ఇంగ్లాండ్ తో జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ లో భారత్ పోరాడి ఓడిపోయింది.
181 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేసి 3 పరుగుల తేడాతో ఓడి ఇంగ్లాండ్ పర్యటనను ముగించింది. కోహ్లి 41 బంతుల్లో 9 ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో 66 పరుగులు చేయగా ధావన్ 33 పరుగులు,రైనా 25,ధోని 27 పరుగలు చేశారు.
లక్ష్య చేధనలో భారత్ ధాటిగానే సమాధానం ఇచ్చింది.రెండో వికెట్ కు ధావన్,కోహ్లి 79 పరుగలు జోడించారు.కోహ్లి మూడో వికెట్ రూపంలో ఔటయ్యే సమయానికి భారత్ స్కోరు 14.2 ఓవర్లలో 131 పరుగులతో పటిష్టంగా ఉంది.తరువాత రైనా,జడేజా వెంటవెంటనే ఔట్ అవ్వడంతో చివర్లో స్కోర్ వేగం తగ్గింది.చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా ధోని 13 పరుగులు చేయగలిగాడు.రెండు సింగిల్స్ చేసే అవకాశం వచ్చినప్పటికీ రాయుడుకి బ్యాటింగ్ అవకాశం ఇవ్వకుండా అతి ఆత్మ విశ్వాసంతో ధోని ఓవర్ అంతా ఆడాడు. కోహ్లి కి ఈ పర్యటనలో ఇదే మొదటి అర్థ సెంచరీ.
అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోర్ చేసింది.కెప్టెన్ మోర్గాన్ కేవలం 31 బంతుల్లో 7 సిక్సులు 3 ఫోర్ల సహాయంతో 71 పరుగులు చేయగా హేల్స్ 40 పరుగులతో రాణించారు.షమీ మూడు వికెట్లు పడగొట్టాడు.
No comments: