అత్యాచారం కంటే బాల్య వివాహాలు చేయడమే అతిపెద్ద పెద్ద దారుణమని సమాజం నుండి ఈ మహమ్మారిని పూర్తిగా రూపుమాపాలని ఢిల్లీ కోర్టు సూచించింది.లేత వయసులోనే తమ కూతురికి పెళ్లి చేసినందుకు తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేయాలని ఆదేశిస్తూ పైవిధంగా వ్యాక్యానించింది.
తమ కూతురిని అత్తింటివారితో పాటు అల్లుడు వరకట్న వేధింపులకు పాల్పడుతున్నాడు అని పెట్టిన కేసు మీద జరిగిన వాదనలో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శివాని చౌహాన్ ఆదేశాలు జారీ చేశారు.చట్ట ప్రకారం వరకట్నం ఇవ్వడం మరియు తీసుకోవడం రెండూ నేరమే అని కోర్టు తెలిపింది.
బాల్యవివాహా నిరోధక చట్టం మరియు వరకట్న నిషేధ చట్టం క్రింద 14 సంవత్సరాలకే వివాహం చేసిన తల్లిదండ్రుల మీద మరియు అత్తారింటివారి మీద కేసులతో పాటు గృహహింస చట్టం క్రింద కేసులు నమోదు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.
No comments: