స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నుండి సరికొత్త డెబిట్ కార్డు


బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్ బీఐ) మరో డెబిట్ కార్డ్ ను జారీ చేయడానికి సిద్ధమవుతున్నది.పిన్ నెంబర్ కలిగిన డెబిట్ కార్డులు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉండగా.. పిన్ నెంబర్ లేకుండానే రూ.2 వేల లోపు లావాదేవీలు జరిపేందుకు ఎస్బీఐ ప్రత్యేక డెబిట్ కార్డ్ ను అందించాలనుకుంటున్నట్లు SBI డిప్యూటి ఎండీ ఎస్ కే మిశ్రా తెలిపారు.ఈ కార్డ్ జారి చేసేందుకు రిజర్వ్ బ్యాంకు అనుమతిని తిసుకోవాలనుకుంటున్నది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్రతి డెబిట్ కార్డ్ కు ఒక పిన్ నంబర్ ఉంటుంది..కానీ ఈ పిన్ నంబర్ నుంచి తక్కువ స్థాయిలో జరిపే లావాదేవీలు ఉదాహరణకు బస్సు,మెట్రో టికెట్ ను కొనుగోలు చేసేవారిని మినహాయించాలనుకుంటున్నట్లు మల్టీ-కరెన్సీ ఫారెన్ ట్రావెలింగ్ కార్డ్ లాంచింగ్ కార్యక్రమంలో ఎస్ కే మిశ్రా తెలిపారు.
కొత్త మార్గదర్శకాలు వస్తే భవిష్యత్తులో విడుదలకానున్న అన్ని డెబిట్ కార్డులు పిన్ నంబర్ లేకుండానే వచ్చే అవకాశం ఉందని తెలిపారు.బ్యాంక్ ఈ ప్రత్యేక డెబిట్ కార్డులను జారి చేసే క్రమంలో ఇప్పటికే చెన్నై,ముంబై మెట్రో స్టేషన్లలో టెస్ట్-రన్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ మాస్టర్ కార్డ్ ను విదేశాలకు వెళ్లేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని జారీ చేశారు.ఈ కార్డ్ ద్వారా డాలర్, ఫౌండ్లు,యూరో,సింగపూర్ డాలర్లుగా మార్చుకోవచ్చును.
ఈ కార్డ్ ను కొనుగోలు చేయాలంటే రూ.100 ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది.కానీ ఖచ్చితంగా 200 డాలర్ల మేర లోడ్ చేసుకోవాలి.
ఈ కార్డ్ ఢిల్లీ,ముంబై,చెన్నై,బెంగళూర్ లో ఉన్న 100 శాఖల్లో మాత్రమే లభ్యమవుతుందని మిశ్రా చెప్పారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News