ఇండియాలో గత సంవత్సరం 2013లో సగటున రోజుకు 92 మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి,దేశ రాజధానిలోనే అత్యధికంగా 1,636 కేసులు నమోదయ్యాయి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన లెక్కల ప్రకారం 2013 లో దేశంలో మొత్తం మీద 33,707 అత్యాచార కేసులు నమోదుకాగా 2012తో పోల్చుకుంటే ఈ సంఖ్య ఎక్కువ.2012 లో మొత్తం 24,923 కేసులు నమోదయ్యాయి.2013 సంవత్సరంలో నమోదయిన కేసుల్లో 15,556 కేసుల్లో 18 నుండి 30 ఏళ్ల లోపు వారే బాధితులు.
ఇక దేశ రాజధాని విషయానికి వస్తే 2012 తో పోల్చుకుంటే 2013 లో ఈ కేసులు దాదాపు రెట్టింపయ్యాయి.2012 లో 706 కేసులు నమోదుకాగా 2013 లో ఆ సంఖ్య 16వందలకు చేరుకుంది.సగటున చూసుకుంటే ఢిల్లీలో రోజుకు నాలుగు అత్యాచారాలు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది.ఢిల్లీ తరువాత ముంబైలో 391,జైపూర్ లో 192,పూణేలో 171 కేసులతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
ఎన్సీఆర్బీ డేటా ప్రకారం మధ్యప్రదేశ్ లో సగటున రోజుకు 11 అత్యాచారాలు జరుగుతున్నాయి.2103 సంవత్సరంలో కేవలం మధ్యప్రదేశ్ లోనే నమోదయిన ఈ కేసుల సంఖ్య 4335.తరువాత 3285 కేసులతో రాజస్థాన్,3063 కేసులతో మహారాష్ట్ర,3050 కేసులతో ఉత్తరప్రదేశ్ లు ఉన్నాయి.
మైనర్ బాలికల మీద జరిగిన అత్యాచారాలు 2013లో 13,304 నమోదుకాగా అంతకముందు సంవత్సరం 9,082 కేసులు నమోదయ్యాయి.ఇంకా కలవరపరిచే అంశం ఏంటంటే నమోదయిన ఎక్కువ కేసుల్లో నేరస్తులు బాధితులకు తెలిసినవారే అవడం విచారకరం అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన లెక్కల్లో తెలిపింది.దాదాపు నమోదయిన కేసుల్లో 94 శాతం కేసులు బాధితులకు తెలిసిన నిందితులే.539 కేసుల్లో తల్లిదండ్రులు నిందితులుకాగా,10,782 కేసుల్లో చుట్టుపక్కలవారు,2,315 కేసుల్లో బంధువులు,18 వేల 171 కేసుల్లో నిందితులుగా ఉన్నట్టు నివేదిక తెలిపింది.
అభివృద్ధిలో పోటీపడాల్సిన భారత్ సిగ్గుపడాల్సిన విషయాల్లో ముందుకు పోతుండడం నిజంగా విచారించదగ్గ విషయం.
No comments: