సైనా ఇంటికి,సింధు సెమీస్ కి

ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువసంచలనం పీవీ సింధు సెమీఫైనల్లోకి ప్రవేశించి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది.19 సంవత్సరాల సింధు 2013 ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.అయితే మరో షట్లర్ భారత నెంబర్ 1 క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు మాత్రం ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ అందని ద్రాక్షగానే ఊరిస్తుంది.గత బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కూడా పతకం సాధించకుండానే ఇంటిదారి పట్టింది.
11వ సీడెడ్ క్రీడాకారిణి సింధు ప్రపంచ నెంబర్ 2 క్రీడాకారిణి శిక్జియాన్ వ్యాంగ్ పై 19-21,21-19,21-15 తేడాతో విజయం సాధించి సెమీస్ లో అడుగుపెట్టింది.చైనా కు చెందిన శిక్జియాన్ వ్యాంగ్ తో ఇప్పటివరకు ఆరుసార్లు పోటీ పడగా నాలుగుసార్లు సింధునే విజయం సాధించింది.మరోవైపు 7వ సీడ్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్ లో వరల్డ్ నెంబర్ 1 క్రీడాకారిణి లీ చేతిలో 21-15 21-15 తేడాతో ఓడి ఇంటి బాట పట్టింది.
సింధు సెమీఫైనల్లో కొరియాకు చెందిన 6వ సీడ్ 'యేఒన్ జూ బే' తో తలపడనుంది.ఇప్పటివరకు రెండుసార్లు పోటీపడగా రెండింటిలో ఓటమి చవిచూసింది సింధు.
గుత్తా జ్వాల,పొంనప్ప ల జంట 16-21,8-21 తేడాతో చైనా జంట మీద ఓడి టోర్నీ నుండి నిష్క్రమించారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News