పవన్ కళ్యాణ్ వైజాగ్ సభ స్పీచ్ హైలైట్స్


జనసేన పార్టీ సిద్దాంతాలను ‘ఇజం’ పుస్తకం రూపంలో పవన్ ఆవిష్కరించారు.

పవన్ రచించిన ‘ఇజం’ పుస్తకాన్ని భారత ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.

కడుపుమండి రాజకీయాల్లోకి వచ్చా.

ఇంట్లో తినవలసిన భోజనాన్ని రోడ్లమీదకు వచ్చి తినేటట్టు చేశారు.

సోనియా గాంధిలో తల్లి లక్షణాలు లేవు.

కాంగ్రెస్ ను కూకటివేళ్ళతో సహా తొలగించాలి.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి రాజకీయం ఎక్కడా చూడలేదు.

జాతిపిత పేరు ఇంటిపేరుగా పెట్టుకున్నంత మాత్రాన జాతిపితలు కాలేరు.

ప్రతి రోజూ టీవీల్లో కనిపించాలన్న దురద లేదు.

అవినీతి పై పోరాటం చెయ్యడమే తన పార్టీలోని మేనిఫెస్టో.

సైద్ధాంతిక విభేదాలే తప్ప తనకు ఎవ్వరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవు.

అన్నయ్యను తాను వ్యతిరేకించడం లేదంటూ ఇప్పుడు ఇద్దరం చెరోవైపు నిలిచామంటే అది భగవంతుని లీల.

చట్టాలు అందరికీ వర్తించే విధంగా ఉండాలి.

రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చెయ్యటం లేదు.

రాబోయే తరాలకోసమే జనసేన.

ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించం.వాళ్ళ రెండు చెంపలు పగిలిపోయేలా కొడతాం.

ఓట్లను చీల్చడం తనకు ఇష్టం లేదు, కొత్త రాష్ట్రం, రాజధానిని నిర్మించే సత్తా ఉన్న నాయకుడికే ఓటేయండి.

మంచి యువ నాయకులు దొరికితే సీమాంధ్ర లోనె కాదు తెలంగాణ లో కూడా పోటీ చేస్తా.

రాజకీయాలకు అతీతంగా పనిచేసే యువనాయకులు జనసేనకు అవసరం.

సీమాంద్ర ఎంపిలు వారి వ్యాపారాలపైనే దృష్టి పెట్టారు.

బీజేపీ నేత నరేంద్రమోడీని దేశ ప్రధానిగా చూడాలన్నది తమ ఆకాంక్ష. ధైర్యం ఉన్న నాయకుడు మోడీ.

ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాట్లాడలేని నాయకులు మనవాళ్ళు.
సముద్రం ఒకరి కాలి దగ్గర కూర్చొని మొరగదు. తుపాన్ ఒకరికి చిత్తం అనడం ఎరగదని, పర్వతం ఎవరికీ వొంగి సలాం చేయదని, నేనంతా కలిపి పిడికెడు మట్టే కావచ్చు, మనమందరం కలిసి పిడికెడు మట్టే కావచ్చు, కానీ మనం చేయెత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది.

రెండు ప్రాంతాల్లో ఏ పార్టీ అధికారం లోకి వచ్చిన వేషాలు వేసినా,నీతినియమాలు తప్పినా పార్టీ సిద్దంతాలు మాట్లాడవు,జనసేన ఉద్యమాలే మాట్లాడతాయి.

 జై హింద్ జై హింద్ జై హింద్...................................................

No comments:

| Copyright © 2013 Radio Jalsa News