అసలేముంది ఆ సీడీల్లో !

 బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనే ఆరోపణలతో క్రైమ్ వాచ్ యాంకర్ హర్షవర్ధన్ ను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో ఏలూరు సబ్ జైల్లో పెట్టిన విషయం తెలిసిందే.
హర్షవర్ధన్ తో పాటు మరో నలుగురు కూడా ఇందులో నిందితులు.పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో ఉన్న సెయింట్ జోసెఫ్ డెంటల్ కళాశాల కరస్సాండెంట్‌ ఫాదర్‌ పి.బాలను హర్షవర్ధన్ బ్లాక్ మెయిల్ చేస్తూ రూ.5 కోట్లు డిమాండ్ చేశారనేది ఆరోపణ.మా దగ్గర కొన్ని సీడీలు ఉన్నాయని అడిగినంత డబ్బు ఇవ్వకుంటే వాటిని ప్రముఖ టీవీ చానల్లో ప్రసారం చేస్తాము అని బాలాను బెరించారు.అయితే ఇంతకి ఆ సీడీల్లో ఏముంది అనేది ప్రస్తుతానికి చర్చగా మారింది.అసలు నిజంగానే సీడీలు ఉన్నాయా లేకుంటే బెందిరించదానికే సీడీల నాటకం ఆడారా అనేదాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.పట్టుబడిన నలుగురిలో ఒకరు ప్రభుత్వ అధికారుల దగ్గరకు అమ్మాయిలను పంపి వారు ఏకాంతంగా ఉన్నప్పుడు రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణలు ఉండడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
కోట్లాది రూపాయలు విలువ చేసేంత సమాచారం ఆ సీడీల్లో ఉంటె కాలేజీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చేది కాదని మరికొందరి వాదన.ఇన్నిరోజులుగా వీరి బారిన పడిన మరికొంత మంది కూడా డబ్బులు ఇచ్చారనే  సమాచారం పోలీసులకు అందుతుంది.ఇవే కాకుండా ఇంకేమైనా నేరాలకు వీరి గ్యాంగ్ పాల్పడిందా,వీరికి ఎవరెవరు సహకరించారు అని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.ఆన్ని వివరాలు త్వరలోనే పోలీసుల విచారణలో బయటపడే అవకాశాలు ఉన్నాయి.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News