పొత్తు కూడా ఉండదు - కెసిఆర్


   రానున్న ఎన్నికల్లో కాంగ్రేస్ తో పార్టీతో పొత్తు కూడా ఉండదని తెరాస పార్టీ అధినేత  కెసిఆర్ అన్నారు.విలీనం విషయంలో నేను ద్రోహం చేయలేదు.విలీనం చేస్తానని ఒకప్పుడు నేనే చెప్పాను అని ఆ సందర్భం కూడా తెలుసుకోవాలని అన్నారు. వందలాది బిడ్డలు చనిపోతుంటే ఇంకెంత కాలం ఈ చావులు అని పార్టీని విలీనం చేస్తాను అన్నాను,అయిన కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. విలీనంపై నెలరోజులు ఢిల్లీ లోనే ఉన్నా ఏ ఒక్కరోజు మాట్లాడలేదు.
   పొత్తుపై మాట్లాడుతూనే మా ఎమ్మెల్యే లను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారు, ఇదేమి పద్దతి,రేపటి నుండి చూసుకుందాం తెరాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాస లోకి వస్తారో చూడడం అని కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.నేనే లేకుంటే ఎప్పుడో తెలంగాణా ఉద్యమాన్ని చిదిమేసే వారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా పొన్నాల లక్ష్మయ్య ఆంధ్ర దొంగ ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేశారు. అమరవీరులు తమ సూసైడ్ నోట్ లో ఎవరి పేర్లు రాసి చనిపోయారో తెలుసుకోవాలి అని అన్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News