బస్సు నదిలోపడి 32 మంది దుర్మరణం


దాదాపు 50 మందితో వెళుతున్న బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడటంతో సుమారు 32 మంది చనిపోయారు.బస్సులో వారంతా ఓ పెళ్ళికి వెళ్లి వస్తూ కాశ్మీర్ లోని రాజౌరీ జిల్లా నౌషేరా ప్రాంతంలో జీలం నదిలో పడిపోయింది.కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండడంతో అక్కడి నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.
అధికారికంగా ఎంతమంది చనిపోయారు అని ప్రభుత్వం ప్రకటించనప్పటికీ 8 మంది ప్రమాదం నుండి బయటపడినట్టు స్థానికుల ద్వారా తెలిసింది.ముఖ్య పట్టణం నౌషేరా నుండి 30కిమీల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది.ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ JK02AK 9075.
నది ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రక్షణ చర్యలకు ఆటకం కలుగుతుంది అని రాజౌరీ సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News