త్వరలోనే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. శాశానసభలో ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సందర్భంగా ఈటెల మాట్లాడుతూ ..ఉద్యోగుల నియామక ప్రక్రియను త్వరలోనే చేపడ్తమని, 4 లక్షల 15 వేల 931 మంది ఉద్యోగులు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు.కాగా ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 సంవత్సరాలే. లక్షా 77 వేల 444 ఖాళీలున్నాయని వీటన్నింటిని ప్రభుత్వం త్వరలోనే భర్తీ చేయనున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.
ఐటీ కారిడార్ లో మహిళా పోలీస్ స్టేషన్ ని పదిరోజుల్లో ఏర్పాటు చేస్తామని తెలంగాణా మంత్రి కేటిఆర్ తెలిపారు.
నాస్కామ్ ప్రతినిధులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాస్కాం సమావేశం వల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరిగిందన్నారు.
ఇతర దేశాల్లో మహిళా రక్షణ కమిటీ పర్యటించి నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ లో వైఫై ఏర్పాటుకు టెండర్లు పిలిచామన్నారు.
ఐటీ పరిశ్రమలపై వర్కుషాప్ నిర్వహిస్తామని, మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
కరీంనగర్, వరంగల్ లోనూ ఐటీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
మంత్రి తమది స్నేహపూర్వక పారిశ్రామిక ప్రభుత్వమని పేర్కొన్నారు.
సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ కు మహిళలు, బాలికల భద్రత-రక్షణ కమిటీ తన నివేదికను సమర్పించింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య నేతృత్వంలోని ఐఏఎస్,ఐ.పీఎస్ అధికారులతో ప్రభుత్వం ఈ కమిటిని నియమించింది.
శనివారం సచివాలయంలో సీఎం కు కమిటీ సభ్యులు 62 పేజీలతో నివేదికను తాయారు చేసి అందజేశారు.
ఉన్నతాధికారులు, అన్నివర్గాల ప్రజలు ఎన్జీవోల నుంచి అభిప్రాయాలను సేకరించి నివేదికను రూపొందించారు.
ఈ నివేదికలో 82 సూచనలు చేశారు.ప్రత్యేకంగా మహిళల కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కమిటి తన తుది నివేదికను నవంబర్ నేలాఖరుకల్లా ఇవ్వనున్నట్లు సమాచారం.
కమిటి మిగతా సూచనలు :
1.ఆపదలో ఉన్న మహిళల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు.
2.గ్రామస్థాయిలో నవంబర్ నెలాఖరుకల్లా స్త్రీశక్తి కమిటిల నియామకం.
3.తెలంగాణా రాష్ట్రం కోసం ప్రత్యేక మహిళా కమిషన్ ఏర్పాటు.
4.మహిళల భద్రతపై ప్రతీ జిల్లా కలెక్టర్ నెలకోసారి రివ్యూ చేయాలి.
5.తప్పనిసరిగా పెళ్లిల్ల రిజిస్ట్రేషన్ చేయడం.
6.అన్ని స్కూళ్లలో కాలేజీల్లో బాలికల సంరక్షణ, ప్రైవసీ కోసం ఏర్పాట్లు చేయడం.
7.ఐటీ కార్యాలయాల వద్ద మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టడం.
8.సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మహిళల భద్రతను పర్యావేక్షించడం.
9.నగరాలు, పట్టణ ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేసి మహిళల భద్రతను పెంచడం.
10.మహిళల భద్రతకు మద్యంను నియంత్రించడం.
11.తద్వారా మహిళలపై జరుగుతోన్న నేరాల సంఖ్యను తగ్గించడం.
12.అందుకు అనుగుణంగా అబ్కారీ విధానాన్ని సవరించడం.
13.మూడంకేలతో హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు.
14.సమస్యల పరిష్కారానికి GHMC పరిధిలో 3 కేంద్రాలు ఏర్పాటు.
15.జిల్లాకో కేంద్రం ఏర్పాటు చేయాలి.
16.ఈ కేంద్రాల్లో సభ్యులుగా కౌన్సిలర్, మహిళా న్యాయవాది, పోలీస్ శాఖ ఉన్నతాధికారి ఉండాలి.
17.వైద్యులు, మహిళా శిశు సంక్షేమ అధికారి సభ్యులుగా ఉండాలి.
18.అన్ని పోలీస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు.
19.మహిళలు ఫిర్యాదు చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక గది ఏర్పాటు.
20.పోలీస్శాఖలో మహిళలకు 33 % రిజర్వేషన్ అమలు.
21.మహిళలపై వేధింపులు, అత్యాచార ఘటనల్లో 90 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు.
22.అన్ని జిల్లాల్లో పాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు.
23.అత్యాచార ఘటనల్లో అవసరమైతే వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ.
24.ఇంటర్నెట్ లో అసభ్య వెబ్ సైట్లను నిషేధించడం.
25.మహిళలు పనిచేసే ప్రదేశాలు, విద్యా సంస్థల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచడం.
తెలంగాణా ప్రభుత్వ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటిఆర్ హైదరాబాద్ ను స్మార్ట్ గ్రీన్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
స్మార్ట్ సిటీ అంటే రోడ్ల సౌకర్యాలు మెరుగు పరచడమే కాదని.. ప్రజల అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దడమే ముఖ్యమన్నారు.
మెట్రో పోలీస్ కాంగ్రేస్ ను త్వరలో హైదరాబాద్ లో నిర్వహించనున్న తరుణంలో GHMC, ఆస్కీ,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో వర్క్ షాప్ ను నిర్వహించారు.
వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి కె.తారకరామారావు తెలంగాణా ప్రాంతంలో ఇప్పటికే 39% పట్టణీకరణ చెందిదని చెప్పారు.
హైదరాబాద్ నగరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసి రావాలని కేటిఆర్ పిలుపునిచ్చారు.
వచ్చే ఐదేళ్ళ కోసం 14వ ఆర్ధిక సంఘాన్ని తెలంగాణా సర్కార్ సాయం కోరింది.
ఇవాళ రాష్ట్రంలో పర్యటిస్తున్న 14వ ఆర్ధిక సంఘాన్నికి రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించింది.
ఈ ప్రతిపాదనల విలువ రూ.23,475 కోట్లుగా ఉంటుందని అధికారులు తెలిపారు.
వీటిలో పోలీస్ వ్యవస్థ ఆధునికీకరణకు -రూ.4,216 కోట్లు.
చెరువుల పునరుద్ధరణకు, అభివృద్ధికి-రూ.4,200 కోట్లు.
ఐటీ రంగానికి రూ.1,901 కోట్లు.
వాటర్ గ్రిడ్ కు రూ.3,500 కోట్లు.
హరితహారానికి రూ.1000 కోట్లు.
ప్రాధమిక విద్యకు రూ.1,300 కోట్లు.
వ్యవసాయ విధ్యత్ కోసం రూ.1,300 కోట్లుగా పేర్కొంటూ ప్రతిపాదనలు రూపొందించి సమర్పించింది.
కేంద్ర పన్నుల్లో 50%నికి రాష్ట్రవాటాను పెంచాలని కోరింది.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో మెట్రో ఎండీ N.V.S.రెడ్డి , L&T ఛైర్మెన్ గాడ్గిల్ సమావేశం ముగిసింది.
భేటిలో పురపాలక ముఖ్య కార్యదర్శి జోషి, L&T ప్రతినిధులు పాల్గొన్నారు.సమావేశం ముగిసిన తర్వాత N.V.S.రెడ్డి మాట్లాడుతూ..ప్రభుత్వం, L&T మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతూ ఉంటాయని పేర్కొన్నారు.
తాము ఇటువంటివాటికి సమాధానాలు ఇస్తూ ఉంటామని చెప్పారు.మెట్రో పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.. సాఫీగా జరుగుతాయని స్పష్టం చేశారు.
తాజ్ కృష్ణలో కేంద్ర విదేశివ్యవహారాల శాఖ,రాష్ట్ర గ్రామీణాభివృద్ధి,పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన అంశాలపై సదస్సు జరగనుంది.
సదస్సును పంచాయితీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ ప్రారంభించారు.
ఈ సదస్సులో 15 దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.అనంతరం కేటిఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు సాధించిన ప్రగతిపై సదస్సులో చర్చించామని చెప్పారు.
అభివృద్ధిలో మహిళలను భాగస్వాములను చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు.
సదస్సుకు వచ్చిన ప్రతినిధులు మహబూబ్ నగర్,మెదక్ నల్గొండ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని తెలిపారు.
ప్రముఖులకు అత్యున్నత పురస్కారల కోసం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫారసులు చేసినట్లు సమాచారం.
మాజీ ప్రధాని పి.వీ నరసింహరావుకు - భారతరత్న,
ప్రొ.జయశంకర్ కు - పద్మభూషణ్,
ప్రొ.రాంరెడ్డికి - పద్మ విభూషణ్
సీనియర్ డైరెక్టర్ నర్సింగరావు ,కాపు రాజయ్యకు - పద్మ శ్రీ,
ప్రభుత్వ రాజముద్ర రూపకర్త ఏలే లక్ష్మణ్, వైకుంఠంకు - పద్మశ్రీ ప్రధానం చేయాలని కోరాలని నిర్ణయించినట్లు సమాచారం.
వీరితో పాటు మరికొంత మంది పేర్లను కూడా కేంద్రానికి సిఫారసు చేసినట్లు సమాచారం.

రాష్ట్ర గవర్నర్ నరసింహన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు.తన పర్యటనలో ఆయన ప్రధాని నరేంద్రమోడిని కలవనున్నారు.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సమస్యలపై ప్రధానితో చర్చించనున్నారు.
మణిపూర్ లోని ఎన్ఐటీ కళాశాలలో విద్యార్ధుల మధ్య లోకల్ నాన్ లోకల్ ఘర్షణ తలెత్తింది.కళాశాలలో చదువుతున్న తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ లకు చెందిన తెలుగు విద్యార్ధులపై మణిపూర్ విద్యార్ధులు దాడికి పాల్పడ్డారు.తెలుగు విద్యార్ధులపై గత నలుగు రోజులుగా దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం.దాడులపై విద్యార్ధులు ఎన్ఐటీ యాజమాన్యానికి ,స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని విద్యార్ధులు తెలుపుతున్నారు.లోకల్ విద్యార్ధులు గుండాలతో కూడా దాడి చేయిస్తున్నట్లు విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.బిక్కుబిక్కు మంటూ తెలుగు విద్యార్ధులు కాలేజీలోనే ఉంటున్నారు.
పంచాయితీరాజ్ లో 100 రోజుల పాలన పై తెలంగాణా రాష్ట్ర పంచాయితీరాజ్,ఐటి శాఖ మంత్రి కేటిఆర్ నివేదిక విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నవంబర్ 1 నుంచి కొత్త పింఛన్ విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు.ప్రతి గ్రామంలో మంచి నీరు,రోడ్లు ,డ్రైన్లు ఏర్పాటే తమ ప్రాధాన్యమని వెల్లడించారు.
ఏటా రూ.వెయ్యి కోట్లు చిన్ననీటి పారుదల వ్యవస్థ పునరుద్ధరణకు కేటాయించనున్నట్లు చెప్పారు.
1,192 గిరిజన తండాలు,గూడేలను పంచాయితీలుగా గుర్తించినట్లు వివరించారు.
పింఛన్లను లబ్ధిదారులకు చేర్చేందుకు బయోమెట్రిక్ విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు.
సమగ్ర సర్వే ద్వారా కోటి 6 లక్షలకు పైగా కుటుంబాలు ఉన్నట్లు తేలిందన్నారు.కంపూటర్లో 96 లక్షల కుటుంబాల వివరాలను నిక్షిప్తం చేసినట్లు పేర్కొన్నారు.
పంచాయితీరాజ్ కొత్త విధానం రూపొందించి త్వరలో ప్రకటిస్తామన్నారు.ఉపాధి హామీలో అక్రమాలు,సమస్యల పరిష్కారానికి హెల్ఫ్ లైన్ 1800 200 1001 ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు.
ఘనంగా గీతం యూనివర్సిటీ స్నాతకోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ శాస్త్ర సలహాదారు,రక్షణ పరిశోధనాభివృద్ధి విభాగం కార్యదర్శి డాక్టర్ అవినాశ్ చందర్,దర్శకుడు రాఘవేంద్రరావు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండి శైలజా కిరణ్,ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు.
వీరికి గీతం ఛాన్సలర్ డాక్టర్ కోనేరు రామకృష్ణ రావు డాక్టరేట్లను ప్రధానం చేశారు.
అవినాశ్ చందర్ అనంతరం మాట్లాడుతూ భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచమేటి శక్తిగా ఎదుగుతుందని ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయాలు దేశానికి ఉపయోగపడే పరిశోధనలకు కేంద్రాలు కావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణాలోని మెదక్ లోక్ సభ స్థానానికి,ఆంధ్రప్రదేశ్ లోని నందిగామ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుతున్న ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది.
మెదక్ ఉపఎన్నిక కోసం 1817 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం పోలింగ్ మందకోడిగా కొనసాగుతుంది.పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేదని గంగాపూర్ గ్రామస్థులు,రోడ్డు సౌకర్యం లేదని పెద్దాపూర్ గ్రామస్థులు పోలింగ్ ను బహిష్కరించారు.మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ఓటు వేయగా తెరాస అభ్యర్థి కొత్తా ప్రభాకర్ రెడ్డి పోచారంలో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి సంగారెడ్డిలో కాంగ్రేస్ అభ్యర్థి సునితా లక్ష్మారెడ్డి గోమారంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.దాదాపు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో 15 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.
కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీకి జరుగుతున్న ఉపఎన్నిక పోలింగ్ కూడా చాల మందకోడిగా సాగుతుంది.మొత్తం 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.టీడీపీ అభ్యర్థి సౌమ్య నందిగామలో ఓటుహక్కు వినియోగించుకున్నారు.
ఓట్ల లెక్కింపు సెప్టెంబర్ 16న జరుగుతుంది
తెలంగాణాలోని ప్రతి ఇంటికి నీరివ్వడమే వాటర్ గ్రిడ్ లక్ష్యమని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఈరోజు వాటర్ గిడ్ పై గ్రామీణ ప్రాంత ఇంజనీర్లతో ఆచార్య జయశంకర్ వర్సిటీలో సిఎం కేసిఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎం ప్రసంగిస్తూ ప్రతి ఇంటిపై నళ్లా,మరుగుదొడ్డి ఏర్పాటుపై అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
సమగ్ర మంచినీటి పథకాన్ని సిద్దిపేటలో అభివృద్ధి చేశామని అన్నారు.రాష్ట్రంలో మంచినీరు అందించే విషయంలో అధికారులు ముఖ్యపాత్ర పోషించాలనిఅలాగే వేల కోట్లు వెచ్చించిన కార్యక్రమం దుర్వినియోగం కాకూడదని అధికారులను నిర్ధేశిస్తూ కింది స్థాయి ఉద్యోగులను అవగాహన పరిచి పథకం సద్వినియోగం చేయాలని సూచించారు.డబ్బు వెచ్చించడం వరకే ప్రభుత్వం పని.ఆ డబ్బును సద్వినియోగం చేయాల్సింది అధికారులేనని.అందరూ కలిసి సహకరించుకొని పని చేస్తేనే ప్రభుత్వ పథకాలు సద్వినియోగం అవుతాయని సిఎం అన్నారు.
 ప్రజాకవి కాళోజి నారాయణ రావు శతజయంతి సందర్భంగా హన్మకొండ లోని బాలసముద్రంలో రెండెకరాల స్థలంలో కాళోజి కళా కేంద్రానికి తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు.
ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.వరంగల్ నిట్ కు కెసిఆర్ హెలికాప్టర్ లో చేరుకొని అక్కడినుండి నుండి బాలసముద్రానికి చేరుకొని భూమి పూజ చేస్తారు.సుమారు 2000 మంది కూర్చొవడానికి వీలుగా కళాక్షేత్రం ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యానవనం ఏర్పాటు చేస్తారు.హైదరాబాద్ లోని రవీంద్ర భారతికి ఏమాత్రం తీసిపోకుండా ఈ కళాక్షేత్రం ఉండాలని కెసిఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.ఆడిటోరియం ముందుభాగంలో కాళోజి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.
జిల్లాలోని సమస్యలు,ప్రభుత్వం చేపట్టాల్సిన పనులగురించి కెసిఆర్ తన వరంగల్ పర్యటనలో జిల్లా ప్రతినిధులు,అధికారులతో చర్చిస్తారు.తిరిగి సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ చేరుకొని సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతిలో జరిగే కాళోజి శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

బుధవారం గ్రూప్ పరీక్షలపై అవగాహనా సదస్సు నిర్వహించనున్నట్లు తెలంగాణా ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.సాయంత్రం 5 గంటలకు బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసి కళాభవన్ లో ఈ సదస్సు జరుగుతుంది.హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి,ఆర్టీసీ ఎండి పుర్ణచందర్ రావు,ఇంటలిజన్స్ డీఐజీ మధుసూదన్ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జీవీ రమణ రావు సదస్సులో పాల్గొంటారు.ఎంట్రి ఫీజు లేదు.వివరాలకు 0949075535 నెంబర్ ను అభ్యర్ధులు సంప్రదించాలి.

గణేషున్ని నిమజ్జనం చేయడానికి వెళుతున్న ఆటో ట్రాలీ హైదరాబాద్ మొజంజాహి మార్కెట్ సమీపంలోకి రాగానే మలుపు తిప్పుతున్న సమయంలో ఒక్కసారిగా బోల్తాపడింది.ఆటో ట్రాలీలో అందరూ యువకులే ఉన్నారు.ఆటో పడిపోవడంతో అక్కడే ఉన్న పోలీసులు వెంటనే స్పందించి సెకండ్లలో పైకి లేపారు.అందులో ఉన్న నలుగురు యువకులు గాయపడగా ఒక బాబు స్పృహ కోల్పోయాడు.వెంటనే వారిని అక్కడే ఉన్న అంబులన్స్ లో నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించారు.విగ్రహం పూర్తిగా ద్వంసమైంది.

ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన బాలాపూర్ లడ్డును ఈ సంవత్సరం రూ.9 లక్షల 50 వేలకు సింగిరెడ్డి జయేందర్ రెడ్డి దక్కించుకున్నారు.గత సంవత్సరం ఇక్కడి లడ్డు వేలంలో రూ.9 లక్షల 26 వేలకు తీగల కృష్ణారెడ్డి దక్కించుకున్నారు.
మొత్తం 24 మంది లడ్డు వేలంలో పాల్గొనడానికి పేర్లు నమోదు చేసుకున్నారు.ఈసారి కూడా బాలాపూర్ వినాయకుడి లడ్డు రికార్డు ధర పలికింది.
1994 లో వినాయకుడి లడ్డు రూ.450 పలికింది.
2004 నుండి ఇప్పటి వరకు బాలాపూర్ లడ్డూ వేలంలో దక్కించుకున్న వారు.
2004 మోహన్‌రెడ్డి రూ.2.01
2005 శేఖర్ రూ.2.08
2006 తిరుపతిరెడ్డి రూ.3.00
2007 రఘునందనాచారి రూ.4.15
2008 కొలను మోహన్‌రెడ్డి రూ.5.07
2009 సరిత రూ.5.10
2010 శ్రీధర్‌బాబు రూ.5.30
2011 కొలను కుటుంబం రూ.5.45
2012 పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ.7.50
2013 తీగల కృష్ణారెడ్డి రూ.9.26

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడితో శనివారం ఉదయం సమావేశమయ్యారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్టితులను ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకి వివరించారు.ప్రధానిని ప్రపంచ మెట్రో పోలీస్ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ కు రావాల్సిందిగా కెసిఆర్ ఆహ్వానించారు.ప్రధానితో భేటి అనంతరం సమావేశ వివరాలను తెరాస లోక్ సభాపక్షనేత జితేందర్ రెడ్డి మీడియాకి వివరించారు. కేసీఆర్ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన 21 ప్రతిపాదనలను ప్రధాని ముందుంచారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హైకోర్ట్ ఏర్పాటు చేయాలని,తెలంగాణాకు ప్రత్యేక హోదా,పన్ను రాయితీ కల్పించాలని కోరినట్లు అయన తెలిపారు. వరంగల్ - హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు,4వేల మెగావాట్ల సామర్ధ్యంతో ఏన్టీపీసీ ఏర్పాటు చేయాలని ప్రధాని మోడికి విజ్ఞప్తి చేసినట్లు జితేందర్ వెల్లడించారు. కరీంనగర్ ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడుతూ గతప్రభుత్వాల తప్పులు సమగ్రసర్వే ద్వారా బయట పడ్డాయని, సమగ్ర కుటుంబ సర్వేను ప్రధాని పరిశేలిస్తామన్నారని ఆయన తెలిపారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఖమ్మం జిల్లా నేత తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం తెరాస పార్టీ అధ్యక్షుడు సీఎం కెసిఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు.ఆగష్టు 30న టీడీపీకి రాజీనామా చేసిన తుమ్మల ఈరోజు ఉదయం మూడువేల వాహనాలతో బారీ ర్యాలీగా ఖమ్మం నుండి బయలుదేరి తెలంగాణా భవన్ కు చేరుకొని తెరాసాలో చేరారు.
తుమ్మలతో పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ,కొండబాల కోటేశ్వర్ రావు,ఖమ్మం జడ్పీ చైర్ పర్సన్ కవిత,డీసీసీబీ చైర్మన్ మువ్వ విజయ్ బాబు,కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్ రావు లు కూడా టీఆర్ఎస్ లో చేరారు.ఇంకా 18మంది జడ్పీటీసీలు,ఎంపీపీలు,ఎంపీటీసీలు,సర్పంచ్ లు వేలాది మంది కార్యకర్తలు తుమ్మలతో పాటు తెరాస తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ తుమ్మల నిఖార్సయిన నేత అని,టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో మేము కూడా ఉన్నామని,మొదటిసారి పోటీ చేసినప్పుడు ఇద్దరం ఓడిపోయామని చెప్పుకొచ్చారు.తుమ్మలను కెసిఆర్ తన మాటలతో ఆకాశానికి ఎత్తారు.తుమ్మల తనకు ఆప్త మిత్రుడని,పార్టీలో చేరడానికి వెయ్యిమంది వస్తారని ఊహించాను అని,ఇంత పెద్ద మొత్తంలో వస్తారని తెలిస్తే సభ నిజాం గ్రౌండ్స్ లో పెట్టుకునేవాళ్ళమని,ఇది తుమ్మల పొరపాటు అందులో నా తప్పు లేదని చమత్కరించారు సీఎం కెసిఆర్.

| Copyright © 2013 Radio Jalsa News