నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం - సమీక్ష

నల్గొండ జిల్లాలో చారిత్రక నేపధ్యం ఉన్న నియోజకవర్గాల్లో నకిరేకల్ ముందుంటుంది. రాజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో నంద్యాల శ్రీనివాస రెడ్డి ముఖ్యుడు. నంద్యాలతో పాటు పన్నాల రాఘవ రెడ్డి, బీసీ నేత కొండా నాగయ్య మరియు చింతపల్లి చిన్న రాములు కూడా రాజాకారులకు వ్యతిరేఖంగా పోరాడిన వారే. వీరందరికీ జన్మనిచ్చిన గడ్డ నకిరేకల్. ఘన చరిత్ర ఉన్న నకిరేకల్ లో ఇప్పటి వరకు ఏ పార్టీలు రాజ్యమేలాయో చూద్దాం.
డీ లిమిటేషన్ తరువాత నల్గొండ జిల్లాలో పెద్ద అసెంబ్లీ నియోజకవర్గం నకిరేకల్.
 నకిరేకల్ నియోజకవర్గం అనగానే కమ్యూనిస్ట్ ల కంచుకోట అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు నకిరేకల్ నియోజకవర్గంలో 12 సార్లు ఎన్నికలు జరగగా 8 సార్లు సీపీఎం జయకేతనం ఎగురవేయగా కాంగ్రెస్ రెండు సార్లు, పీడీఎఫ్, సీపీఐ తలా ఒక్కోసారి గెలుపొందాయి.
1957 జరిగిన మొదటి ఎన్నికల్లో పీడీఎఫ్ నుండి పోటీ చేసిన ధర్మ భిక్షం గెలిచాడు. 1962 ఎన్నికల్లో సీపీఐ నుండి పోటీ చేసి నంద్యాల శ్రీనివాస్ రెడ్డి గెలుపొందాడు. 1967 నుండి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో సీపీఎం పార్టీకి అడ్డు లేకుండా పోయింది. అయితే 1972 లో ఒక్కసారి మాత్రం కాంగ్రెస్ పార్టీనుండి నిల్చున్న మూసపాటి కమలమ్మ విజయం సాధించింది. 1967,1978,1983,19851989,1994 వరుసగా అయిదు సార్లు మొత్తంగా ఆరు సార్లు నర్రా రాఘవ రెడ్డికి నకిరేకల్ ప్రజలు  పట్టంఘట్టారు.
1999,2004 లో సీపీఎం పార్టీకే చెందిన నోముల నర్సింహయ్య వరసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. దాదాపుగా 31 సంవత్సరాలు నకిరేకల్ ప్రజలు సీపీఎం పార్టీనే గెలిపించారు. 2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి చిరుమర్తి లింగయ్య సీపీఎం పార్టీ అభ్యర్థి మామిడి నర్సయ్య పై 12176 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఉనికిని నిరూపించుకోలేకపోయింది.
2014లో జరిగే ఎన్నికలు మాత్రం ప్రత్యేకం అని చెప్పవచ్చు. తెలంగాణ సాధించిన పార్టీగా తెరాస, తెలంగాణా తీసుకొచ్చిన పార్టీగా కాంగ్రెస్ పోటీకి సిద్ధమయ్యాయి.
తెరాస పార్టీ నుండి వీరేశం, కాంగ్రెస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పోటీ పడుతుండగా బీజీపీ నుండి చెరుకు లక్ష్మీ భాయి తమ తమ అదృష్టాలను పరీక్షించుకోబోతున్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News