గురువారం హైదరాబాద్ లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20 రెండో సెమీఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ 65 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మీద ఘనవిజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది.అక్టోబర్ 4 శనివారం బెంగళూరులో జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై,కోల్ కతాలు తలబడనున్నాయి.
హోరాహోరీగా జరుగుతుంది అనుకున్న మ్యాచ్ కాస్త ఏకపక్షంగా సాగింది.టాస్ గెలిచిన పంజాబ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.మొదట్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన పంజాబ్ బౌలర్లు చెన్నై మొదటి మూడు వికెట్లు 41 పరుగులకే కూల్చారు.తరువాత జతకలిసిన డుప్లేసిస్,బ్రావో స్కోర్ వేగాన్ని పెంచారు.డుప్లేసిస్ 33 బంతుల్లో 46 పరుగులు చేయగా బ్రావో 39 బంతుల్లో 7 ఫోర్లు,4 సిక్సుల సహాయంతో 67 పరుగులు చేసి ఔటయ్యారు.తరువాత వెంటనే రెండు వికెట్లు కోల్పోయినా చివర్లో జడేజా(27*) వేగంగా పరుగులు చేయడంతో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది చెన్నై.
183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఏ క్షణంలోనూ లక్ష్య చేదన దిశగా సాగలేదు.పంజాబ్ భారీ హిట్టర్లు సెహ్వాగ్,మ్యాక్స్ వెల్,పెరేరాలు పరుగులేమి చేయకుండానే అవుటయ్యారు.చెన్నై బౌలర్ల ధాటికి పంజాబ్ ఒక దశలో 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడింది.చివర్లో అక్షర్ పటేల్ 31 పరుగులు చేయడం,చివరి వికెట్ కు కరణ్ వీర్ సింగ్,అనురీత్ సింగ్ లు 27 పరుగులు జోడించడంతో 117 పరుగులకు ఆలౌట్ అయి ఇంటిదారి పట్టింది.
మ్యాన్ అఫ్ ద మ్యాచ్ డారెన్ బ్రావోకు దక్కింది.
ఐపీఎల్ ఫామ్ నే కొనసాగిస్తూ ఛాంపియన్స్ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్ కతా నైట్ రైడర్స్ గురువారం హైదరాబాద్ లో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో హోబార్ట్ హరికేన్ పై సునాయాస విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న హరికేన్స్ ఆదిలోనే తడబడింది.జట్టు స్కోరు 13 పరుగుల వద్ద మైకేల్,ఫామ్ లో ఉన్న బ్లిజార్డ్ ఇద్దరూ డకౌట్ రూపంలో వెనుదిరిగారు.బెన్ డంక్ 39 పరుగులు,షోయబ్ మాలిక్ 66 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది.చావ్లా,పఠాన్,యాదవ్,రస్సెల్,నరైన్ తలా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 20 పరుగుల వద్ద గంభీర్(4),44 పరుగుల వద్ద ఊతప్ప(17) ఔట్ అవడంతో కష్టాల్లో పడ్డట్టు కనిపించింది.కాని కలిస్,పాండేలు సమయోచితంగా ఆడి 63 పరుగులు జోడించారు.32 బంతుల్లో 40 పరుగులు చేసిన మనీష్ పాండే జట్టు స్కోర్ 107 పరుగుల వద్ద పెవీలియన్ బాట పట్టాడు.తరువాత కలిస్ కు జతకలిసిన పఠాన్(14*) మరో వికెట్ పడకుండా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగా విజయాన్ని అందుకున్నారు.కలిస్ 54 పరుగులతో నాటౌట్ గా నిలిచి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

రాయ్ పూర్ లో జరుగుతున్న ఛాంపియన్స్ లీగ్ టీ20 క్వాలిఫయింగ్ మ్యాచ్ ల్లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు శ్రీలంకకు చెందిన సథరన్ ఎక్స్ ప్రెస్ పై సునాయాస విజయం సాధించింది.ఇంకా 22 బంతులు మిగిలి ఉండగానే 162 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 9 వికెట్ల తేడాతో ముంబై విజయాన్నందుకుంది.ముంబై ఓపెనర్లు హుస్సీ,సిమ్మన్స్ కలిసి మొదటి వికెట్ కు 139 పరుగులు జోడించాక హుస్సీ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు.తరువాత వచ్చిన పోల్లార్డ్ మూడు బారీ సిక్సర్ల సహాయంతో 20 పరుగులు చేయగా సిమ్మన్స్ 76 పరుగులతో నాటౌట్ గా నిలిచి విజయంలో ప్రధాన భూమిక పోషించాడు.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సథరన్ ఎక్స్ ప్రెస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.మహరూఫ్ 41 పరుగులతో రాణించాడు.
గ్రూప్ అర్హత మ్యాచ్ లో రాయ్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు లాహోర్ లయన్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పోలార్డ్ నేతృత్వంలోని ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 మాత్రమే చేయగలిగింది.తారే 37 పరుగులతో రాణించగా హర్భజన్ చివర్లో 10 బంతుల్లో రెండు సిక్సులు ఒక ఫోర్ సహాయంతో 18 పరగులు చేశాడు.ఐజాజ్ చీమ రెండు వికెట్లు తీసుకున్నాడు.
136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లాహోర్ ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.మధ్యలో కొంత వత్తిడికి లోనైనా చివర్లో వచ్చిన ఉమర్ అక్మల్ 18 బంతుల్లోనే 38 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.ఓజా 4 ఓవర్లలో 18 పరుగులిచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు.
ఛాంపియన్స్ లీగ్ 6వ ఎడిషన్ సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 3 వరకు జరగనుంది.ఈసారి ఛాంపియన్స్ లీగ్ ఇండియా లోనే నిర్వహిస్తుండగా ఐపీఎల్ 7 ఫైనల్ జరిగిన బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోనే ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఇది వరకు నిర్వహించిన ఫార్మాట్ లోనే ఈసారి టోర్నీ నిర్వహించనున్నారు.మొత్తం పది టీమ్ లు పాల్గొనే ఈ టోర్నీలో రెండు గ్రూపులు ఉంటాయి.ఒక్కో గ్రూపులో 5 జట్లు ఉంటాయి.
గ్రూప్ 'ఏ' - ఐపీఎల్-7 విజేత కోల్ కతా తో పాటు,చెన్నై సూపర్ కింగ్స్,డాల్ఫిన్స్(దక్షిణాఫ్రికా),పెర్త్ స్కార్చర్స్(ఆస్ట్రేలియా) మరొకటి క్వాలిఫైయర్ లో విజయం సాధించిన జట్టు.
గ్రూప్ 'బి' - కింగ్స్ ఎలెవన్ పంజాబ్,కేప్ కోబ్రాస్(సౌత్ఆఫ్రికా),హోబార్ట్ హరికేన్స్(ఆస్ట్రేలియా),వెస్టిండీస్ దేశీయ టీ20 విజేత మరియు క్వాలిఫైయర్ లో విజయం సాధించిన రెండో జట్టు.
క్వాలిఫైయర్ మ్యాచ్ లో సెప్టెంబర్ 13 నుండి 16 వరకు నిర్వహిస్తారు.ముంబై ఇండియన్స్,నార్తర్న్ నైట్స్(న్యూజిలాండ్),సథరన్ ఎక్స్ ప్రెస్(శ్రీలంక)మరియు లాహోర్ లయన్స్(పాకిస్థాన్)క్వాలిఫైయర్ లో పోటీ పడనున్నాయి.ఇందులో నుండి రెండు జట్లు గ్రూప్ లెవెల్ కి చేరుకుంటాయి.
గ్రూప్ మ్యాచ్ లు హైదరాబాద్,రాయ్ పూర్,మొహాలి,బెంగళూరు లో జరగనున్నాయి.ఫైనల్ మ్యాచ్ బెంగళూరులో జరుగుతుంది.విజేతకు 6మిలియన్ డాలర్లు చెల్లించనున్నారు.
మొదటి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్,చెన్నై సూపర్ కింగ్స్ తలబడనున్నాయి.
Schedule
DateMatch DetailsTimeVenue
ISTCity
Sep 13 - SatNorthern Knights v Southern Express,Qualifying Group16:00Raipur
Sep 13 - SatMumbai v Lahore Lions,Qualifying Group20:00Raipur
Sep 14 - SunNorthern Knights v Lahore Lions,Qualifying Group16:00Raipur
Sep 14 - SunMumbai v Southern Express,Qualifying Group20:00Raipur
Sep 16 - TueSouthern Express v Lahore Lions,Qualifying Group16:00Raipur
Sep 16 - TueMumbai v Northern Knights,Qualifying Group20:00Raipur
Sep 17 - WedKolkata v Chennai, Group A20:00Hyderabad
Sep 18 - ThuPunjab v Hobart Hurricanes,Group B20:00Mohali
Sep 19 - FriCape Cobras v TBC,Group B20:00Raipur
Sep 20 - SatDolphins v Perth Scorchers,Group A16:00Mohali
Sep 20 - SatBarbados Tridents v Punjab,Group B20:00Mohali
Sep 21 - SunCape Cobras v Hobart Hurricanes,Group B16:00Hyderabad
Sep 21 - SunKolkata v TBC,Group A20:00Hyderabad
Sep 22 - MonDolphins v Chennai,Group A20:00Bengaluru
Sep 23 - TueHobart Hurricanes v TBC,Group B20:00Raipur
Sep 24 - WedKolkata v Perth Scorchers,Group A20:00Hyderabad
Sep 25 - ThuChennai v TBC,Group A20:00Bengaluru
Sep 26 - FriBarbados Tridents v Cape Cobras,Group B16:00Mohali
Sep 26 - FriPunjab v TBC,Group B20:00Mohali
Sep 27 - SatDolphins v TBC,Group A16:00Bengaluru
Sep 27 - SatPerth Scorchers v Chennai,Group A20:00Bengaluru
Sep 28 - SunBarbados Tridents v Hobart Hurricanes,Group B16:00Mohali
Sep 28 - SunPunjab v Cape Cobras,Group B20:00Mohali
Sep 29 - MonKolkata v Dolphins,Group A20:00Hyderabad
Sep 30 - TuePerth Scorchers v TBC,Group A16:00Bengaluru
Sep 30 - TueBarbados Tridents v TBC,Group B20:00Bengaluru
Oct 02 - ThuTBC v TBC, Semi Final 116:00Hyderabad
Oct 02 - ThuTBC v TBC, Semi Final 220:00Hyderabad
Oct 04 - SatTBC v TBC, Final20:00Bengaluru
ఇంగ్లాండ్ తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడిపోయింది.
181 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేసి 3 పరుగుల తేడాతో ఓడి ఇంగ్లాండ్ పర్యటనను ముగించింది. కోహ్లి 41 బంతుల్లో 9 ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో 66 పరుగులు చేయగా ధావన్ 33 పరుగులు,రైనా 25,ధోని 27 పరుగలు చేశారు.
లక్ష్య చేధనలో భారత్ ధాటిగానే సమాధానం ఇచ్చింది.రెండో వికెట్ కు ధావన్,కోహ్లి 79 పరుగలు జోడించారు.కోహ్లి మూడో వికెట్ రూపంలో ఔటయ్యే సమయానికి భారత్ స్కోరు 14.2 ఓవర్లలో 131 పరుగులతో పటిష్టంగా ఉంది.తరువాత రైనా,జడేజా వెంటవెంటనే ఔట్ అవ్వడంతో చివర్లో స్కోర్ వేగం తగ్గింది.చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా ధోని 13 పరుగులు చేయగలిగాడు.రెండు సింగిల్స్ చేసే అవకాశం వచ్చినప్పటికీ రాయుడుకి బ్యాటింగ్ అవకాశం ఇవ్వకుండా అతి ఆత్మ విశ్వాసంతో ధోని ఓవర్ అంతా ఆడాడు. కోహ్లి కి ఈ పర్యటనలో ఇదే మొదటి అర్థ సెంచరీ.
అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ చేసింది.కెప్టెన్ మోర్గాన్ కేవలం 31 బంతుల్లో 7 సిక్సులు 3 ఫోర్ల సహాయంతో 71 పరుగులు చేయగా హేల్స్ 40 పరుగులతో రాణించారు.షమీ మూడు వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ ఇప్పటివరకు మిశ్రమ ఫలితాలు చవిచూసింది.మొదట టెస్ట్ సీరీస్ ను 3-1 తేడాతో ఓడిపోగా,వన్డే సీరీస్ 3-1 తో గెలుచుకుంది.ఈ పర్యటనలో భారత్ తన చివరి మ్యాచ్ ఆదివారం ఆడనుంది.ఈరోజు జరిగే ఏకైక టీ20 మ్యాచ్ కు వేదిక బర్మింగ్హామ్.
రెండు జట్లు ఇప్పటివరకు 7 టీ20 మ్యాచ్ లు ఆడగా ఇంగ్లాండ్ దే పైచేయి,ఇంగ్లాండ్ నాలుగింట విజయం సాధించగా భారత్ మూడు మ్యాచ్లో విజయం సాధించింది.
విజయంతో ఇంగ్లాండ్ పర్యటన ముగించాలని భారత్ ఆశిస్తుంటే వన్డే సీరీస్ లో ఘోర పరాభవానికి ఈ మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది.ఇంగ్లాండ్ జట్టుకు మోర్గాన్ నాయకత్వం వహించనున్నాడు.
నాలుగో వన్డేలో ఇదే వేదిక మీద భారత్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది.భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే జట్టులో దాదాపు అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు.బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉందని చెప్పవచ్చు.విరాట్ కోహ్లి తప్పా అందరూ బాగానే రాణిస్తున్నారు.అటు టెస్టుల్లో ఇటు వన్డేల్లో పరుగులు చేయడంలో ఘోరంగా విఫలమైన కోహ్లి ఈ మ్యాచ్ లో రానిస్తాడో లేదో చూడాలి.స్పిన్నర్లకు అనుకూలించే ఈ పిచ్ మీద ఆడడం ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ కు ప్రతికూల అంశం.
మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7గంటల 30 నిమిషాలకు ప్రారంభవుతుంది.డీడీ,స్టార్ స్పోర్ట్స్ 1 & 3 ల్లో ప్రత్యక్షప్రసారం కానుంది.

లీడ్స్ లో జరిగిన ఇంగ్లాండ్ తో జరిగిన చివరి వన్డేలో భారత్ 41 పరుగులతో ఓడిపోయింది.చివరి వన్డేలో గెలిచి ఇంగ్లాండ్ పరువు నిలబెట్టుకుంది.చివరి వన్డేలో ఓడినా భారత్ 3-1 తేడాతో వన్డే సీరీస్ ను కైవసం చేసుకుంది.మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా తరువాతి మూడు మ్యాచ్ ల్లో భారత్ గెలవగా,చివరి వన్డేలో ఇంగ్లాండ్ గెలిచింది.
టెస్ట్ సీరీస్ ను 3-1 తో చేజార్చుకున్న భారత్,వన్డే సీరీస్ ను 3-1 తో చేజిక్కించుకుంది.
ఇంగ్లాండ్ విధించిన 295 లక్షాన్ని చేదించడంలో భారత్ తడబడింది.ఆదిలోనే ఓపెనర్ రహనే పరుగులేమి చేయకుండానే పెవీలియన్ బాట పట్టాడు.తరువాత వచ్చిన కోహ్లి 13 పరుగులకే ఔటై మరోసారి నిరాశ పరిచాడు.ధావన్,రాయడు ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును నెమ్మదిగా నడిపించారు.రాయుడు 53,ధావన్ 31 పరుగులు చేసి ఔటయ్యారు.అనంతరం వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవ్వరు నిలదొక్కుకోలేదు.జడేజా ఒక్కడే ఒంటరి పోరు చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్లను చితకబాధినా వికెట్లు చేతులో లేకపోవడతో చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.66 బంతులు ఆడిన జడేజా 83పరుగులు చేశాడు.చివరి వికెట్ కు ఉమేష్ యాదవ్ తో కలిసి 39 పరుగులు జోడించాడు జడేజా.253 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.జో రూట్ 112 పరుగులు చేసి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.
జో రూట్ మ్యాన్ అఫ్ ద మ్యాచ్ గెలుచుకోగా,సురేష్ రైనా మ్యాన్ అఫ్ ద టోర్నీ అందుకున్నాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ చివరగా ఆదివారం ఏకైక టీ20 మ్యాచ్ ఆడనుంది.

Click Here For Scorecard

లీడ్స్ వేదికగా జరుగుతున్న చివరి వన్డేలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా తరువాత నిలకడగా ఆడుతూ భారత్ ముందు 295 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఓపెనర్ కుక్ 46,బట్లర్ 49 పరుగులుతో రాణించగా జో రూట్ 112 పరుగలు చేశాడు.చివర్లో బెన్ స్టోక్ వేగంగా ఆడి 24 బంతుల్లో రెండు సిక్సులు,మూడు ఫోర్ల సహాయంతో 33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.షమీ రెండు వికెట్లు తీసుకోగా,భువనేశ్వర్,ఉమేష్ యాదవ్,ఆశ్విన్,రైనా తల ఒక వికెట్ దక్కించుకున్నారు.

వన్డేల్లో తమకు ఎదురులేదని భారత్ జట్టు మరోసారి ఋజువు చేసుకుంది.ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ధోనీ సేన టెస్ట్ సీరీస్ కోల్పోయి అనేక విమర్శలు ఎదుర్కొని చివరకు ధోని కెప్టెన్ గా తప్పుకుంటున్నాడు అనే వరకు వెళ్ళింది.కాని అందుకు భిన్నంగా వన్డే సీరీస్ లో దుమ్మురేపుతుంది భారత్ జట్టు.వరుస విజయాలతో ఇంగ్లాండ్ ను మట్టి కరిపిస్తూ ఇంకా ఒక వన్డే మిగిలి ఉండగానే సీరీస్ ను కైవసం చేసుకుంది.ఓపెనర్ రహనే ఆద్భుతమైన సెంచరీకి తోడు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 97 పరుగులు చేయడంతో ఇంకా 19.3 ఓవర్లు మిగిలి ఉండగానే జయభేరి మోగించింది.
207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు ఓపెనర్లు ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు.మొదటి వికెట్ కు రహనే,ధావన్ కలిసి 183 పరుగులు జోడించారు.ఇంగ్లాండ్ పై ఇంగ్లాండ్ లో భారత్ కు ఇదే అత్యుత్తమ మొదటి వికెట్ భాగస్వామ్యం.దూకుడుగా ఆడుతూ మొదట సెంచరీ చేసిన రహనే 106 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు.తరువాత వచ్చిన కోహ్లి(1)తో కలిసి శిఖర్ ధావన్(97) భారత్ ను విజయ తీరాలకు అందించాడు.సిక్స్ తో భారత్ కు విజయాన్ని అందించిన ధావన్ సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.కెరీర్ లో మొదటి సెంచరీ చేసిన రహనేకు మ్యాన్ అఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అంతకు ముందు టాస్ ఒడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఆదిలోనే తడబడింది.భువనేశ్వర్ కుమార్ స్వింగ్ బౌలింగ్ ను ఎదుర్కొనలేక 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.మూడో వికెట్ ను షమీ 23 పరుగుల వద్ద కూల్చాడు.రూట్(44),మోర్గాన్(32)లు కలిసి నాలుగో వికెట్ కు 80 పరుగులు జోడించారు.కాని చాలా నెమ్మదిగా స్కోర్ బోర్డును కదిలించారు.వీరు వెంటవెంటనే ఔట్ అవడం తరువాత వచ్చిన వారు క్రీజ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేదు.మూయిన్ ఆలి ఒక్కడే 67 పరుగులతో రాణించాడు.షమీ 3 వికెట్లు,భువి,జడేజా చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
చివరి వన్డే శుక్రవారం లీడ్స్ వేదికగా జరగనుంది.

SCORECARD



ముక్కోణపు వన్డే సీరీస్ లో భాగంగా జింబాబ్వే సంచలన విజయం అందుకుంది.ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ లో జింబాబ్వే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.క్రికెట్ అన్నప్పుడు గెలుపు ఓటములు మామూలే కాని జింబాబ్వే,ఆస్ట్రేలియా మీద గెలవడం నిజంగా ఒక సంచలనమే.ఎందుకంటే నాలుగు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా మీద ఇప్పటి వరకు జింబాబ్వే ఒక్కసారే గెలిచింది.1983 జూన్ 9న మొదటిసారి ఆస్ట్రేలియాను చిత్తుచేసింది.మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత విజయాన్ని పునరావృత్తం చేయగలిగింది.
 అభిమానులకు అభివాదం తెలుపుతున్న ఆటగాళ్ళు

ఆటగాళ్లకు సరైన జీతం ఇవ్వలేని స్థితిలో ఉంది జింబాబ్వే క్రికెట్ బోర్డు,అందుకు చాలామంది పేరున్న క్రికెటర్లు జట్టును వీడారు.దేశ క్రికెట్ సంక్షభంలో ఉన్న దశలో యువ ఆటగాళ్ళు జట్టుకు అండగా ఉండి తమ సత్తా చాటుతున్నారు.

ఆస్ట్రేలియా జట్టులో అందరూ స్టార్ ఆటగాళ్లే,బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కు తోడు పదునైన బౌలింగ్ తో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియాను జింబాబ్వే కట్టడి చేయగలిగింది.మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.లక్ష్య సాధనలో జింబాబ్వే ఒక దశలో 156 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ చిగుంబరా(52),టెయిలెండర్ ఉత్సేయా(30) కలిసి మరో వికెట్ పడకుండా జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.

| Copyright © 2013 Radio Jalsa News