తిరుగులేని భారత్,వరుసగా 7వ సారి గోల్డ్ మెడల్

కబడ్డీలో భారత్ సత్తా ఏంటో మరోసారి ఋజువైంది.ఇంచియాన్ లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు ఇరాన్ ను ఓడించి వరుసగా 7వ సారి బంగారు పతకాన్ని దక్కించుకుంది.హోరాహోరీగా జరిగిన ఫైనల్ లో 27-25 తో ఇరాన్ ను చిత్తు చేసింది.
మొదటి హాఫ్ పూర్తయ్యే సమయానికి భారత్ 13-21 స్కోరు తేడాతో వెనకబడింది.ద్వితీయార్థంలో ఒక్కసారిగా పుంజుకున్న భారత్ ఆటగాళ్ళు 14 పాయింట్లు సాధించగా ఇరాన్ కేవలం 4 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది.జస్వీర్,రాహుల్,రాకేశ్ రైడింగ్ లో రాణించారు.
1990లో మొదటిసారి ఆసియా క్రీడల్లో కబడ్డీ ఆటను ప్రవేశపెట్టారు.అప్పటినుండి ఇప్పటి వరకు భారత్ పురుషుల జట్టు స్వర్ణ పతకాన్ని గెలుస్తూ వస్తుంది.భారత మహిళల జట్టు కూడా ఇరాన్ ను ఫైనల్ లో ఓడించి వరుసగా రెండోసారి బంగారు పతకాన్ని దక్కించుకుంది
రాష్ట్రపతి,ప్రధాని ఇద్దరూ భారత్ జట్టుకు శుభాకాంక్షలు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News