హీరో అల్లు అర్జున్ 'ఐ యామ్ దట్ చేంజ్' షార్ట్ ఫిలిం విడుదల


సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చే ఉద్దేశ్యంతో ప్రముఖ హీరో అల్లు అర్జున్ 'ఐ యామ్ దట్ చేంజ్' అనే షార్ట్ ఫిలింను నిర్మించాడు.సమాజం కోసం ఎవరి స్థాయికి తగ్గట్టు వారు చేస్తారు,నేను కూడా ఏమైనా చేయాలనుకున్నాను,నాకు బాగా తెలిసిన మీడియం సినిమా ద్వారా ఎదో ఒకటి చేయాలనుకున్నాను.ఆ తపనతోనే ఈ షార్ట్ ఫిలిం చేశాను అని అల్లు అర్జున్ చెప్పాడు.
ఆగష్టు 15 న ఈ షార్ట్ ఫిలిం విడుదల చేయడానికి రెండు కారణాలు చెప్పారు.అందరికి సెలవులు ఉంటాయి కాబట్టి ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది,ఒక మంచి విషయం చెప్పడానికి మంచి రోజు కాబట్టి ఈ రోజు విడుదల చేస్తున్నాను అని,రాబోయే తరాలకోసం స్వతంత్ర్య ఉద్యమంలో చాలా మంది ప్రాణత్యాగాలు చేశారు వారు చేసినదాని ముందు నేను చేసింది ఏమిలేదు అని బన్నీ తెలిపాడు.... Click Here For Video

No comments:

| Copyright © 2013 Radio Jalsa News