జనగాం అసెంబ్లీ నియోజక వర్గం - సమీక్ష

వరంగల్ జిల్లాకు చెందిన జనగాం అసెంబ్లీ నియోజక వర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉన్నది వరంగల్ జిల్లానే అయినప్పటికీ పార్లమెంట్ స్థానం మాత్రం నల్గొండ జిల్లా భువనగిరి పరిధిలోకి వస్తుంది.
ఇక్కడ ఇప్పటి వరకు 12 సార్లు ఎన్నికలు జరగగా 7సార్లు కాంగ్రెస్, రెండు సార్లు సీపీఎం గెలుపొందగా  కాంగ్రెస్(ఐ),పీడీఎఫ్ మరియు ఇండిపెండెంట్ ఒక్కోసారి గెలుచుకున్నారు.
కాంగ్రెస్ కు పెట్టని గోడ జనగాం అని చెప్పవచ్చు. తెలుగుదేశం ప్రభంజనంలో కూడా కాంగ్రెస్ జనగాం స్థానాన్ని నిలబెట్టుకుంది. మొట్టమొదటి సారిగా 1957లో జరిగిన ఎన్నికల్లో జి. గోపాల్ రెడ్డి పీడీఎఫ్ పార్టీ తరపున పోటి చేసి కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలిచాడు.1962,67,72 లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకుంది. 1978లో కాంగ్రెస్(ఐ),1983 లో ఇండిపెండెంట్ అభ్యర్థి, 1985లో మొదటిసారిగా సీపీఎం గెలుచుకుంది.
తరువాతి జరిగిన 5 ఎన్నికల్లో 4 సార్లు కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య జయకేతనం ఎగురవేశారు జనగాంలో . 1989 లో మొదటిసారి పొన్నాల కాంగ్రెస్ నుండి పోటీ చేసి గెలుపొందాడు. అయితే 1994 లో మాత్రం సీపీఎం పార్టీ నుండి పోటీ చేసిన చరగొండ రాజి రెడ్డి చేతిలో పొన్నాల అనూహ్యంగా 24508 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 1999 లో తెదేపా అభ్యర్థి ప్రేమలత రెడ్డి పై, 2004 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బస్వా రెడ్డి పై గెలుపొందాడు. 2009 లో మొదటి సారి పోటీ చేసిన తెరాస అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మీద స్వల్ప ఆధిక్యంతో పొన్నాలా నెగ్గాడు. పొన్నాల కు 40.47 శాతం ఓట్లు పోలుకాగా ప్రతాప్ రెడ్డి కి 40.31 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఈసారి పొన్నాల టీ-పీసీసీ చీఫ్ గా జనగాం అసెంబ్లీ కి కాంగ్రెస్ తరపున పోటి చేస్తుండగా, తెరాస తరపున ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పోటి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో  పొన్నాలను ఓడించడానికి తెరాస ప్రయత్నిస్తుంది. తెలంగాణా ఉద్యమంలో ఎక్కడ పాల్గొనలేదు అనే ప్రచారంతో తెరాస ముందుకు పోతుంటే, తెలంగాణా మావల్లే వచ్చింది అని కాంగ్రెస్ వెళ్తుంది. ఎవరిది గెలుపో తెలుసుకోవాలంటే పలితాల వరకు ఆగాల్సిందే.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News