మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి

తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాజీనామా చేసిన మెదక్ లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డి పేరును పార్టీ ప్రకటించింది.కాంగ్రేస్ పార్టీ వీడి బీజేపీలో చేరిపోయారు జగ్గారెడ్డి.ఈ విషయాన్నీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.నామినేషన్లకు చివరి రోజు ఈరోజే కావడంతో మరికొద్ది సేపట్లో నామినేషన్ కూడా వేయనున్నాడు జగ్గారెడ్డి.పార్టీలో చేరడం,మెదక్ లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.
గతంలో బీజేపీలో పనిచేశానని.ఏబీవీపీ నుండి క్రియాశీల కార్యాకర్తగా ఉన్నానని జగ్గారెడ్డి తెలిపారు.
అయితే బీజేపీ నుండి అంజిరెడ్డి పేరు దాదాపు ఖరారు అయిందని అందరూ బావించినప్పటికి ఒక్కసారిగా జగ్గారెడ్డి తెరమీదకు రావడం జరిగింది.దీంతో మెదక్ బీజేపీ నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమౌతుంది.
visit radiojalsa.com for more news updates.........



No comments:

| Copyright © 2013 Radio Jalsa News