భీమవరం టాకీస్ పతాకంపై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'ఐస్ క్రీమ్2'.తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి,నవీన,నందు,గాయత్రీ,సిద్దు,భూపాల్,జీవ తదితరులు నటిస్తున్నారు.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దాదాపు పూర్తి కావొచ్చింది.
ఈ సినిమా ట్రైలర్ తో పాటు ఒక సాంగ్ రిలీజ్ కార్యక్రమం శనివారం హైదరాబాద్ లో జరిగింది.ఈ సందర్భంగా నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ సినిమా ట్రైలర్,సాంగ్ చూశాక సినిమా ఏంటో అర్థమౌతుంది,వర్మ అద్భుతాలు సృష్టించే వ్యక్తి ఆయనతో వరుస సినిమాలు చేయడం నా అదృష్టం,వర్మ సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్న ఈ ఏడాది నాతో సినిమా తీయడం ఆనందంగా ఉంది,ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు,ముగ్గురు హీరోలు నటిస్తున్నారు,సెప్టెంబర్ లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము అని అన్నారు.
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ సాంగ్ చూసి షాక్ అయ్యాను,సాంగ్ ఎలా తీయాలో వర్మ గారికి బాగా తెలుసు,సాంగ్ చాలా అధ్బుతం ఉంది,చాలా కొత్తగా ఉంది చూస్తున్న ప్రతీ ఆడియన్ కూడా అలానే ఫీల్ అవుతారు అని అన్నారు...
No comments: