3-1 తో ఓడి 3-1 తో గెలిచే !


లీడ్స్ లో జరిగిన ఇంగ్లాండ్ తో జరిగిన చివరి వన్డేలో భారత్ 41 పరుగులతో ఓడిపోయింది.చివరి వన్డేలో గెలిచి ఇంగ్లాండ్ పరువు నిలబెట్టుకుంది.చివరి వన్డేలో ఓడినా భారత్ 3-1 తేడాతో వన్డే సీరీస్ ను కైవసం చేసుకుంది.మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా తరువాతి మూడు మ్యాచ్ ల్లో భారత్ గెలవగా,చివరి వన్డేలో ఇంగ్లాండ్ గెలిచింది.
టెస్ట్ సీరీస్ ను 3-1 తో చేజార్చుకున్న భారత్,వన్డే సీరీస్ ను 3-1 తో చేజిక్కించుకుంది.
ఇంగ్లాండ్ విధించిన 295 లక్షాన్ని చేదించడంలో భారత్ తడబడింది.ఆదిలోనే ఓపెనర్ రహనే పరుగులేమి చేయకుండానే పెవీలియన్ బాట పట్టాడు.తరువాత వచ్చిన కోహ్లి 13 పరుగులకే ఔటై మరోసారి నిరాశ పరిచాడు.ధావన్,రాయడు ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును నెమ్మదిగా నడిపించారు.రాయుడు 53,ధావన్ 31 పరుగులు చేసి ఔటయ్యారు.అనంతరం వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవ్వరు నిలదొక్కుకోలేదు.జడేజా ఒక్కడే ఒంటరి పోరు చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్లను చితకబాధినా వికెట్లు చేతులో లేకపోవడతో చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు.66 బంతులు ఆడిన జడేజా 83పరుగులు చేశాడు.చివరి వికెట్ కు ఉమేష్ యాదవ్ తో కలిసి 39 పరుగులు జోడించాడు జడేజా.253 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది.జో రూట్ 112 పరుగులు చేసి విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు.
జో రూట్ మ్యాన్ అఫ్ ద మ్యాచ్ గెలుచుకోగా,సురేష్ రైనా మ్యాన్ అఫ్ ద టోర్నీ అందుకున్నాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ చివరగా ఆదివారం ఏకైక టీ20 మ్యాచ్ ఆడనుంది.

Click Here For Scorecard

No comments:

| Copyright © 2013 Radio Jalsa News