Current Affairs - ఆంధ్ర ప్రదేశ్ లో తొలి భారతీయ మహిళా బ్యాంక్ ప్రారంభం

ఆంధ్ర ప్రదేశ్ లో తొలి భారతీయ మహిళా బ్యాంక్ ప్రారంభం

1.హైదరాబాద్ లోని అమీర్‌పేట లో మార్చి22న తొలి భారతీయ మహిళా బ్యాంకు శాఖను ప్రారంభించారు.భారతీయ మహిళా బ్యాంకు చైర్మన్ ఉషా అనంత సుబ్రమణియన్ ఈ బ్యాంకు శాఖను ప్రారంభించారు.దేశంలో 19వ శాఖ అమీర్ పేట శాఖ.
భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నవంబర్19,2013 న మొదటి మహిళా బ్యాంకును ముంబై లో ప్రారంభించారు.

ఆయుధాల దిగుమతి వ్యవస్థ లో భారత్ మొదటి స్థానం

2.SIPRI(Stockholm International Peace Research Institute) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం 2004-13 మధ్య కాలంలో ఆయుధాల దిగుమతిలో ఇండియా మొదటి స్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. పాకిస్తాన్, చైనా లతో పోల్చుకుంటే భారత్ ఆయుధాల దిగుమతి వ్యవస్థ మూడు వంతులు అధికంగా ఉన్నట్లు తెలిపింది.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News