మరో పాటేసుకుంటున్న 'గోవిందుడు అందరివాడేలే'..!

సినిమాలు విడుదలయ్యాక వాటికి అదనంగా సన్నివేశాలు,పాటలు చేర్చడం తరచుగా చూస్తుంటాం.మన తెలుగు సినిమాల్లో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి.అక్టోబర్ 1న విడుదలైన రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం కూడా ఈ కోవలోకే వెళ్తుంది.కుటుంబ కథా చిత్రంగా ఇప్పటికే మంచి టాక్ సంపాదించుకున్న ఈసినిమాకు అదనంగా మరో పాటను చేరుస్తున్నారు.
పాట చిత్రీకరణ కూడా మొదలైంది.దసరా పండగ రోజు కూడా విరామం లేకుండా ఈ పాటను చిత్రీకరించే పనిలో పడ్డారు.మూడు లేదా నాలుగు రోజుల్లో పాటను చేర్చనున్నారు.పాట పూర్తయ్యేవరకు ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా పని చేయాలని హీరో రామ్ చరణ్ డిసైడ్ అయ్యారు.అయితే ఈసినిమా ప్రిమియర్ షోకు అమెరికా వెళ్ళాలని నిశ్చయించుకున్న రామ్ చరణ్ పాట చిత్రీకరణ ఉండడంతో ఇక్కడే ఆగిపోయాడు.
ఇది వరకు కూడా రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రంలో కూడా అదనపు సన్నివేశాలు చేర్చారు.మొదట సినిమా నిడివి ఎక్కువైందని భావించి తరువాత సూపర్ హిట్ టాక్ వచ్చాక కొన్ని సన్నివేశాలు కలిపారు.మరి ఇప్పుడు అదనంగా చేర్చుతున్న పాటతో సినిమాకు ప్లస్ అవుతుందో లేదో చూడాలంటే ఇంకో 4 రోజులు ఆగాల్సిందే.

No comments:

Designed by vnBloggertheme.com | Copyright © 2013 Radio Jalsa News