గవర్నర్ కూడా ఎన్నికల కోడ్ కిందికి వస్తారు - వినోద్ జస్టి

గవర్నర్ కూడా ఎన్నికల కోడ్ కిందికి వస్తారు అని, ప్రభుత్వ పథకాలపై సమీక్షలు నిర్వహించరాదని డిప్యూటీ ఎన్నికల కమీషనర్ వినోద్ జస్టి అన్నారు.ఈసీ అనుమతితో సంబంధిత అధికారులతో సమీక్ష జరుపవచ్చునన్నారు,అంతేకాని కలెక్టర్, ఎస్పీ లతో సమీక్షలు జరపరాదని,అలా జరిపినా ఉల్లంఘనే అవుతుంది అని జస్టి అన్నారు.
కొత్త పార్టీల రిజిస్ట్రేషన్ కు పెద్దగా సమయం పట్టదని, నిబంధనల ప్రకారం దరఖాస్తు చేస్తే కొద్ది సమయంలోనే పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది అని వినోద్ జస్టి అన్నారు.
ఇప్పటి వరకు రూ.16 కోట్లు సీజ్ చేసినట్టు, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని, 30వ తారీకు వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుంది అని జస్టి తెలియ చేశారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News