ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వద్ద రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 12 మంది చనిపోగా 45 మందికి గాయాలయ్యాయి.
మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో రెండు ప్యాసింజర్ రైళ్లు అతి సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి.
వారణాసి నుండి గోరఖ్ పూర్ వెళుతున్న కృషక్ ఎక్స్ ప్రెస్ లక్నో నుండి బరౌనీకి వెళ్తున్న బరౌనీ ఎక్స్ ప్రెస్ ను ఢీకొంది.ఈ ఘటన మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిందని రైల్వే అధికారి అలోక్ సింగ్ చెప్పారు.బరౌనీ రైలుకు చెందిన మూడు భోగీలు పట్టాలు తప్పాయని సింగ్ తెలిపారు.మరో అధికారి సక్సేనా మాట్లాడుతూ కృషక్ రైలు డ్రైవర్లు సిగ్నల్ పట్టించుకోకుండా ముందుకు సాగడంవల్ల ఈ ప్రమాదం జరిగిందని అన్నారు.ఆ ఇద్దరు డ్రైవర్లను ఉద్యోగం నుండి వెంటనే తొలిగించారు.
క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.

ఆఫ్రికాను వణికిస్తున్న ఎబోలా వైరస్ అంతానికి ఐరాస చేస్తున్న పోరాటానికి భారత్ తనవంతు సాయం చేయనుంది.
భారత్ నేడు 12 మిలియన్ల అమెరికన్ డాలర్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది.
ప్రధాని నరేంద్రమోడి అమెరికా పర్యటనకు బయల్దేరేముందు దీనికి ఆమోదం తెలిపారు.
ఈ మొత్తాన్ని యూఎస్ సెక్రటరీ జనరల్ ఫండ్ కు జమ చేస్తారు.

మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)ను అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ప్రక్రియలో భాగంగా శాస్త్రవేత్తలు మామ్ లోని లామ్ ను మండించారు.ఈ ప్రక్రియ ఎనిమిది దశల్లో జరిగింది.
సక్రమంగా అన్ని ఇంజన్లు పని చేస్తున్నాయని ఇస్రో నిర్ణయించుకున్నది.
మామ్ మార్స్ కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది.అంగారక గ్రహంపై ప్రయోగాల కోసం ఇస్రో ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం విజయవంతమైంది.
దీంతో బారత అంతరిక్ష పరిశోధనలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది.
భారత్ అరుణ గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన నాలుగో దేశంగా గుర్తింపు పొందింది.
మొదటి మూడు
1.అమెరికా
2.రష్యా
3.యూరోపియన్ యూనియన్
4.భారత్
అంగారక కక్ష్యలోకి మొదటి ప్రయత్నంలోనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలి దేశంగా, అదేవిధంగా తొలి ఆసియా దేశంగా భారత్ రికార్డు సృష్టించింది.
పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో,అతి తక్కవ వ్యయంతో గ్రహాంతర ప్రయోగాన్ని సునాయాసంగా ప్రయోగించిన ఇస్రోను చూసి ప్రపంచమే నివ్వెరపోయింది.
బుధవారం అంగారకుడి కక్ష్యలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ ను(మామ్)ఇస్త్ర శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు.
ఉదయం తెల్లవారుజామున 4:49 గంటలకు ప్రారంభమైన కక్ష్య ప్రవేశ ప్రక్రియ 8:05 గంటలకు ముగిసింది.ఇస్రో గ్రాండ్ స్టేషన్ కు ఆ వెంటనే సందేశాలు పంపడం ప్రారంభించింది.
కొద్ది రోజులుగా ఈ ప్రయోగంపై ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న యావత్ భారతదేశం ఈ శుభవార్త విని పులకరించిపోయింది.
శీతల పానియాల విక్రయ సంస్థ కోకా కోలా తాజాగా షుగర్ ఫ్రీ సాఫ్ట్ డ్రింక్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
ఇండియన్ మార్కెట్లోకి కోకా-కోలా కంపెనీ'కోకా కోలా జీరో' పేరుతో షుగర్ ఫ్రీ సాఫ్ట్ డ్రింక్ ను తీసుకొచ్చింది.
ఇప్పటివరకు షుగర్ ఫ్రీ సాఫ్ట్ డ్రింక్ టాప్ 6 మార్కెట్లైన యూఎస్ఏ, చైనా, మెక్సికో, బ్రెజిల్,జపాన్లలో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు దక్షిణాసియా కోకా-కోలా కంపెనీ అధ్యక్షుడు వెంకటేష్ కిని తెలిపారు.
తమ కంపెనీ ఇండియాలో వినియోగదారులకు కోకా-కోలా, థమ్స్ అప్, స్ప్రైట్ తో పాటు కార్బోనేటెడ్, నాన్ కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ ని అందుబాటులోకి తిసుకోచ్చినట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా అక్టోబర్ 5 తర్వాత కోకా-కోలా జీరో ఉత్పత్తులను 100 కు పైగా పట్టణాల్లో, 1.8 లక్షల బహిరంగ స్టాల్స్ లో అమ్మడానికి సిద్దంగా ఉంటాయని పేర్కొన్నారు.

 స్కాట్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణలో సమైక్యవాదనికే మద్దతు లభించింది. సమైక్య వాదానికి అనుకూలంగా 55% మంది, వ్యతిరేకంగా 45% మంది ప్రజలు ఓటు వేశారు.మొత్తం 43 లక్షల మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. యునైటెడ్ కింగ్ డమ్ కే స్కాట్లాండ్ ప్రజలు మద్దతు తెలపడంతో బ్రిటన్-స్కాట్లాండ్ 300 ఏళ్ల నాటి బందం కొనసాగనుంది.గ్రేట్ బ్రిటన్ పాలనలో 1707 నుంచి స్కాట్లాండ్ కొనసాగుతుంది. మొత్తం 32 రాష్ట్రాలు స్కాట్లాండ్ లో ఉండగా, విభజనకు ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు వ్యతిరేకించాయి.4 రాష్ట్రాలు మాత్రమే విభజనకి మద్దతునిచ్చాయి. ప్రజాభిప్రాయ సేకరణలో స్కాట్లాండ్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలన్న విభజన వాదులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ తాలుకా శివల్లి గ్రామంలో వద్దని వారించిన ప్రేమించుకుంటున్నారని కోపంతో ప్రేమికులను అమ్మాయి దగ్గరి బంధువు కొట్టి చంపాడు. 17 సంవత్సరాల నీలమ్మ లక్కమ్మనవార్ 10వ తరగతి చదువుతుంది.నీలమ్మ మరియు కాలేజీ చదువు మధ్యలోనే ఆపేసిన 19 సంవత్సరాల మహేష్ నైఖర్ అనే అబ్బాయి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ధార్వాడ్ రూరల్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ కళ్ళప్ప చెప్పినదాని ప్రకారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నీలమ్మ ఇంట్లో ఎవరు లేరు.అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మాయి బంధువు రంగప్ప లక్కమ్మనవార్ ఆ ఇద్దరినీ ఇంట్లో ఉండడాన్ని గమనించి ఇనుప రాడ్ తో వారిమీద దాడి చేశాడు.అక్కడికక్కడే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
అయితే వీరి ప్రేమ వివాహం ఇదివరకే పెద్దవారికి తెలిసి మందలించారు.నీలమ్మ కురుబ కమ్యూనిటీకి చెందగా మహేష్ షెడ్యూల్ కులానికి చెందినవాడు.అమ్మాయికి చెందిన వారు ఇందుకు అభ్యంతరం చెప్పారు.మరియు ఇద్దరినీ హెచ్చరించారు.అయినా వినకపోవడంతో చివరకు ఇద్దరినీ హత మార్చారు.
యువతీ యువకులు ఫేస్ బుక్ మాయలో పడి మోసపోతున్న ఉదంతాలు మనకు తెలుసు.
అయితే ఓ యువకుడు ఫేస్ బుక్ లో కొత్త అమ్మను వెతుక్కుని కన్న తల్లిని వదిలేసిన విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బరేలీలో జరిగింది.
బరేలీ కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విజయ్ మౌర్య అనే 20 ఏళ్ల విద్యార్ధి-ఫేస్ బుక్ మమ్మీ కోసం కన్న వారిని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు.
పొద్దస్తమాను ఫేస్ బుక్ అతుక్కుపోయే అందరి యువకుల్లాగే తన కొడుకు కూడా అన్ని విషయాలు తమ స్నేహితులతో షేర్ చేసుకుంటున్నాడని విజయ్ మౌర్య అనుకున్నాడు.
'ముఖ పుస్తకం'కు అదే పనిగా అంటుకుపోవడాన్ని విజయ్ తండ్రి బ్రిజేష్ అప్పట్లో గమనించినా పెద్దగా పట్టించుకోలేదు.
విజయ్ గతనెల కనిపించకుండా పోయాడు.దీంతో పోలీసులను అతడి తల్లిదండ్రులు ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.
విజయ్ -'ఫేస్ బుక్ మమ్మీ'సుకన్య (పేరు మార్చారు)ని కలుసుకోడానికి వెళ్ళాడని తెలుసుకొని వారంతా అవాక్కయ్యారు.
విజయ్ కేరళకు చెందిన ఆమెని తన తల్లిగా చెప్పుకోవడంతో కన్నవాళ్ళు కన్నీరు మున్నీరయ్యారు. త్రివేండ్రం కు చెందిన సుకన్య బహ్రయిన్ లో నర్స్ గా పని చేస్తుంది.
ఆమే రూ.22 వేలు విజయ్ బ్యాంకు ఖాతాలోకి బదిలీ కూడా చేసింది.అంతేకాదు తన 'ఫేస్ బుక్ కొడుకు' తో ఈ నెల 12 న ఏకంగా బరేలీకి వచ్చింది.
సుకన్య,విజయ్ లు ఇక్కడి నుంచి వెళ్లిపోకుండా పోలీసులు,కుటుంబసభ్యులు వారికి నచ్చజెప్పి ఆపగలిగారు.
ఇక వివాదంపై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.బీజేపి నాయకులు విజయ్ కుటుంబానికి బాసటగా నిలవడం గమనార్హం.
దీన్ని 'ప్రణాళికబద్దమైన కుట్ర'గా వర్ణించారు.కమలనాధులు హిందూ యువకుడిని క్రిస్టియన్ గా మార్చేందుకు ఈ కుట్ర చేశారని ఆరోపించారు.
అయితే ఫేస్ బుక్ తల్లి కోసం పాకులాడుతూ అసలు తల్లిని వదిలేసిన విజయ్ గురించి వింతగా చెప్పుకుంటున్నారు.ఈ కథ మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
15 రోజుల వ్యవధిలో ఏడుగురిని అత్యంత కర్కశంగా హత్య చేసిన సీరియల్ కిల్లర్,రేపిస్ట్ ను తమిళనాడు లోని సేలం జిల్లలో పోలీసులు అరెస్ట్ చేశారు.ఏడుగురిలో 5 గురు మహిళలు రెండు సంవత్సరాల చిన్నారి కూడా ఉంది.
పోలీసుల కథనం ప్రకారం కతిరిపట్టి గ్రామానికి చెందిన 27 సంవత్సరాల సుబ్రహ్మణ్యన్ ట్రక్ డ్రైవర్ గా పని చేస్తుంటాడు.ఒంటరిగా ఉండే గృహిణులను ముఖ్యంగా లక్ష్యం చేసుకుంటాడు.సేలం,ఆరియలూర్,తిరూచి జిల్లాల్లో తిరుగుతూ హత్యలకు పాల్పడ్డాడు.మూడు హత్యచార కేసులు కూడా ఇతని మీద పోలీసులు నమోదు చేశారు.
పెరియేరి గ్రామంలో ఒక దుకాణంలో దొంగతనం చేస్తూ దుకాణదారుడి మీద దాడి చేస్తుండగా గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.తరువాత పోలీసులు జరిపిన విచారణలో సేలం,అరియాలూర్,తిరూచి జిల్లాలో చేసిన హత్యల గురించి విషయం బయటపడింది.
ఇంట్లో పినతల్లి చిత్రహింసలు భరించలేక తన 17వ ఏట ఇంటి నుండి పారిపోయాడు సుబ్రహ్మణ్యన్.ట్రక్ క్లీనర్ గా ఉద్యోగం చేస్తూ డ్రైవింగ్ నేర్చుకొని ట్రక్ నడుపుతున్నాడు.కాని ఎక్కడ ఒక దగ్గర నిలకడగా పని చేసుకునే వాడు కాదు.నార్త్ ఇండియా లో 5 సంవత్సరాలు ఉండి మల్లి సొంత జిల్లాకు చేరుకున్నాడు.
సుబ్రహ్మణ్యన్ మొదట తన నానమ్మను 2012 లో హత్య చేశాడు.నెల క్రితం వరకు సేలం సెంట్రల్ జైల్లో ఉండి బైల్ మీద విడుదలయ్యాడు.డబ్బు కోసం సేలం,అరియాలూర్ లలో రహదారులమీద రాత్రి వేళల్లో కాపుకాచి ప్రయాణికుల దగ్గర డబ్బులు దోచుకునేవాడు.ఆగష్టు 20 న ఉలిపురంలో చిన్నతయీ(45)అనే ఆవిడ మీద అత్యాచారం చేసి హత్య చేసి ఇంట్లో ఉన్న రూ.10,000 దొంగిలించాడు.మరుసటి రోజు కల్లకుడి లో 82 సంవత్సరాల జయమేలును చంపి రూ.1000 దోచుకేల్లాడు.
సరిగ్గా ఎనిమిది రోజుల తరువాత కైరలబాత్ లో లక్ష్మీ(75),సావిత్రి(50)లను హత్య చేశాడు.సావిత్రిని అత్యాచారం కూడా చేశాడు.వారి ఇంటి నుండి రూ.900 తీసుకెళ్ళాడు.సెప్టెంబర్ 5న సెంతమంగళం గ్ర్రామంలో నిద్రిస్తున్న పార్వతి(25) మీద దాడి చేయగా ఆవిడ భర్త వెలుమురుగన్ అడ్డగించగా అతనిని హత్య చేశాడు,తరువాత ఆవిడమీద అత్యాచారం చేసి చంపేశాడు.వారి 2 సంవత్సరాల చిన్నారిని కూడా చంపేశాడు.అని అత్తూర్ డీఎస్పీ కాసినాతాన్ చెప్పారు.ఇంకా వీడు ఏమైనా నేరాలకు పాల్పడ్డాడ అని పోలీసులు విచారిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో సంభవించిన వరదలవల్ల ఆ రాష్ట్రం తీవ్రంగ నష్టపోయిందని అసోచామ్ వెల్లడించింది. ఈ వరదలు 5 వేల కోట్లకు పైగా నష్టాన్ని ఆ రాష్టానికి తెచ్చిపెట్టాయని తెలిపింది.వ్యాపార, పర్యాటక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అసోచామ్ పేర్కొంది.
ప్రధాని నరేంద్రమోడీ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోకూడదని నిర్ణయించుకున్నారు.
తన పుట్టిన రోజు వేడుకలను తన అభిమానులేవరు కూడా నిర్వహించరాదని కోరారు.ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో ఇవాళ స్పష్టం చేశారు.
వరదల్లో చిక్కుకొని అష్టకష్టాలు పడుతోన్న కాశ్మీర్ వాసులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు.
చేయు చేయి కలుపుదాం , భాదిత జమ్మూ కాశ్మీర్ వాసులకు చేయుతనిద్దామని కోరారు.జమ్మూ కాశ్మీర్ లో వరద సహాయక చర్యల్లో మీ వంతు పాలుపంచుకోండని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.తన పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్రమోడిని కలవనున్నారు.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమస్యలపై ప్రధానితో చర్చించనున్నారు.
తెలంగాణా సర్కార్ జమ్మూ,కాశ్మీర్ లో సంభవిస్తోన్న భారివరదల కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర తాగునీటి కొరతను ఎదురుకోనడంపై స్పందించింది.
ఆ రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న బాధితులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ఈ మేరకు నిర్ణయించింది.
తక్షణమే జమ్మూ కాశ్మీర్ వరద ప్రాంతాలకు 50 వాటర్ ఫ్యురిఫయ్యర్లను పంపాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు.రూ.2.5.మొత్తం వీటి విలువ కాగా, ఒక్కొక్కటి రూ.5లక్షలు చేస్తుందని అధికారులు తెలిపారు.
ఈ ఫ్యురిఫయ్యర్ల ద్వారా నీటిని శుభ్రపరచి అప్పటికప్పుడు తాగునీటిగా మార్చి అందించే వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు.
మొదటగా ఇవి శ్రీనగర్ చేరుకొని అక్కడినుంచి వరద ప్రాంతాలకు వెళ్లనున్నాయి.
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి వరద సహాయకంగా ఇప్పటికే రూ.10 కోట్లు వరద సాయంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
మణిపూర్ లోని ఎన్ఐటీ కళాశాలలో విద్యార్ధుల మధ్య లోకల్ నాన్ లోకల్ ఘర్షణ తలెత్తింది.కళాశాలలో చదువుతున్న తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ లకు చెందిన తెలుగు విద్యార్ధులపై మణిపూర్ విద్యార్ధులు దాడికి పాల్పడ్డారు.తెలుగు విద్యార్ధులపై గత నలుగు రోజులుగా దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం.దాడులపై విద్యార్ధులు ఎన్ఐటీ యాజమాన్యానికి ,స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విద్యార్ధులు తెలుపుతున్నారు.లోకల్ విద్యార్ధులు గుండాలతో కూడా దాడి చేయిస్తున్నట్లు విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.బిక్కుబిక్కు మంటూ తెలుగు విద్యార్ధులు కాలేజీలోనే ఉంటున్నారు.
రెండు వారాల క్రితం వ్యభిచారం చేస్తూ పట్టుబడిన నటి శ్వేత బసు ప్రసాద్ కు మద్దతు రోజురోజుకు పెరిగిపోతుంది.తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ నటి దీపిక పదుకొనె చేరింది.శ్వేతను నిందించాల్సిన అవసరంలేదు,కుటుంబాన్ని పోషించుకోవడానికి తను ఆ మార్గం ఎంచుకుంది,అందులో తప్పులేదు,తనకు తన కుటుంబానికి అండగా నిలవండి అని దీపిక తెలిపింది.
అందరూ తనని తప్పుపట్టడం సరికాదు.తను ఎవరో మాకు తెలుసు కాబట్టి ఆమెకు ఎందుకు మద్దత్తుగా మేము ఉండకూడదు అని కూడా అన్నారు దీపిక.ఎందుకు దీన్ని పెద్ద కోణం చూస్తున్నారు.విమర్శించడం మాని తనకు ఏ విధంగా సహాయం పడాలో ఆలోచించాలి అని దీపిక చెప్పింది.
జమ్మూ కాశ్మీర్ వరదలతో అతలాకుతలమవుతున్న ప్రజలకు కేంద్రం వారం రోజులపాటు ఉచిత ఫోన్ కాలింగ్ సౌకర్యం కల్పించింది.ఆ రాష్ట్ర ప్రజలు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ ద్వారా వారం రోజులపాటు ఎలాంటి చార్జీలు లేకుండా మాట్లాడుకోవచ్చని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.
మొఘలుల కాలంనాటి 61 వెండి నాణాలు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో లభ్యమయ్యాయి.
కొంత మంది పిల్లలు శనివారం కంటోన్మెంట్ ప్రాంతంలో గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్లారు.అక్కడ వారు ఒక కుండను గమనించారు.వెలికితీసి చూడగా అందులో అరబిక్ అక్షరాలతో ఉన్న వెండి నాణాలు బయటపడ్డాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
బీజేపీ విద్యార్థి విభాగం ఎబీవీపి(భారతీయ విద్యార్థి పరిషత్) 18 సంవత్సరాల తరువాత ఢిల్లీ యూనివర్సిటీ యూనియన్ ఎన్నికల్లో స్వీప్ చేసింది. కాంగ్రేస్ విద్యార్థి విభాగం ఎన్ ఎస్ యూ ఐ ని మట్టికరిపించి నాలుగింటికి నాలుగు స్థానాలు దక్కించుకొని సత్తా చాటింది.
ఎబీవీపి ప్రెసిడెంట్,వైస్ ప్రెసిడెంట్,సెక్రటరీ మరియు జాయింట్ సెక్రటరీ స్థానాలను స్పష్టమైన మెజారిటీతో కైవసం చేసుకుంది.మోహిత్ నగర్ ప్రెసిడెంట్ గా,ప్రవేష్ మాలిక్ వైస్ ప్రెసిడెంట్ గా,ఖనిక షెఖావత్ సెక్రటరీగా,అషుతోష్ మాథుర్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
ఎన్నికల్లో విజయం సాధించిన ఎబీవీపి విద్యార్థి విభాగాన్ని బీజేపే జాతీయ అధ్యక్షుడు ట్విట్టర్ లో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆవేశంలో కొంత మంది ఎం చేస్తారో వారికే తెలియదు.కొందరు కొందరు కత్తిత్తో కోసుకోవడం,కొందరు నిప్పంటించుకోవడం మరికొందరు ఇతరుల మీద దాడులు చేస్తుంటారు.కాని బీహార్ కు చెందిన ఒక వ్యక్తి తీవ్ర ఆవేశంతో తన పురుశాంగాన్నే కోసేసుకున్నాడు.
బీహార్ రాష్ట్రంలోని సివన్ జిల్లా ఖోజ్వా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం భాదితుడు ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తుంటాడు.నెలరోజులు సెలవుపెట్టి సొంతూరికి చేరుకున్నాడు.ఇతనికి ఇద్దరు కూతుర్లు.మగ బిడ్డ లేడని ఇద్దరి దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి.గురువారం కూడా ఇదే విషయమై తీవ్ర స్థాయిలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.అంతే కోపం ఆపుకోలేక అతడు పదునైన కత్తితో తన పురుషాంగాన్ని కోసుకున్నాడు అని అతని బంధువులు చెప్పారు.
అతని వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని,తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు.అతని ఆరోగ్యం గురించి ఇంకా డాక్టర్లు ఏమీ చెప్పలేదని పోలీసులు అన్నారు.
చీఫ్ ఎలక్షన్ కమిషన్ హర్యానా,మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యుల్ ప్రకటించింది.ఈ సందర్భంగా సీఈసీ సంపత్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఈనెల 27ను నోటిఫికేషన్ దాఖలు చేసేందుకు చివరి తేదిగా నిర్ణయించినట్లు తెలిపారు.మహారాష్ట్ర లో 288 MLA స్థానాలకు,హర్యానాలో 90 MLA స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ కానుంది.ఓటర్ లకు అసెంబ్లీ ఎన్నికల్లో నోటా సౌకర్యం ఉంటుందని స్పష్టం చేశారు.అక్టోబర్ 15న పోలింగ్, 19 న ఓట్ల లెక్కింపు జరుగనుంది.
ఆవేశంలో కొంత మంది ఎం చేస్తారో వారికే తెలియదు.కొందరు కొందరు కత్తిత్తో కోసుకోవడం,కొందరు నిప్పంటించుకోవడం మరికొందరు ఇతరుల మీద దాడులు చేస్తుంటారు.కాని బీహార్ కు చెందిన ఒక వ్యక్తి తీవ్ర ఆవేశంతో తన పురుశాంగాన్నే కోసేసుకున్నాడు.
బీహార్ రాష్ట్రంలోని సివన్ జిల్లా ఖోజ్వా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం భాదితుడు ఖతార్ దేశంలో ఉద్యోగం చేస్తుంటాడు.నెలరోజులు సెలవుపెట్టి సొంతూరికి చేరుకున్నాడు.ఇతనికి ఇద్దరు కూతుర్లు.మగ బిడ్డ లేడని ఇద్దరి దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి.గురువారం కూడా ఇదే విషయమై తీవ్ర స్థాయిలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది.అంతే కోపం ఆపుకోలేక అతడు పదునైన కత్తితో తన పురుషాంగాన్ని కోసుకున్నాడు అని అతని బంధువులు చెప్పారు.
అతని వయసు సుమారు 30 సంవత్సరాలు ఉంటాయని,తీవ్రంగా గాయపడిన అతనిని ఆసుపత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు.అతని ఆరోగ్యం గురించి ఇంకా డాక్టర్లు ఏమీ చెప్పలేదని పోలీసులు అన్నారు.
| Copyright © 2013 Radio Jalsa News