మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం - సమీక్ష

నల్గొండ జిల్లాలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అయితే ఈ అసెంబ్లీ నియోజకవర్గం  భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంటుంది.
ఈ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. ఇప్పటి వరకు జరిగిన 10 ఎన్నికల్లో 5 సార్లు కాంగ్రెస్,5 సార్లు సీపీఐ గెలుచుకున్నాయి. ఇంకో పార్టీ ఇప్పటి వరకు ఇక్కడ గెలవలేకపోయాయి. కాంగ్రెస్ గెలిచినా 5సార్లలో నాలుగు సార్లు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గెలిచారు.1967,72,78,83 ఎన్నికల్లో వరుసగా 4సార్లు ఇక్కడి ప్రజలు పాల్వయిని ఎన్నుకొన్నారు. 1985,89,94 ఎన్నికల్లో సీపీఐ పార్టీ నుండి పోటీ చేసిన ఉజ్జిని  నారాయణ రావు హ్యాట్రిక్ విజయం సాధించారు.
1967-2009 వరకు వివరాలు:
1967,72,78,83 -  పాల్వాయి గోవర్దన్ రెడ్డి(కాంగ్రెస్)
1985,89,94 -  ఉజ్జిని నారాయణ రావు(సీపీఐ)
1999 -  పాల్వాయి గోవర్దన్ రెడ్డి(కాంగ్రెస్)
2004 -  పల్లా వెంకట్ రెడ్డి (కాంగ్రెస్)
2009 -  ఉజ్జిని యాదగిరి రావు (సీపీఐ)
2014 లో జరగనున్న ఎన్నికల్లో సీపీఐ, కాంగ్రెస్ కాకుండా ఇంకో పార్టీ గెలిచే అవకాశం ఉంది అని తెరాస భావిస్తుంది. తెలంగాణా రాష్ట్ర సమితి నుండి కూసుకుంట్ల ప్రభాకర్, బీజేపీ నుండి గంగిడి మనోహర్ రెడ్డి, కాంగ్రెస్/సీపీఐ అభ్యర్థి వెంకట్ రెడ్డి పోటీలో ఉన్నారు.
 మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాలు :
మునుగోడు, నారాయణపూర్, మర్రిగూడ,నాంపల్లె, చండూర్ మరియు చౌటుప్పల్

No comments:

| Copyright © 2013 Radio Jalsa News