశలో 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడింది.చివర్లో అక్షర్ పటేల్ 31 పరుగులు చేయడం,చివరి వికెట్ కు కరణ్ వీర్ సింగ్,అనురీత్ సింగ్ లు 27 పరుగులు జోడించడంతో 117 పరుగులకు ఆలౌట్ అయి ఇంటిదారి పట్టింది.
మ్యాన్ అఫ్ ద మ్యాచ్ డారెన్ బ్రావోకు దక్కింది.
ఐపీఎల్ ఫామ్ నే కొనసాగిస్తూ ఛాంపియన్స్ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్ కతా నైట్ రైడర్స్ గురువారం హైదరాబాద్ లో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో హోబార్ట్ హరికేన్ పై సునాయాస విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న హరికేన్స్ ఆదిలోనే తడబడింది.జట్టు స్కోరు 13 పరుగుల వద్ద మైకేల్,ఫామ్ లో ఉన్న బ్లిజార్డ్ ఇద్దరూ డకౌట్ రూపంలో వెనుదిరిగారు.బెన్ డంక్ 39 పరుగులు,షోయబ్ మాలిక్ 66 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది.చావ్లా,పఠాన్,యాదవ్,రస్సెల్,నరైన్ తలా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 20 పరుగుల వద్ద గంభీర్(4),44 పరుగుల వద్ద ఊతప్ప(17) ఔట్ అవడంతో కష్టాల్లో పడ్డట్టు కనిపించింది.కాని కలిస్,పాండేలు సమయోచితంగా ఆడి 63 పరుగులు జోడించారు.32 బంతుల్లో 40 పరుగులు చేసిన మనీష్ పాండే జట్టు స్కోర్ 107 పరుగుల వద్ద పెవీలియన్ బాట పట్టాడు.తరువాత కలిస్ కు జతకలిసిన పఠాన్(14*) మరో వికెట్ పడకుండా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగా విజయాన్ని అందుకున్నారు.కలిస్ 54 పరుగులతో నాటౌట్ గా నిలిచి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

4x400 మీ రిలేలో భారత్ మహిళల జట్టు 17వ ఆసియా గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.ప్రియాంక పన్వర్,టింటు ల్యుకా,మన్ దీప్ కౌర్,పూవమ్మ లతో కూడిన భారత్ జట్టు 3:28:68 సమయంలో రేసు ముగించి స్వర్ణాన్ని దక్కించుకుంది.దీంతో వరుసగా నాలుగు సార్లు(2002 బూసాన్ ఆసియా క్రీడలనుండి)భారత్ మహిళల రిలే జట్టు స్వర్ణాన్ని గెలుస్తూ వస్తుంది.2010 ఆసియా క్రీడల్లో నమోదు చేసిన సమయం(3:29.02)కంటే ఈసారి అత్యున్నత సమయం నమోదు చేశారు భారత మహిళల రిలే జట్టు.
జపాన్ 3:30.80 సమయంతో రెండోస్థానంలో నిలిచి రజత పతకాన్ని,చైనా 3:32.02 సమయతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాయి.చివరి ల్యాప్ లో పరిగెత్తిన పూవమ్మ అనూహ్యంగా పుంజుకొని జపాన్ క్రీడాకారిణిని వెనక్కినెట్టి మొదటి స్థానంలో నిలిచి భారత్ కు వరుసగా 4వ స్వర్ణాన్ని అందించింది.
పురుషుల షాట్ పుట్ విభాగంలో 20 సంవత్సరాల ఇందర్జీత్ 19.63 మీటర్లు విసిరి కాంస్య పతాకాన్ని దక్కించుకున్నాడు.ట్రిపుల్ జంప్ లో స్వర్ణాన్ని ఆశించిన అర్పిందర్ సింగ్ 5వ స్థానంలో నిలిచి నిరాశపరిచాడు.
భారత అథ్లెట్లు ఇప్పటివరకు 13 పతకాలు గెలుచుకున్నారు.అందులో రెండు స్వర్ణాలు,3 రజత,8 కాంస్యాలు ఉన్నాయి.గత ఆసియా క్రీడల కంటే ఒక పతకాన్ని ఎక్కువగా గెలుచుకున్నా స్వర్ణ పతకాల సంఖ్య మాత్రం తగ్గింది.గతసారి 5 స్వర్ణ,2 రజత,5 కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

ఎట్టకేలకు భారత హాకీ జట్టు ఆసియా క్రీడల్లో బంగారు పతాకాన్ని సాధించింది.16 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది.చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను ఫైనల్ లో చిత్తు చేసి స్వర్ణం చేజిక్కించుకుంది.
ఇంచియాన్ వేదికగా జరుగుతున్న 17వ ఆసియా గేమ్స్ లో భాగంగా పురుషుల హాకీ ఫైనల్ లో భారత్,పాక్ లు తలబడ్డాయి.హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ జట్టు షూటౌట్ ద్వారా 4-2 తేడాతో పాక్ ను ఓడించి 2016లో జరిగే రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించింది.
ఆట నిర్ణీత సమయం 60 నిమిషాల్లో ఇరు జట్లు చెరో గోల్ చేయడంతో మ్యాచ్ ఫలితాన్ని పెనాల్టీ షూటవుట్ ద్వారా నిర్ణయించారు.భారత గోల్ కీపర్ శ్రీజేష్ పాక్ ఆటగాళ్ళు కొట్టిన షాట్లు గోల్ కాకుండా అధ్బుతంగా అడ్డుకొని భారత్ కు స్వర్ణం అందించడంలో ముఖ్యపాత్ర పోచించాడు.
సినిమాలు విడుదలయ్యాక వాటికి అదనంగా సన్నివేశాలు,పాటలు చేర్చడం తరచుగా చూస్తుంటాం.మన తెలుగు సినిమాల్లో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి.అక్టోబర్ 1న విడుదలైన రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం కూడా ఈ కోవలోకే వెళ్తుంది.కుటుంబ కథా చిత్రంగా ఇప్పటికే మంచి టాక్ సంపాదించుకున్న ఈసినిమాకు అదనంగా మరో పాటను చేరుస్తున్నారు.
పాట చిత్రీకరణ కూడా మొదలైంది.దసరా పండగ రోజు కూడా విరామం లేకుండా ఈ పాటను చిత్రీకరించే పనిలో పడ్డారు.మూడు లేదా నాలుగు రోజుల్లో పాటను చేర్చనున్నారు.పాట పూర్తయ్యేవరకు ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా పని చేయాలని హీరో రామ్ చరణ్ డిసైడ్ అయ్యారు.అయితే ఈసినిమా ప్రిమియర్ షోకు అమెరికా వెళ్ళాలని నిశ్చయించుకున్న రామ్ చరణ్ పాట చిత్రీకరణ ఉండడంతో ఇక్కడే ఆగిపోయాడు.
ఇది వరకు కూడా రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రంలో కూడా అదనపు సన్నివేశాలు చేర్చారు.మొదట సినిమా నిడివి ఎక్కువైందని భావించి తరువాత సూపర్ హిట్ టాక్ వచ్చాక కొన్ని సన్నివేశాలు కలిపారు.మరి ఇప్పుడు అదనంగా చేర్చుతున్న పాటతో సినిమాకు ప్లస్ అవుతుందో లేదో చూడాలంటే ఇంకో 4 రోజులు ఆగాల్సిందే.
దసరా పండగ రేసులో విడుదలైన 'గోవిందుడు అందరివాడేలే' మొదటి ఆటనుండే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.అక్టోబర్ 1 బుధవారం నాడు రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో మొదటిసారి రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కాజల్ కథానాయిక.బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీకాంత్,కమలినీ ముఖర్జీ,ప్రకాష్ రాజ్,జయసుధ,పోసాని,కోట శ్రీనివాసరావు,రావు రమేష్ ముఖ్య తారాగణం.సినిమా కథా విశేషాల్లోకి వెళ్తే....
ఊరు బాగోగులు కోరుకునే వ్యక్తి బాలరాజు(ప్రకాష్ రాజ్)కు ఇద్దరు కుమారులు.పెద్దవాడు చంద్రశేఖర్(రహమాన్),చిన్నవాడు బంగారం(శ్రీకాంత్).చంద్రశేఖర్ డాక్టర్ కావాలని,ఊరి ప్రజలకు మెరుగైన వైద్యం చేయాలని బాలరాజు కోరుకుంటాడు.డాక్టర్ కావాలనే కోరికను చంద్రశేఖర్ తిరస్కరించడంతో తండ్రీకొడుకులు విడిపోతారు.చంద్రశేఖర్ వెళ్లి లండన్ లో స్థిరపడతారు.చంద్రశేఖర్ కుమారుడు అభిరామ్(రామ్ చరణ్)లండన్ లో పెరిగినా భారతీయ సాంప్రదాయాల పట్ల మంచి గౌరవం ఉంటుంది.
తండ్రికీ.తాతకు మధ్య విభేదాలు ఏంటో తన తండ్రి ద్వారా తెలుసుకున్న అభిరామ్ ఇండియాకు వస్తాడు.బాలరాజు కుటుంబంలో తమ ఫ్యామిలీ కూడా కలపాలని ఆరాటపడే అభిరామ్ అపరిచితునిగా బాలరాజు ఇంట్లోకి ప్రవేశిస్తాడు.అలా వచ్చిన అభిరామ్ తను అనుకున్న లక్ష్యాన్ని అధిగమించాడా?అభిరామ్ ఆ కుటుంబ వారసుడే అని బాలరాజుకు తెలుస్తుందా?తెలిస్తే ఏవిధంగా స్పందిచారు?తన మరదలు సత్య(కాజల్)ప్రేమను ఎలా దక్కించుకున్నాడు?చివరికి ఏమైంది వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్
కుటుంబ విలువలు,బాంధవ్యాలు మొదలగు అంశాలు సినిమాలో చక్కగా చూపించారు.రామ్ చరణ్ కుటుంబ కథా చిత్రాలను ఎలా చేస్తాడో అనుకున్నారు,కాని ఊహించినదానికంటే అధ్బుతంగా నటించాడు.ఇప్పటివరకు తను నటించిన చిత్రాలకు ఇది భిన్నం అని చెప్పవచ్చు.నటన పరంగా రామ్ చరణ్ 100 మార్కులు కొట్టేశాడు.రామ్ చరణ్,కాజల్ ల కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగుంటుంది.తెలుగు ప్రేక్షకులకు మంచి కుటుంబ కథా చిత్రం అందించాలని తలచిన దర్శకుడు కృష్ణవంశీ అందులో విజయం సాధించాడు అని చెప్పవచ్చు.ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది.బాలరాజు పాత్రలో ప్రకాష్ రాజ్ జీవించాడు,ప్రకాష్ రాజ్ మాత్రమే ఇలాంటి పాత్రలకు న్యాయం చేయగలడు అని మరోసారి నిరూపించాడు.
మైనస్ పాయింట్స్
సంగీతం,ఫస్ట్ హాఫ్ కొంత స్లో అయినట్టు అనిపిస్తుంది.రొటీన్ కథే అన్న ఫీలింగ్ కలుగుతుంది.నెగెటివ్ పాత్రలకు ఇంకొంచెం స్ట్రాంగ్ గా డిజైన్ చేయాల్సింది.
పాత్రలకు తగ్గట్టు సినిమాలో ప్రతీఒక్కరూ బాగా నటించారు.జయసుధ,కమలినీ ముఖర్జీ,శ్రీకాంత్,రావు రమేష్,కోట తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేశారు.
దసరా కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం.మంచి కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశాలు చాలానే ఉన్నాయి.8వ చిత్రం ఫాఫ్ అనే ఫోబియాను రామ్ చరణ్ అధిగమించాడు అని చెప్పొచ్చు .
రేడియో జల్సా రేటింగ్ :3.25/5
ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వద్ద రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 12 మంది చనిపోగా 45 మందికి గాయాలయ్యాయి.
మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో రెండు ప్యాసింజర్ రైళ్లు అతి సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
వారణాసి నుండి గోరఖ్ పూర్ వెళుతున్న కృషక్ ఎక్స్ ప్రెస్ లక్నో నుండి బరౌనీకి వెళ్తున్న బరౌనీ ఎక్స్ ప్రెస్ ను ఢీకొంది.ఈ ఘటన మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిందని రైల్వే అధికారి అలోక్ సింగ్ చెప్పారు.బరౌనీ రైలుకు చెందిన మూడు భోగీలు పట్టాలు తప్పాయని సింగ్ తెలిపారు.మరో అధికారి సక్సేనా మాట్లాడుతూ కృషక్ రైలు డ్రైవర్లు సిగ్నల్ పట్టించుకోకుండా ముందుకు సాగడంవల్ల ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.ఆ ఇద్దరు డ్రైవర్లను ఉద్యోగం నుండి వెంటనే తొలిగించారు.
క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.

మైక్రోసాఫ్ట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ తన తదుపరి విండోస్ వర్షన్ 10 అని ప్రకటించింది.అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ విండోస్-9 తదుపరి వర్షన్ అనుకున్న ప్రతీ ఒక్కరికి షాక్ ఇస్తూ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ను వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నట్లు తెలిపింది.

మంగళవారం భారత కాలమాన ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో సాన్ ఫ్రాన్సిస్కో లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ విషయాలు తెలిశాయి.మైక్రోసాఫ్ట్ లో ఆపరేటింగ్ సిస్టమ్స్ హెడ్ గా ఉన్న టెర్రీ మ్యేర్సన్ ఈ వివరాలు వెల్లడించారు.
టెర్రీ మ్యేర్సన్ వివరాలు చెప్తూ విండోస్ విడుదల చేస్తున్న తదుపరి ఆపరేటింగ్ సిస్టం పేరు విండోస్ 9 ఎందుకు పెట్టలేదో మాత్రం వివరించలేదు.1.5 మిలియన్ మంది ప్రస్తుతం విండోస్ ఉపయోగిస్తున్నారు అని ఈ ఈవెంట్ ను నిర్వహించిన టెర్రీ చిన్న స్టూల్ మీద కూర్చొని వివరించారు.సరికొత్త జనరేషన్ కు విండోస్ 10 ప్రాతినిధ్యం వహిస్తుంది అని టెర్రీ ఆశాభావం వ్యక్తం చేశారు.విండోస్ 10 ఒక సమగ్ర వేదిక కానుంది అని టెర్రీ తెలిపారు.


| Copyright © 2013 Radio Jalsa News