ఫైనల్ లోకి ప్రవేశించిన కోల్ కతా నైట్ రైడర్స్

ఐపీఎల్ ఫామ్ నే కొనసాగిస్తూ ఛాంపియన్స్ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్ కతా నైట్ రైడర్స్ గురువారం హైదరాబాద్ లో జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో హోబార్ట్ హరికేన్ పై సునాయాస విజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న హరికేన్స్ ఆదిలోనే తడబడింది.జట్టు స్కోరు 13 పరుగుల వద్ద మైకేల్,ఫామ్ లో ఉన్న బ్లిజార్డ్ ఇద్దరూ డకౌట్ రూపంలో వెనుదిరిగారు.బెన్ డంక్ 39 పరుగులు,షోయబ్ మాలిక్ 66 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది.చావ్లా,పఠాన్,యాదవ్,రస్సెల్,నరైన్ తలా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 20 పరుగుల వద్ద గంభీర్(4),44 పరుగుల వద్ద ఊతప్ప(17) ఔట్ అవడంతో కష్టాల్లో పడ్డట్టు కనిపించింది.కాని కలిస్,పాండేలు సమయోచితంగా ఆడి 63 పరుగులు జోడించారు.32 బంతుల్లో 40 పరుగులు చేసిన మనీష్ పాండే జట్టు స్కోర్ 107 పరుగుల వద్ద పెవీలియన్ బాట పట్టాడు.తరువాత కలిస్ కు జతకలిసిన పఠాన్(14*) మరో వికెట్ పడకుండా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగా విజయాన్ని అందుకున్నారు.కలిస్ 54 పరుగులతో నాటౌట్ గా నిలిచి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News