మైక్రోసాఫ్ట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ తన తదుపరి విండోస్ వర్షన్ 10 అని ప్రకటించింది.అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ విండోస్-9 తదుపరి వర్షన్ అనుకున్న ప్రతీ ఒక్కరికి షాక్ ఇస్తూ మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ను వచ్చే సంవత్సరం విడుదల చేయనున్నట్లు తెలిపింది.
మంగళవారం భారత కాలమాన ప్రకారం రాత్రి 11 గంటల సమయంలో సాన్ ఫ్రాన్సిస్కో లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ విషయాలు తెలిశాయి.మైక్రోసాఫ్ట్ లో ఆపరేటింగ్ సిస్టమ్స్ హెడ్ గా ఉన్న టెర్రీ మ్యేర్సన్ ఈ వివరాలు వెల్లడించారు.
టెర్రీ మ్యేర్సన్ వివరాలు చెప్తూ విండోస్ విడుదల చేస్తున్న తదుపరి ఆపరేటింగ్ సిస్టం పేరు విండోస్ 9 ఎందుకు పెట్టలేదో మాత్రం వివరించలేదు.1.5 మిలియన్ మంది ప్రస్తుతం విండోస్ ఉపయోగిస్తున్నారు అని ఈ ఈవెంట్ ను నిర్వహించిన టెర్రీ చిన్న స్టూల్ మీద కూర్చొని వివరించారు.సరికొత్త జనరేషన్ కు విండోస్ 10 ప్రాతినిధ్యం వహిస్తుంది అని టెర్రీ ఆశాభావం వ్యక్తం చేశారు.విండోస్ 10 ఒక సమగ్ర వేదిక కానుంది అని టెర్రీ తెలిపారు.