శేషాచలం అడవుల్లో ఇంకా అదుపులోకి రాని మంటలు

వారం రోజులుగా శేషాచలం అడవుల్లో మంటలు అదుపులోకి రావడం లేదు సరి కదా, వేగంగా అడవిని దహిస్తున్నాయి మంటలు.
మంటలు అదుపులోకి తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు,అయినప్పటికీ ఫలితం ఉండడం లేదు. తాజాగా మంటలు గాలి మరలను అంటుకున్నాయి.
   దాంతో తిరుమలకు విద్యుత్తు నిలిచిపోయింది, గాలి మరల ద్వారా ఏడాదికి 140 లక్షల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది.
పాపవినాశనం వైపు మంటలు వ్యాపించడంతో అక్కడి దుకాణాలు కాలి చేయించారు అటవీ అధికారులు. 
పాపవినాశన దర్శనానికి భక్తులను కూడా అనుమతించడం లేదు. దాదాపు 300 మంది అటవీ అధికారులు మరియు మీడియా సిబ్బంది మంటల్లో చిక్కుకున్నారు.ఇప్పటికే 70 కోట్ల నష్టం వాటిల్లి ఉండొచ్చు అని అధికార్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే విలువైన వృక్ష సంపద, జంతు సంపద కోల్పోవడం జరిగింది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News