ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ ఇప్పటివరకు మిశ్రమ ఫలితాలు చవిచూసింది.మొదట టెస్ట్ సీరీస్ ను 3-1 తేడాతో ఓడిపోగా,వన్డే సీరీస్ 3-1 తో గెలుచుకుంది.ఈ పర్యటనలో భారత్ తన చివరి మ్యాచ్ ఆదివారం ఆడనుంది.ఈరోజు జరిగే ఏకైక టీ20 మ్యాచ్ కు వేదిక బర్మింగ్హామ్.
రెండు జట్లు ఇప్పటివరకు 7 టీ20 మ్యాచ్ లు ఆడగా ఇంగ్లాండ్ దే పైచేయి,ఇంగ్లాండ్ నాలుగింట విజయం సాధించగా భారత్ మూడు మ్యాచ్లో విజయం సాధించింది.
విజయంతో ఇంగ్లాండ్ పర్యటన ముగించాలని భారత్ ఆశిస్తుంటే వన్డే సీరీస్ లో ఘోర పరాభవానికి ఈ మ్యాచ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది.ఇంగ్లాండ్ జట్టుకు మోర్గాన్ నాయకత్వం వహించనున్నాడు.
నాలుగో వన్డేలో ఇదే వేదిక మీద భారత్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది.భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే జట్టులో దాదాపు అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు.బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉందని చెప్పవచ్చు.విరాట్ కోహ్లి తప్పా అందరూ బాగానే రాణిస్తున్నారు.అటు టెస్టుల్లో ఇటు వన్డేల్లో పరుగులు చేయడంలో ఘోరంగా విఫలమైన కోహ్లి ఈ మ్యాచ్ లో రానిస్తాడో లేదో చూడాలి.స్పిన్నర్లకు అనుకూలించే ఈ పిచ్ మీద ఆడడం ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ కు ప్రతికూల అంశం.
మ్యాచ్ భారత కాలమాన ప్రకారం సాయంత్రం 7గంటల 30 నిమిషాలకు ప్రారంభవుతుంది.డీడీ,స్టార్ స్పోర్ట్స్ 1 & 3 ల్లో ప్రత్యక్షప్రసారం కానుంది.
No comments: