టీ ఇవ్వడం ఆలస్యం చేసిందని 56 సంవత్సరాల కిరాతకుడు తన భార్యను హత్య చేసిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని దెంకనల్ జిల్లా గుహాలిపల్ గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే మహాలియా నాయక్ అనే వ్యక్తి టీ తీసుకురమ్మని తన భార్య ఝానాను అడిగాడు.టీ తీసుకురావడం కాస్త ఆలస్యం అవడంతో కోపంతో ఊగిపోయాడు మహాలియా,ఇది సోమవారం చోటు చేసుకుంది.అదే విషయాన్నీ మళ్ళీ బుధవారం లేవనెత్తాడు మహాలియా.ఈ విషయమై భార్యా భర్తల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొనడంతో,భార్య ఇంట్లో వంట చేయడానికి నిరాకరించింది.దీంతో మరింత కోపోద్రిక్తుడైన మహాలియ,భార్య ఝానాను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు అని పోలీసులు తెలిపారు.
ఘటన జరిగిన రెండు రోజుల తరువాత నిందితుడిని అరెస్ట్ చేయడంతో విషయం బయటికి వచ్చింది.

No comments: