ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం 2012 సంవత్సరంలో భారత్ లోనే ఎక్కువ ఆత్మహత్యలు నమోదయ్యాయట.ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతీ 40 సెకండ్లకు ఒక ఆత్మహత్య నమోదు అవుతుంది.
ప్రపంచంలో ఇతర ప్రదేశాలతో పోల్చుకుంటే ఎక్కువ ఆత్మహత్యలు అగ్నేయసియా దేశాల్లోనే నమోదవుతున్నాయి.అందునా ఇండియాలో ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయని నివేదిక తెలిపింది.ఈ నివేదిక ప్రకారం ఇండియాలో 2012 సంవత్సరంలో 2 లక్షల 58 వేల 75 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో పురుషులు 1 లక్ష 58 వేల 98 మంది,మహిళలు 99 వేల 9 వందల 77 మంది ఉన్నారు.
ఇంకా ఈ నివేదికలో చాలా ఆసక్తికర అంశాలు ఉన్నాయి.అత్యధికంగా ఆత్మహత్యలకు గురయ్యే దేశాలో గయానా(44.2 per 100,000) మొదటి స్థానంలో ఉంది.తరువాతి స్థానాల్లో ఉత్తర,దక్షిణ కొరియాలు(38.5 మరియు 28.9),శ్రీలంక(28.8),లుథియానే(28.2),సురినామ్(27.8),మొజాంబిక్(27.4),నేపాల్ మరియు టాంజేనియా(24.9 each),బురుండి(23.1),ఇండియా(21.1),సౌత్ సుడాన్(19.8)లు వరుసగా ఉన్నాయి.
ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతీ సంవత్సరం 8 లక్షలకు పైబడే ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు.75 శాతం ఆత్మహత్యలు తక్కువ ఆదాయం గల దేశాల్లోనే జరుగుతున్నాయి.ఆత్మహత్యలు చేసుకునే వారు ఎక్కువగా ఏవిధంగా చేసుకుంటున్నారో కూడా ఈ నివేదికలో తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.ఎక్కువమంది పురుగుమందులు తాగి,ఉరి వేసుకొని,కాల్చుకొని చనిపోతున్నారట.ప్రస్తుతానికి కేవలం 25 దేశాల్లోనే జాతీయ ఆత్మహత్య నివారణ వ్యూహాలు పాటిస్తున్నాయని నివేదికలో పొందుపరిచారు.
అన్ని వయసుల వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు,ముఖ్యంగా 70 సంవత్సరాల వయసు పైబడిన వారు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు,కొన్ని దేశాల్లో యువకులే ఎక్కువమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు,ప్రపంచవ్యాప్తంగా 15-29 సంవత్సరాల యువకులు మరణించడానికి గల కారణాల్లో ఆత్మహత్య రెండో అతిపెద్ద కారణం అని ఈ నివేదిక తెలిపింది.
మాములుగా అయితే మహిళల కంటే పురుషులే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు,ధనిక దేశాల్లో అయితే మహిళల కంటే మూడొంతుల మంది పురుషులు ఆత్మహత్య చేసుకొని మరణిస్తున్నారు,ఆత్మహత్య కారణాలను పరిష్కరించడం ద్వారా వీటి ద్వారా జరిగే మరణాలను తగ్గించవచ్చు అని నివేదిక సూచించింది.
ఆత్మహత్యలు పెరగడానికి మీడియా కూడా ఒక ముఖ్య కారణమట.మీడియాలో వాడే బాషను మార్చుకోవాలి,ఆత్మహత్య ఇలా చేసుకున్నారు అలా చేసుకున్నారు అని సంచలనకోసం వివరించకూడదు అని కూడా నివేదిక సూచించింది.
No comments: