చనిపోయిన వ్యక్తి లేచి వచ్చిన వేళ

54 సంవత్సరాల బ్రెజిల్ దేశానికి చెందిన వ్యక్తి కాన్సర్ తో చనిపోయాడని నిర్దారించి ప్లాస్టిక్ సంచిలో పెట్టిన రెండు గంటల తరువాత మళ్ళీ బ్రతికిన ఘటన బ్రెజిల్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే :
గొంకాల్వేస్ అనే బ్రెజిల్ దేశస్థుడు గత కొంతకాలంగా కాన్సర్ తో బాధపడుతూ మెనాన్డ్రో డి ఫారియాస్ ఆసుపత్రిలో చేరాడు.అప్పటికే కాన్సర్ అడ్వాన్సు స్టేజిలో ఉందని,రెండు సార్లు హార్ట్ ఎటాక్ ఆసుపత్రిలో ఉన్నప్పుడే వచ్చిందని ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో చనిపోయాడు అని డాక్టర్లు నిర్దారించారు అని బంధువులు తెలిపారు. 

గొంకాల్వేస్ చనిపోయాడు అని నిర్దారించుకున్నాక చెవు,ముక్కు రంధ్రాలను కాటన్ తో మూసివేశారు. తరువాత బాడీని ప్లాస్టిక్ కవర్లో పెట్టి జిప్ పెట్టి మార్చురీకి తరలించారు.తరువాత అతని అంత్యక్రియల నిమిత్తం గొంకాల్వేస్ సోదరుడు బాడీ దగ్గరకు వెళ్లి డ్రెస్ మర్చేక్రమంలో ప్లాస్టిక్ కవర్ కదలడం గమనించాడు.వెంటనే డాక్టర్లను పిలవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలోకి తీసుకెళ్ళారు గొంకాల్వేస్ ను.అయితే అతనిని ప్లాస్టిక్ బాగ్ లో పెట్టి అప్పటికే రెండు గంటలు అయింది.

Read More




No comments:

| Copyright © 2013 Radio Jalsa News