నేడు భారత్,ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే

కార్డిఫ్:భారత్,ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన మొదటి వన్డే మ్యాచ్ ఒక్క బాల్ పడకుండానే వర్షార్పణం అయిన సంగతి తెలిసిందే.కార్డిఫ్ వేదికగా రెండో వన్డే ఈరోజు(బుధవారం)జరగనుంది.ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ టెస్ట్ సీరీస్ లో పరాభవాన్ని వన్డే సీరీస్ ద్వారా తీర్చుకోవాలని చూస్తుండగా ఇంగ్లాండ్ మాత్రం వన్డే సీరీస్ కూడా సాధించి భారత్ ను దెబ్బతీయాలని చూస్తుంది.ఈ రోజు జరిగే రెండో వన్డేకు కూడా వర్షం అడ్డంకి కలిగించే అవకాశం ఉన్నా మ్యాచ్ మాత్రం జరగవచ్చు.మొదట టాస్ గెలిచిన వారు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.పిచ్ మొదట బౌలర్లకు అనుకూలించినా తరువాత బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతుంది.
టెస్ట్ సీరీస్ ఓటమి,కోచ్ పాత్రపై ధోని చేసిన వ్యాక్యలు దుమారం రేపుతుండడంతో ఈ మ్యాచ్ లో గెలిచి అందరి దృష్టిని
మ్యాచ్ వైపు తిప్పించాలని ధోని చూస్తున్నాడు.భారత్ జట్టు శిఖర్ ధావన్,రోహిత్ శర్మ,కోహ్లి,రహనే,రైనా,ధోని,జడేజా,అశ్విన్,భువి,షమీ,ఉమేష్ లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.ఈ మ్యాచ్ ద్వారా ఇంగ్లాండ్ ఆటగాడు హేల్స్ వన్డే అరంగేట్రం చేయనున్నాడు.
గణాంకాలు:
ఇక్కడి గ్రౌండ్ లో ఇంగ్లాండ్ ఆడిన 7 మ్యాచ్ ల్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు,నాలిగింటిలో గెలుపొందగా మూడు ఫలితం తేలలేదు.
కార్డిఫ్ లో ఆడిన వన్డేల్లో విరాట్ కోహ్లి బ్యాటింగ్ యావరేజ్ 98,ఇంకా ఏ ఇతర బ్యాట్స్ మెన్ కి ఇంత యావరేజ్ ఈ మైదానంలో లేదు.
శిఖర్ ధావన్,కోహ్లి మాత్రమే ఈ గ్రౌండ్ లో సెంచరీలు సాధించిన వారిలో ఉన్నారు.
మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభంకానుంది.

Read More News at RADIOJALSA.COM

No comments:

| Copyright © 2013 Radio Jalsa News