భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇప్పటి వరకు టీడీపీ 6 సార్లు గెలుపొందగా 4సార్లు కాంగ్రెస్ గెలుచుకుంది. పీడీఎఫ్, సీపీఐ ఒక్కోసారి గెలుపొందాయి. నల్గొండ జిల్లా అంటే కమ్యూనిస్ట్ ల ప్రాభవం ఎక్కువగా ఉన్న జిల్లా, కాని భువనగిరి నియోజకవర్గం మాత్రం అందుకు భిన్నం. 1962లో సీపీఐ గెలుపు మినహా ఇప్పటి వరకు కమ్యూనిస్ట్ ల ప్రాభవం భువనగిరి నియోజకవర్గం మీద లేదు.
అత్యధికంగా టీడీపీ అభ్యర్థి ఎలిమినేటి మాధవ రెడ్డి 4 సార్లు ఇక్కడి నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తరువాత కొండా లక్ష్మణ్ బాపూజీ 3సార్లు, ఉమా మాధవ రెడ్డి 2సార్లు గెలిచారు.1985 నుండి ఇప్పటి వరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ మినహా మరే పార్టీ గెలుచుకోలేదు. అది కూడా మాధవ రెడ్డి కుటుంబమే చక్రం తిప్పుతుంది ఇక్కడ. మాధవ రెడ్డి నక్సల్స్ బాంబ్ పేల్చిన ఘటనలో మరణించిన అనంతరం ఆయన సతీమణి ఉమా మాధవ రెడ్డి 2004,2009లో వరుసగా విజయం సాధించింది.క్విట్ ఇండియా,నాన్ ముల్కీ మరియు తెలంగాణా ఉద్యమాల్లో పాల్గొన్న కొండా లక్ష్మణ్ బాపూజీ కాంగ్రెస్ పార్టీ నుండి 1967,72,78 లో మూడు సార్లు గెలిచారు.
ఇప్పటి వరకు ఎవరెవరు గెలిచారు
1957 - ఆర్. నారాయణ రెడ్డి(పీడీఎఫ్)
1962 - ఎ. రామచంద్రా రెడ్డి (సీపీఐ)
1967,1972,1978 - కొండా లక్ష్మణ్ బాపూజీ (కాంగ్రెస్)
1983 - కొమ్మిడి నరసింహా రెడ్డి (కాంగ్రెస్)
1985,89,94,99 - ఎలిమినేటి మాధవ రెడ్డి(టీడీపీ)
2004,09 - ఉమా మాధవ రెడ్డి(టీడీపీ)
2014 ఎన్నికల విషయానికి వస్తే తెరాస పార్టీ నుండి పైలా శేఖర్ రెడ్డి, టీడీపీ నుండి మరోసారి ఉమా మాధవ రెడ్డి, కాంగ్రెస్ నుండి వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు.