తెలంగాణాకు ప్రత్యేక హోదా కల్పించాలంటూ ప్రధానిని కలిసిన కేసిఆర్


తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్రమోడితో శనివారం ఉదయం సమావేశమయ్యారు.రాష్ట్రంలో నెలకొన్న పరిస్టితులను ఈ సందర్భంగా కేసీఆర్ ఆయనకి వివరించారు.ప్రధానిని ప్రపంచ మెట్రో పోలీస్ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ కు రావాల్సిందిగా కెసిఆర్ ఆహ్వానించారు.ప్రధానితో భేటి అనంతరం సమావేశ వివరాలను తెరాస లోక్ సభాపక్షనేత జితేందర్ రెడ్డి మీడియాకి వివరించారు. కేసీఆర్ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన 21 ప్రతిపాదనలను ప్రధాని ముందుంచారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హైకోర్ట్ ఏర్పాటు చేయాలని,తెలంగాణాకు ప్రత్యేక హోదా,పన్ను రాయితీ కల్పించాలని కోరినట్లు అయన తెలిపారు. వరంగల్ - హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు,4వేల మెగావాట్ల సామర్ధ్యంతో ఏన్టీపీసీ ఏర్పాటు చేయాలని ప్రధాని మోడికి విజ్ఞప్తి చేసినట్లు జితేందర్ వెల్లడించారు. కరీంనగర్ ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడుతూ గతప్రభుత్వాల తప్పులు సమగ్రసర్వే ద్వారా బయట పడ్డాయని, సమగ్ర కుటుంబ సర్వేను ప్రధాని పరిశేలిస్తామన్నారని ఆయన తెలిపారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News