సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ కు మహిళలు, బాలికల భద్రత-రక్షణ కమిటీ తన నివేదికను సమర్పించింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య నేతృత్వంలోని ఐఏఎస్,ఐ.పీఎస్ అధికారులతో ప్రభుత్వం ఈ కమిటిని నియమించింది.
శనివారం సచివాలయంలో సీఎం కు కమిటీ సభ్యులు 62 పేజీలతో నివేదికను తాయారు చేసి అందజేశారు.
ఉన్నతాధికారులు, అన్నివర్గాల ప్రజలు ఎన్జీవోల నుంచి అభిప్రాయాలను సేకరించి నివేదికను రూపొందించారు.
ఈ నివేదికలో 82 సూచనలు చేశారు.ప్రత్యేకంగా మహిళల కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కమిటి తన తుది నివేదికను నవంబర్ నేలాఖరుకల్లా ఇవ్వనున్నట్లు సమాచారం.
కమిటి మిగతా సూచనలు :
1.ఆపదలో ఉన్న మహిళల కోసం పునరావాస కేంద్రాల ఏర్పాటు.
2.గ్రామస్థాయిలో నవంబర్ నెలాఖరుకల్లా స్త్రీశక్తి కమిటిల నియామకం.
3.తెలంగాణా రాష్ట్రం కోసం ప్రత్యేక మహిళా కమిషన్ ఏర్పాటు.
4.మహిళల భద్రతపై ప్రతీ జిల్లా కలెక్టర్ నెలకోసారి రివ్యూ చేయాలి.
5.తప్పనిసరిగా పెళ్లిల్ల రిజిస్ట్రేషన్ చేయడం.
6.అన్ని స్కూళ్లలో కాలేజీల్లో బాలికల సంరక్షణ, ప్రైవసీ కోసం ఏర్పాట్లు చేయడం.
7.ఐటీ కార్యాలయాల వద్ద మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టడం.
8.సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మహిళల భద్రతను పర్యావేక్షించడం.
9.నగరాలు, పట్టణ ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేసి మహిళల భద్రతను పెంచడం.
10.మహిళల భద్రతకు మద్యంను నియంత్రించడం.
11.తద్వారా మహిళలపై జరుగుతోన్న నేరాల సంఖ్యను తగ్గించడం.
12.అందుకు అనుగుణంగా అబ్కారీ విధానాన్ని సవరించడం.
13.మూడంకేలతో హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు.
14.సమస్యల పరిష్కారానికి GHMC పరిధిలో 3 కేంద్రాలు ఏర్పాటు.
15.జిల్లాకో కేంద్రం ఏర్పాటు చేయాలి.
16.ఈ కేంద్రాల్లో సభ్యులుగా కౌన్సిలర్, మహిళా న్యాయవాది, పోలీస్ శాఖ ఉన్నతాధికారి ఉండాలి.
17.వైద్యులు, మహిళా శిశు సంక్షేమ అధికారి సభ్యులుగా ఉండాలి.
18.అన్ని పోలీస్ స్టేషన్లలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు.
19.మహిళలు ఫిర్యాదు చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక గది ఏర్పాటు.
20.పోలీస్శాఖలో మహిళలకు 33 % రిజర్వేషన్ అమలు.
21.మహిళలపై వేధింపులు, అత్యాచార ఘటనల్లో 90 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు.
22.అన్ని జిల్లాల్లో పాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు.
23.అత్యాచార ఘటనల్లో అవసరమైతే వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ.
24.ఇంటర్నెట్ లో అసభ్య వెబ్ సైట్లను నిషేధించడం.
25.మహిళలు పనిచేసే ప్రదేశాలు, విద్యా సంస్థల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచడం.