సెమీస్ చేరిన శ్రీలంక

చిట్టగాంగ్ : 3/5 , 3/2.. ఇవి శ్రీలంక బౌలర్ల గణాంకాలు.
చిట్టగాంగ్ లో జరిగిన చివరి గ్రూప్-1 మ్యాచ్ లో శ్రీలంక సత్తా చాటింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్ సాధించలేదు. బౌల్ట్, నీషమ్ తలా 3 వికెట్లు తీసుకున్నారు.
స్వల్ప లక్ష్యాన్ని చేధించి సెమీస్ లో అడుగుపెట్టాలనుకున్న కీవీస్,శ్రీలంక బౌలర్ల దాడికి తలవంచారు. ముఖ్యంగా రంగనా హేరాత్ చెలరేగి 3.3 ఓవర్లలో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకొని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు.
మరొక బౌలర్ 3 ఓవర్లలో 3 పరుగులు ఇచ్చి2 వికెట్లు తీసుకున్నాడు. 15.3 ఓవర్లలో 60 పరుగులకే కీవీస్ ఆలౌట్ అయింది. విలియమ్ సన్ ఒక్కడే 42 పరుగులు చేశాడు. ఏ ఒక్కరు 5 పరుగులకు మించి స్కోర్ చేయలేకపోయారు. ఇదే టీ20 ల్లో న్యూజిలాండ్ కు అత్యల్ప స్కోర్. ఈ విజయంతో గ్రూప్-1 లో మొదటి స్థానంలో నిలిచింది లంక. ఏప్రిల్4న భారత్ దక్షిణాఫ్రికాతో సెమీస్ పోరులో తలబడుతుంది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News