చేతులెత్తేసిన పంజాబ్,ఫైనల్ కు చేరిన చెన్నై సూపర్ కింగ్స్

గురువారం హైదరాబాద్ లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ టీ20 రెండో సెమీఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ 65 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మీద ఘనవిజయం సాధించి ఫైనల్ లో అడుగుపెట్టింది.అక్టోబర్ 4 శనివారం బెంగళూరులో జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై,కోల్ కతాలు తలబడనున్నాయి.
హోరాహోరీగా జరుగుతుంది అనుకున్న మ్యాచ్ కాస్త ఏకపక్షంగా సాగింది.టాస్ గెలిచిన పంజాబ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.మొదట్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసిన పంజాబ్ బౌలర్లు చెన్నై మొదటి మూడు వికెట్లు 41 పరుగులకే కూల్చారు.తరువాత జతకలిసిన డుప్లేసిస్,బ్రావో స్కోర్ వేగాన్ని పెంచారు.డుప్లేసిస్ 33 బంతుల్లో 46 పరుగులు చేయగా బ్రావో 39 బంతుల్లో 7 ఫోర్లు,4 సిక్సుల సహాయంతో 67 పరుగులు చేసి ఔటయ్యారు.తరువాత వెంటనే రెండు వికెట్లు కోల్పోయినా చివర్లో జడేజా(27*) వేగంగా పరుగులు చేయడంతో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది చెన్నై.
183 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఏ క్షణంలోనూ లక్ష్య చేదన దిశగా సాగలేదు.పంజాబ్ భారీ హిట్టర్లు సెహ్వాగ్,మ్యాక్స్ వెల్,పెరేరాలు పరుగులేమి చేయకుండానే అవుటయ్యారు.చెన్నై బౌలర్ల ధాటికి పంజాబ్ ఒక దశలో 34 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకలలోతు కష్టాల్లో పడింది.చివర్లో అక్షర్ పటేల్ 31 పరుగులు చేయడం,చివరి వికెట్ కు కరణ్ వీర్ సింగ్,అనురీత్ సింగ్ లు 27 పరుగులు జోడించడంతో 117 పరుగులకు ఆలౌట్ అయి ఇంటిదారి పట్టింది.
మ్యాన్ అఫ్ ద మ్యాచ్ డారెన్ బ్రావోకు దక్కింది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News