లడ్డు బాబు గెటప్‌ విశేషాలు

రవి బాబు దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన చిత్రం 'లడ్డు బాబు'. విలక్షణమైన పాత్రలో నటించిన నరేష్ ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారు.ఈ మధ్య జరిగిన ఆడియో ఫంక్షన్ కి కూడా చిత్ర గెటప్ లోనే హాజరు అయ్యారు నరేష్. ఆడియో ఫంక్షన్ స్పాట్ కి నరేష్ 4 గంటముందే వెళ్ళారు అంటే ఇక సినిమా కోసం ఎంత కష్టపడ్డారో తెలుసుకోవచ్చు.
ఈ గెటప్ విషయానికి వస్తే లండన్‌కి చెందిన ప్రముఖ మేకప్‌మేన్ మైక్,ముంబయ్‌కి చెందిన మేకప్ ఉమెన్ ప్రీతి ఈ గెటప్‌ను సిలికాన్ మెటీరియల్‌తో తయారుచేశారు.ఈ సిలికాన్ మెటీరియల్ తోనే నరేష్ స్కిన్ టోన్ కి తగ్గట్టు కాళ్ళు,చేతులు,ముఖం,శరీరం మొదలగు అవయవాలు తయారు చేశారు. ఇవన్నీ నరేష్ కి అమర్చడానికి దాదాపు నాలుగు గంటలు పట్టిందట. ఒక్కో అవయవం బరువులు పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి.
ముఖానికి అమర్చిన మెటీరియల్ 2కిలోలు, కాళ్ళకు 8 కిలోలు, చేతులకు 4 కిలోలు,బాడీకి 13 కిలోలు మరియు నరేష్ వేసుకునే ప్యాంటు బరువు 4కిలోలు. మొత్తంగా 31 కిలోల మెటీరియల్ ఉపయోగించారు.
ఇక చిత్రం కోసం నరేష్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. షూటింగ్ చాలా సేపు జరిగేది, షూటింగ్ జరిగినంత సేపు ఆ బరువు మోయాల్సి వచ్చేది.షూటింగ్ జరిగినన్ని రోజులు ఆ కష్టం భరించాడు. మేకప్ వేసుకోవడానికి ముందే తినాలి,ఎందుకంటే తరువాత తినడానికి కుదరదు,షూటింగ్ ఎంత సేపు జరిగినా మధ్యలో ఆకలేసిన తినడానికి ఉండదు. దురద పెట్టిన గోక్కునే అవకాశము అసలు ఉండదు, దురద పుడితే మేకప్ తొలిగించే వరకు ఆగాల్సిందే.శరీరంలోకి గాలి చొరబడే ఛాన్స్ లేదు, ఒక్కసారి ఊహించుకోండి బాడీ కి గాలి తాకకుంటే ఎంత కష్టంగా ఉంటుందో. అందుకే తలకు అడుగు దూరంలో 30 టన్నుల ఏసీ మిషన్ ఎప్పుడు అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడ్డారు సినిమా యూనిట్.
నిజంగా ఒక సినిమా కోసం ఇంతగా కష్టపడ్డ నరేష్ కి సినిమా మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిద్దాం.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News