భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం - సమీక్ష

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడ్డాక ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. 2008లో డీ లిమిటేషన్ వల్ల కొత్తగా ఏర్పడిన నియోజకవర్గమే భువనగిరి. ఇంతకుముందు ఉన్న మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు చాలా వరకు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కలిపారు.
2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసిన కోమటి రెడ్డి రాజగోపాల్ మొదటిసారిగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందారు.
2014 పార్లమెంట్ ఎన్నికలు ప్రత్యేకమైనవి  అని చెప్పవచ్చు. కాంగ్రెస్ నుండి కోమటి రెడ్డి రాజగోపాల్ మళ్ళీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మొదటి సారి గెలుస్తామనే ధీమాతో ఉంది తెరాస, ఆ పార్టీ నుండి డాక్టర్ జేఏసి నేత బూర నర్సయ్య గౌడ్ బరిలో ఉన్నాడు. ఇక బీజేపీ నుండి నల్లు ఇంద్రసేనా రెడ్డి పోటీ చేస్తున్నారు.
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకత ఉంటుంది.  మూడు జిల్లాల నియోజకవర్గాల సముదాయమే  ఈ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం. నల్గొండ జిల్లాకు చెందిన తుంగతుర్తి, మునుగోడ్, నకిరేకల్, భువనగిరి, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వరంగల్ జిల్లాకు చెందిన జనగాం మరియు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి.
డీ లిమిటేషన్ లో పోయిన మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు పరిశీలిస్తే క్రింది విధంగా ఉన్నాయి.
1962-67    -    Laxmi Dass
1967-71    -    G. S. Reddy
1971-77    -    B. N. Reddy
1977-80    -    G. S. Reddy
1980-84    -    G. S. Reddy

1984-89    -    Bheemireddy Narsimha Reddy
1989-91    -    Baddam Narsimha Reddy
1991-96    -    Baddam Narsimha Reddy
1996-98    -    Baddam Narsimha Reddy
1998-99    -    Baddam Narsimha Reddy
1999-04    -    Jaipal Reddy
2004-09    -    Jaipal Reddy
 మిర్యాలగూడ పార్లమెంట్ కు జరిగిన 12 ఎన్నికల్లో 9సార్లు కాంగ్రెస్ గెలిచి తమ సత్తాను ఎప్పటికప్పుడు ఇక్కడ కాంగ్రెస్ నిరూపించుకుంది.మిగతా మూడు సార్లు కమ్యూనిస్ట్ లు గెలిచారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News