సినిమాలు విడుదలయ్యాక వాటికి అదనంగా సన్నివేశాలు,పాటలు చేర్చడం తరచుగా చూస్తుంటాం.మన తెలుగు సినిమాల్లో ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి.అక్టోబర్ 1న విడుదలైన రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం కూడా ఈ కోవలోకే వెళ్తుంది.కుటుంబ కథా చిత్రంగా ఇప్పటికే మంచి టాక్ సంపాదించుకున్న ఈసినిమాకు అదనంగా మరో పాటను చేరుస్తున్నారు.
పాట చిత్రీకరణ కూడా మొదలైంది.దసరా పండగ రోజు కూడా విరామం లేకుండా ఈ పాటను చిత్రీకరించే పనిలో పడ్డారు.మూడు లేదా నాలుగు రోజుల్లో పాటను చేర్చనున్నారు.పాట పూర్తయ్యేవరకు ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా పని చేయాలని హీరో రామ్ చరణ్ డిసైడ్ అయ్యారు.అయితే ఈసినిమా ప్రిమియర్ షోకు అమెరికా వెళ్ళాలని నిశ్చయించుకున్న రామ్ చరణ్ పాట చిత్రీకరణ ఉండడంతో ఇక్కడే ఆగిపోయాడు.
ఇది వరకు కూడా రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రంలో కూడా అదనపు సన్నివేశాలు చేర్చారు.మొదట సినిమా నిడివి ఎక్కువైందని భావించి తరువాత సూపర్ హిట్ టాక్ వచ్చాక కొన్ని సన్నివేశాలు కలిపారు.మరి ఇప్పుడు అదనంగా చేర్చుతున్న పాటతో సినిమాకు ప్లస్ అవుతుందో లేదో చూడాలంటే ఇంకో 4 రోజులు ఆగాల్సిందే.
దసరా పండగ రేసులో విడుదలైన 'గోవిందుడు అందరివాడేలే' మొదటి ఆటనుండే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది.అక్టోబర్ 1 బుధవారం నాడు రామ్ చరణ్ నటించిన 'గోవిందుడు అందరివాడేలే' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కృష్ణవంశీ దర్శకత్వంలో మొదటిసారి రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కాజల్ కథానాయిక.బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీకాంత్,కమలినీ ముఖర్జీ,ప్రకాష్ రాజ్,జయసుధ,పోసాని,కోట శ్రీనివాసరావు,రావు రమేష్ ముఖ్య తారాగణం.సినిమా కథా విశేషాల్లోకి వెళ్తే....
ఊరు బాగోగులు కోరుకునే వ్యక్తి బాలరాజు(ప్రకాష్ రాజ్)కు ఇద్దరు కుమారులు.పెద్దవాడు చంద్రశేఖర్(రహమాన్),చిన్నవాడు బంగారం(శ్రీకాంత్).చంద్రశేఖర్ డాక్టర్ కావాలని,ఊరి ప్రజలకు మెరుగైన వైద్యం చేయాలని బాలరాజు కోరుకుంటాడు.డాక్టర్ కావాలనే కోరికను చంద్రశేఖర్ తిరస్కరించడంతో తండ్రీకొడుకులు విడిపోతారు.చంద్రశేఖర్ వెళ్లి లండన్ లో స్థిరపడతారు.చంద్రశేఖర్ కుమారుడు అభిరామ్(రామ్ చరణ్)లండన్ లో పెరిగినా భారతీయ సాంప్రదాయాల పట్ల మంచి గౌరవం ఉంటుంది.
తండ్రికీ.తాతకు మధ్య విభేదాలు ఏంటో తన తండ్రి ద్వారా తెలుసుకున్న అభిరామ్ ఇండియాకు వస్తాడు.బాలరాజు కుటుంబంలో తమ ఫ్యామిలీ కూడా కలపాలని ఆరాటపడే అభిరామ్ అపరిచితునిగా బాలరాజు ఇంట్లోకి ప్రవేశిస్తాడు.అలా వచ్చిన అభిరామ్ తను అనుకున్న లక్ష్యాన్ని అధిగమించాడా?అభిరామ్ ఆ కుటుంబ వారసుడే అని బాలరాజుకు తెలుస్తుందా?తెలిస్తే ఏవిధంగా స్పందిచారు?తన మరదలు సత్య(కాజల్)ప్రేమను ఎలా దక్కించుకున్నాడు?చివరికి ఏమైంది వంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్
కుటుంబ విలువలు,బాంధవ్యాలు మొదలగు అంశాలు సినిమాలో చక్కగా చూపించారు.రామ్ చరణ్ కుటుంబ కథా చిత్రాలను ఎలా చేస్తాడో అనుకున్నారు,కాని ఊహించినదానికంటే అధ్బుతంగా నటించాడు.ఇప్పటివరకు తను నటించిన చిత్రాలకు ఇది భిన్నం అని చెప్పవచ్చు.నటన పరంగా రామ్ చరణ్ 100 మార్కులు కొట్టేశాడు.రామ్ చరణ్,కాజల్ ల కెమిస్ట్రీ ఈ సినిమాలో బాగుంటుంది.తెలుగు ప్రేక్షకులకు మంచి కుటుంబ కథా చిత్రం అందించాలని తలచిన దర్శకుడు కృష్ణవంశీ అందులో విజయం సాధించాడు అని చెప్పవచ్చు.ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది.బాలరాజు పాత్రలో ప్రకాష్ రాజ్ జీవించాడు,ప్రకాష్ రాజ్ మాత్రమే ఇలాంటి పాత్రలకు న్యాయం చేయగలడు అని మరోసారి నిరూపించాడు.
మైనస్ పాయింట్స్
సంగీతం,ఫస్ట్ హాఫ్ కొంత స్లో అయినట్టు అనిపిస్తుంది.రొటీన్ కథే అన్న ఫీలింగ్ కలుగుతుంది.నెగెటివ్ పాత్రలకు ఇంకొంచెం స్ట్రాంగ్ గా డిజైన్ చేయాల్సింది.
పాత్రలకు తగ్గట్టు సినిమాలో ప్రతీఒక్కరూ బాగా నటించారు.జయసుధ,కమలినీ ముఖర్జీ,శ్రీకాంత్,రావు రమేష్,కోట తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేశారు.
దసరా కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం.మంచి కలెక్షన్లు కొల్లగొట్టే అవకాశాలు చాలానే ఉన్నాయి.8వ చిత్రం ఫాఫ్ అనే ఫోబియాను రామ్ చరణ్ అధిగమించాడు అని చెప్పొచ్చు .
రేడియో జల్సా రేటింగ్ :3.25/5
ఎప్పుడెప్పుడా అని ఎదురు చుసిన మహేష్ బాబు 'ఆగడు' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట,గోపీచంద్ ఆచంట మరియు అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక,తమన్ సంగీతాన్ని అందించారు.సినిమా ఎలావుందో చూద్దాం.
మొదట సినిమా కథ విషయానికే వస్తే శంకర్(మహేష్)ఓ అనాథ,కాని చాల తెలివైన కుర్రాడు.తనలోని చురుకుదనాన్ని చుసిన రాజా రావు(రాజేంద్రప్రసాద్)అనే ఇన్స్ పెక్టర్ శంకర్ ను చేరదీసి పోలీస్ ఆఫీసర్ చేయాలనుకుంటాడు.కాని అనుకోని కారణాలవల్ల చేయని హత్యను తనమీద వేసుకొని జైలుకు వెళుతాడు.అరెస్టయిన శంకర్ బోస్టన్ స్కూల్ లో చదివి పోలీస్ ఆఫీసర్ అవుతాడు.అలా శంకర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరొందుతాడు.దాము అలియాస్ దామోదర్(సోనూ సూద్)అక్రమాలను అరికట్టడానికి ఒక గ్రామానికి ట్రాన్స్ ఫర్ చేస్తారు శంకర్ ను.అసలు దాము ఎవరు?శంకర్ జైలుకు వెళ్ళడానికి కారణం ఏంటి? మొదలగునవి తెర మీద చూడాల్సిందే.
మహేష్ బాబు ఇంట్రడక్షన్ తోపాటు మొదటి సాంగ్ చాలా బాగొచ్చింది.సినిమాలో మహేష్ బాబు పంచ్ డైలాగ్ లు బాగానే ఉన్నాయి.అయితే పంచ్ డైలాగ్ ల డోస్ ఎక్కువైన ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుంది.ఇక తమన్నా విషయానికి వస్తే అంతగా ప్రాధాన్యంలేని పాత్ర.మహేష్ బాబుకు ప్రేయసిగా కనిపిస్తుంది.కొన్ని పాటల్లో గ్లామర్ డోస్ పెంచింది.సినిమా మొదటి భాగం బాగానే ఉంటుంది.రెండవ భాగంలోకి వచ్చే సరికి ప్రేక్షకులు కొంత ఇబ్బంది పడతారు.నిడివి కూడా ఎక్కువగా ఉంటుంది.శీను,పోసాని,రఘుబాబులతో చేయించిన'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీక్వెన్స్ కూడా నవ్వించకపోగా బోర్ కొట్టిస్తుంది.బ్రహ్మనందం బ్రోకర్ పాత్రలో కనిపిస్తాడు కాని అంతగా ఆకట్టుకోలేదు.రొటీన్ కామెడీ తప్పా శ్రీనువైట్ల కామెడీ మాత్రం కనిపించలేదు సినిమాలో.పంచ్ డైలాగ్ లమీద చూపిన శ్రద్ధ సినిమా కథమీద చూపిస్తే సినిమా బాగుండేది.మహేష్ బాబు ఇమేజ్,మహేష్ బాబు పేల్చే డైలాగ్ ల మీడీ శ్రీనువైట్ల ఆధారపడ్డాడు.సినిమా రెండవ భాగం 'దూకుడు' సినిమాను పోలి ఉందని ప్రేక్షకులు పెదవి విరుస్తారు.
ప్లస్ పాయింట్లు
సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే సినిమా అంతే మహేష్ అనే చెప్పాలి.మహేష్ పేల్చే పంచ్ డైలాగ్ లు ఆకట్టుకుంటాయి.టోటల్ గా మహేష్ పెర్ఫార్మన్స్ చాలా బాగుంటుంది.
మైనస్ పాయింట్లు
ముఖ్యంగా సినిమాకు శ్రీనువైట్ల దర్శకత్వం మైనస్ గా నిలిచింది.మూస ధోరణిలో సాగడం,సినిమాలో పంచ్ డైలాగ్ ల డోస్ ఎక్కువవడం,సరైన కథ-కథనం లేకపోవడం,రెండవ భాగం,ఎక్కువ నిడివి.

దసరాకు ముందే ప్రేక్షకులను అలరించాలని 'ఆగడు' యూనిట్ అనుకున్నా అందులో సక్సెస్ కాలేదని చెప్పొచ్చు.కాకుంటే ప్రస్తుతానికి పెద్ద హీరోల సినిమాలు ఏవి లేకపోవడంతో కమర్షియల్ గా సక్సెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి.
విక్రమ్ కథానాయకుడుగా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఐ',తెలుగులో మనోహరుడు.ఎప్పుడెప్పుడా అని గత రెండు సంవత్సరాలుగు ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.
ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.చిత్ర టీజర్ చూసినవారికి కచ్చితంగా సినిమా మీద అంచనాలు పెరిగిపోతాయి.ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.అయితే సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' చిత్ర ఆడియో శిల్పకళా వేదికలో వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు.
చిరంజీవి మాట్లాడడానికి మైక్ తీసుకోగానే అభిమానులు పవన్ గురించి ప్రస్తావించారు.చివర్లో మాట్లాడుతాను అన్నారు కాని అభిమానులు మళ్ళీ అడగడంతో పవన్ ప్రస్థావన తీసుకొచ్చారు చిరంజీవి.'గోవిందుడు అందరివాడేలే' 150 రోజుల ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ వస్తే మీకేమైనా అభ్యంతరమా అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
ఇంకా చిత్రంలో నటించిన మరియు సాంకేతిక వర్గంలోని ప్రతీ ఒక్కరిని పేరుపేరునా పలకరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ముఖ్యంగా సుద్దాల అశోక్ తేజ రచించిన పాట మనసుని హత్తుకుందని తెలిపారు చిరు.ఒకరోజు సినిమా షూటింగ్ అయ్యాక ఇంటికి వచ్చి సినిమాలో శ్రీకాంత్ తో నటిస్తుంటే సొంత బాబాయ్ తో నటించినట్టుందని రామ్ చరణ్ నాతో అన్నారు,అప్పుడు శ్రీకాంత్ నిజంగానే నీకు బాబాయ్ లాంటి వాడు అని అన్నానని చిరంజీవి తెలిపారు.
గోవిందుడు అందరివాడేలే చిత్ర 150 రోజుల వేడుకకు పవన్ కళ్యాణే వస్తారా లేక రామ్ చరణ్ ఆహ్వానిస్తారా లేకుంటే సినిమా 150 రోజులు ఆడే అంత బాగా ఉంటుందా వేచి చూడాల్సిందే.
శిల్పకళా వేదికలో జరిగిన 'గోవిందుడు అందరివాడేలే' ఆడియో కార్యక్రమంలో చిరంజీవి నటించబోయే 150వ చిత్రానికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది.రామ్ చరణ్ మాట్లాడుతూ నాన్నగారి 150వ చిత్రానికి అమ్మ ద్వారా నేనే నిర్మిస్తాను అని తెలిపారు.అంతకముందు నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ చిరంజీవి గారి 150వ చిత్రాన్ని నిర్మించే అవకాశం నాకు ఇవ్వాలని కోరారు.దీనిమీద స్పందించిన రామ్ చరణ్ ఆ అవకాశం నీకులేదని 150వ చిత్రం నాదే అని చెప్పారు.ఇదే విషయమై చిరంజీవి మాట్లాడుతూ మంచి కథ కోసం చూస్తున్నాను కథ దొరకగానే సినిమా మొదలవుతుంది అని అన్నారు.బహుశ ఈ సంవత్సరం చివరికల్లా ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని అన్నారు.ఇంకా మాట్లాడుతూ బండ్ల గణేష్ కు నిర్మాతగా తరువాత చిత్రాల్లో అవకాశం ఇస్తాను అని,అతను బండ్ల గణేష్ కాదని బడ్జెట్ గణేష్ అని చమత్కరించారు చిరంజీవి.

'గోవిందుడు అందరివాడేలే' అన్ని పాటల వీడియో ప్రోమోలు ఆడియో కార్యక్రమం రోజే విడుదల చేశారు.


రామ్ చరణ్ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' అక్టోబర్ 1న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.సోమవారం సాయంత్రం శిల్పకళా వేదికగా జరిగిన చిత్ర ఆడియో ఫంక్షన్ లో స్వయంగా హీరో రాంచరణ్ ప్రకటించారు.ఈ ఆడియో కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పరమేశ్వర ఆర్ట్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రానికి కృష్ణవంశి దర్శకత్వం వహించారు.మొదటిసారిగా రామ్ చరణ్ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు.రామ్ చరణ్ సరసన కాజల్ హీరోయిన్ గ నటించింది.
గత వారం వ్యభిచారం చేస్తూ బంజారాహిల్స్ లోని ఒక విలాసవంతమైన హోటల్ లో 23 సంవత్సరాల నటి శ్వేత బసు ప్రసాద్ పట్టుబడిన విషయం తెలిసిందే.జాతీయ అవార్డు విజేత అయిన శ్వేత పేరును పోలీసులు బహిరంగా పరిచారు కాని ఆమెతో పట్టుబడిన వ్యాపారవేత్త పేరును మాత్రం బయటపెట్టలేదు అని ఇప్పటికే చాలా విమర్శలు వస్తున్నాయి.పట్టుబడ్డ వ్యాపారవేత్త పేరు కూడా బయటపెట్టాలని పెద్దెత్తున డిమాండ్ వచ్చింది.
ఈ సెక్స్ రాకెట్ తో సంబంధం ఉన్నది ఎవరో తెలుసుకోవాలని కోర్టు అనుకుంటుంది.శ్వేత కేసు ఈరోజు కోర్టులో హియరింగ్ కు రానున్న సందర్భంలో వ్యాపారవేత్త ఎవరో బయటపెట్టాలని కోర్టు ఆదేశించింది.కోర్టు ఆదేశాలతో అతను ఎవరో ఈరోజు తెలిసే అవకాశం ఉంది.
అరెస్ట్ చేసిన శ్వేత బసు ప్రసాద్ ను ప్రస్తుతం మహిళా సంరక్షణ గృహంలో ఉంచారు.అయితే చాలా మంది హీరోయిన్స్ వ్యభిచార వృత్తిలో ఉంటున్నారు అని శ్వేత సంచాల వ్యక్యలు చేసింది.
ప్రస్తుతం రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'పండగ చేస్కో' రెగ్యులర్ షూటింగ్ సోమవారం నుండి హైదరాబాద్ లో జరుగుతుంది.ఇటీవలే పొల్లాచి లో సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించి తిరిగివచ్చింది.రామ్ కు జతగా రఖుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తుంది.
పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు.ఈ చిత్రంలో హీరో రామ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తారు,హైవోల్టేజి కలిగిన మాస్ క్యారెక్టర్ ను రామ్ ఈ చిత్రంలో పోషిస్తున్నాడు అని డైరెక్టర్ గోపీచంద్ అన్నారు.ఇప్పటి వరకు చిత్ర షూటింగ్ అనుకున్నదానికంటే వేగంగా జరుగుతుంది,తాజాగా సోమవారం(సెప్టెంబర్ 15)నుండి హైదరాబాద్ లో మా చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది అని నిర్మాత కిరీటి అన్నారు.చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

నారా రోహిత్,విశాఖ సింగ్ జంటగా వస్తున్న చిత్రం 'రౌడీ ఫెలో' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్ర ఆడియోను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చి విడుదల చేయనున్నాడు.సెప్టెంబర్ 16న రౌడీ ఫెలో ఆడియో శిల్పకళా వేదికలో వైభవంగా నిర్వహించనున్నారు.
ప్రముఖ గీత రచయిత కృష్ణ చైతన్య మొదటిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మూవీ మిల్స్ మరియు బ్యానర్ 5 సంయుక్తంగా నిర్మించారు.ఇటీవలే చిత్రంలోని ఒక పాటను వాషింగ్టన్ లో రోహిత్,విశాఖ సింగ్ మీద చిత్రీకరించారు.
స్వామి రారా,ఉయ్యాల జంపాల వంటి చిత్రాలకు సంగీతాన్ని అందించిన సన్నీ ఎంఆర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'రుద్రమదేవి'.3D స్టీరియో స్కోపిక్ చిత్రంగా తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం.
దసరా కానుకగా ఈ చిత్ర మొదటి టీజర్ విడుదల చేసే యోచనలో డైరెక్టర్ గుణశేఖర్ ఉన్నట్టు తెలుస్తుంది.ఇటీవలే చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుపుకుంటుంది.సినిమాను డిసెంబర్ లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
చిత్రంలో చాళుక్య వీరభద్రగా రాణా,గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ కనిపించనున్నారు.
'బలుపు' సినిమా విజయం తరువాత సంవత్సరం పైగా గ్యాప్ తరువాత మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రం 'పవర్' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గతంలో డాన్ శీను,మిస్టర్ ఫర్‌ఫెక్ట్,బలుపు చిత్రాల ద్వారా కథారచయితగా మంచి పేరు తెచ్చుకున్న బాబీ(కే ఎస్ రవీంద్ర) ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.రాక్ లైన్ ఎంటర్ టైనమెంట్ నిర్మాణసారథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా హన్సిక,రెజీనా కథానాయికలుగా నటించారు.
'పవర్' మీద భారీ ఆశలు పెట్టుకున్న రవితేజ,సినిమాలో పవర్ చూపించాడా? అసలు సినిమాలో పవర్ ఉందా...? లేదా..? చూద్దాం
కోల్ కతాలో అవినీతి పోలీస్ ఆఫీసర్ ఏసీపీ బలదేవ్ సహాయ్(రవితేజ).హోంమంత్రి జయవర్ధనే(ముఖేశ్ రుషి)సోదరుడు గంగూలీ భాయ్(సంపత్)ని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకెళ్తుండగా బలదేవ్ సహాయ్ అతన్ని కోర్టులో ప్రవేశపెట్టకుండా పోలీసుల నుండి తప్పించి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాడు.ఇక్కడ కట్ చేస్తే.....
హైదరాబాద్ లో పోలీస్ ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో తిరుపతి(రవితేజ) అనే కుర్రాడు చేయని ప్రయత్నాలు లేవు,కాని అన్నీ విఫలం అవుతాయి.అనుకోకుండా హోంమంత్రి జయవర్ధనే తిరుపతిని చూసి అతనితో మాట్లాడి ఏసీపీ బలదేవ్ సహాయ్ స్థానంలో కూర్చోబెడతాడు.కాని తిరుపతి అలియాస్ బలదేవ్ సహాయ్ జయవర్ధనేకు ఎదురు తిరుగుతాడు.అసలు తిరుపతి ఎందుకు ఎదురుతిరుగుతాడు?బలదేవ్ సహాయ్ నిజంగా అవినీతి ఆఫీసరా?అసలు గంగూ భాయ్ ఎవరు?ఇద్దరు హీరోయిన్లు తిరుపతికి ఎలా సహాయపడతారు వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్లు
రవితేజ ఎనర్జీ సినిమాకు అదనపు బలం.తిరుపతి,బలదేవ్ సహాయ్ రెండు పాత్రల్లో రవితేజ కనిపించారు.హాస్యాన్ని అందించడంలో రవితేజ మరోసారి తనమార్కు ఏంటో చూపించాడు.హాస్యంతో పాటు యాక్షన్ సన్నివేశాలు బాగా చేశాడు హీరో.సినిమాలో హీరోయిన్ల పాత్రలకు అంతగా ప్రాధాన్యం లేనప్పటికీ ఇద్దరూ బాగానే నటించారు.ఫ్లాష్ బ్యాక్ లో కనిపించిన రెజీనా గ్లామర్ గా కనిపించింది.ఒక సాంగ్ లో లిప్ కిస్ తోపాటు గ్లామర్ డోస్ పెంచింది రెజీనా.హన్సిక 4 పాటలకు పరిమితమైంది అని చెప్పవచ్చు.ఆణిముత్యం పాత్రలో బ్రహ్మానందం సందడి చేశాడు.కనిపించినంత సేపు నవ్వించాడు.సప్తగిరి కనిపించింది కొంతసేపే అయిన పాత్రకు న్యాయం చేసి నవ్వులు పండించాడు.జయనన్ విన్సెంట్‌తో కలిసి ఆర్థర్ విల్సన్ ఫోటో గ్రఫీ సినిమాకు హైలైట్ అని చెప్పొచ్చు.ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశం బాగుంటుంది.
మైనస్ పాయింట్లు
దర్శకుడిగా మారిన బాబి సాహసం చేయకుండా రోటీన్ గానే సినిమా తీశాడు.ఒకవిధంగా కథను నడిపించడంలో కన్ఫ్యూజ్ అయ్యాడు.అనుకున్నట్టు కథను ప్రెసెంట్ చేయలేకపోయాడు.స్టొరీ లైన్ విషయానికి వస్తే 'ఆపరేషన్ దుర్యోధన' సినిమా గుర్తుకొస్తుంది.టేకింగ్ పరంగా చూస్తే 'విక్రమార్కుడు',చిత్రంలో సన్నివేశాలు కొన్ని 'బలుపు' చిత్రాన్ని పోలి ఉంటాయి.క్లైమాక్స్ లుంగీ డాన్స్ సీక్వెన్స్ అంతగా ఆకట్టుకోదు.తమన్ సంగీతం యావరేజ్ అని చెప్పొచ్చు.సెకండ్ ఆఫ్ లో కామెడీ కనిపించదు.
తీర్పు
చాలా రోజుల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ 'పవర్' అంత పవర్ చూపించలేదు.రొటీన్ చిత్రమే అయినప్పటికే ఒక కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.అందులో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.మూస దొరణిని పక్కకు పెడితే ఇంకొంచం కొత్తగా కనిపించేది దర్శకుడి ప్రతిభ.రవితేజ అభిమానులు సినిమాను ఎంజాయ్ చేస్తారు.కాని మిగతావారు సెకండ్ ఆఫ్ కు వచ్చే సరికి కొంత ఇబ్బంది పడొచ్చు.ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సినిమాలు లేకపోవడం పవర్ కు ప్లస్.మొదటి వారం కలెక్షన్లు రాబట్టడంలో సఫలం అవుతుంది సినిమా.
రేడియో జల్సా.కామ్ రేటింగ్ :: 3.25/5
గత రెండు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న శంకర్,విక్రం ల ప్రతిష్టాత్మక చిత్రం 'ఐ',తెలుగులో 'మనోహరుడు'గా వస్తుంది.గురువారం ఈ చిత్ర మొదటి motion పోస్టర్ ను విడుదల చేశారు.ఈ నెల 15న ఈ చిత్ర ఆడియో విడుదలను భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ కార్యక్రమానికి హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ శ్వార్జ్ నెగ్గర్,సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు చాలామంది ప్రముఖులు హాజరుకానున్నారు.
ఆస్కార్ రవిచంద్రన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.విక్రం సరసన అమీ జాక్సన్ కథానాయికగా కనిపించనుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకునే పనిలో ఉండి చిత్రం.ఆడియో విడుదల రోజే చిత్ర టీజర్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
'మీలో ఎవరు కోటీశ్వరుడు' తెలుగు టెలివిజన్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యంత ప్రజాదరణ సంపాదించుకున్న షో.నాగార్జున హోస్ట్ చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు షో ఇప్పుడు మహేష్ బాబు చేస్తున్నాడు.కాని బుల్లి తెర మీద కాదు,వెండి తెర మీద చేస్తున్నాడు.
శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న మహేష్ 'ఆగడు' ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షో నిర్వహిస్తాడట,అది కూడా ఎదో నవ్వుకోవడానికి కాదు,సినిమాకు ఉపయోగపడే అత్యంత కీలకమైన సన్నివేశమని సినిమా వర్గాలు తెలుపుతున్నాయి.శ్రీనువైట్ల అంటేనే తన సినిమాల్లో నవ్వుకోవడానికి సృష్టించే పాత్రలు అద్భుతంగా ఉంటాయని తెలుసు,'దూకుడు' చిత్రంలో ఎంఎస్ నారాయణతో చేయించిన పాత్ర,బ్రహ్మానందంతో రియాలిటీ షో పేరుతొ చేయించిన పాత్ర ఇప్పటికి మరవలేనివి.అదేవిధంగా ఆగడు చిత్రంలో కూడా మహేష్ బాబు మీలో ఎవరు కోటీశ్వరుడు షోను హోస్ట్ చేస్తూ నవ్వులు పండిస్తారు అని సమాచారం.మీలో ఎవరు కోటీశ్వరుడు షో సినిమాలో ఎలా సందడి చేస్తుందో చూడాలంటే 19 వరకు ఆగాల్సిందే.మహేష్ బాబు స్వయంగా సెప్టెంబర్ 19న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
| Copyright © 2013 Radio Jalsa News