మహారాష్ట్ర గవర్నర్ గా విద్యాసాగర్ రావు నియామకం

కేంద్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది.తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు సీహెచ్ విద్యాసాగర్ రావుకు ఈ జాబితాలో చోటు దక్కింది.మహారాష్ట్ర,కర్ణాటక,రాజస్తాన్ మరియు గోవా రాష్ట్రాలకు నూతన గవర్నర్లను కేంద్రం ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
కొత్తగా నియమించిన గవర్నర్లు:
మహారాష్ట్ర - సీహెచ్ విద్యాసాగర్ రావు
రాజస్తాన్ - కళ్యాణ్ సింగ్
గోవా - మృదులా సిన్హా
కర్ణాటక - వాజూబాయ్ రుదాబాయ్ వాలా
తెలంగాణకు చెందిన విద్యాసాగర్ రావు మూడుసార్లు ఎమ్మెల్యేగా,రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా కూడా గతంలో పనిచేశారు.విద్యాసాగర్ నియామకం పట్ల కరీంనగర్ లోని తెలంగాణా చౌక్ వద్ద శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
For More News Visit RADIOJALSA


No comments:

| Copyright © 2013 Radio Jalsa News