సథరన్ ఎక్స్ ప్రెస్ ను చితకొట్టిన ముంబై ఇండియన్స్ !


రాయ్ పూర్ లో జరుగుతున్న ఛాంపియన్స్ లీగ్ టీ20 క్వాలిఫయింగ్ మ్యాచ్ ల్లో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు శ్రీలంకకు చెందిన సథరన్ ఎక్స్ ప్రెస్ పై సునాయాస విజయం సాధించింది.ఇంకా 22 బంతులు మిగిలి ఉండగానే 162 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 9 వికెట్ల తేడాతో ముంబై విజయాన్నందుకుంది.ముంబై ఓపెనర్లు హుస్సీ,సిమ్మన్స్ కలిసి మొదటి వికెట్ కు 139 పరుగులు జోడించాక హుస్సీ 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు.తరువాత వచ్చిన పోల్లార్డ్ మూడు బారీ సిక్సర్ల సహాయంతో 20 పరుగులు చేయగా సిమ్మన్స్ 76 పరుగులతో నాటౌట్ గా నిలిచి విజయంలో ప్రధాన భూమిక పోషించాడు.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సథరన్ ఎక్స్ ప్రెస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.మహరూఫ్ 41 పరుగులతో రాణించాడు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News