మిర్పూర్: ట్వంటీ 20 ప్రపంచకప్ లో మరోసారి శ్రీలంక ఫైనల్ కు చేరింది.వెస్టిండీస్ తో జరిగిన తొలి సెమీ ఫైనల్ డే అండ్ నైట్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారడంతో ఫలితాన్ని డక్ వర్త్ లూయిస్ ప్రకారం ప్రకటించారు.వెస్టిండీస్ 13.5 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టానికి 80 తో ఉన్నదశలో ఒక్కసారిగా భారీ రాళ్ళ వర్షం పడడంతో డక్ వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం శ్రీలంక 27 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ చేరింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది.మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు తిరుమన్నే(44), మాథ్యూస్(40) పరుగులు చేయడంతో మంచి స్కోర్ ను విండీస్ ముందు ఉంచగలిగింది శ్రీలంక.
161 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన వెస్టిండీస్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారభించింది. ఓపెనర్లు క్రిస్ గేల్(3), స్మిత్ (17) పరుగులు మాత్రమే చేశారు. శామ్యూల్స్(16), సమీ(0) తో క్రీజ్ లో ఉండగా వర్షం పడింది. అప్పటికి విండీస్ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 80 పరుగులతో ఉంది. విండీస్ గెలవడానికి 107 పరుగులు అవసరం ఉండే.డిఫెండింగ్ ఛాంపియన్ లుగా బరిలోకి దిగిన విండీస్ సెమీ ఫైనల్ లో ఇంటి దారి పట్టాల్సి వచ్చింది.

No comments: