హైదరాబాద్ ను స్మార్ట్ గ్రీన్ సేఫే సిటిగా తీర్చిదిద్దడమే లక్ష్యం-కేటీఆర్

తెలంగాణా ప్రభుత్వ ఐటి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటిఆర్ హైదరాబాద్ ను స్మార్ట్ గ్రీన్ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
స్మార్ట్ సిటీ అంటే రోడ్ల సౌకర్యాలు మెరుగు పరచడమే కాదని.. ప్రజల అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దడమే ముఖ్యమన్నారు.
మెట్రో పోలీస్ కాంగ్రేస్ ను త్వరలో హైదరాబాద్ లో నిర్వహించనున్న తరుణంలో GHMC, ఆస్కీ,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో వర్క్ షాప్ ను నిర్వహించారు.
వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి కె.తారకరామారావు తెలంగాణా ప్రాంతంలో ఇప్పటికే 39% పట్టణీకరణ చెందిదని చెప్పారు.
హైదరాబాద్ నగరాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అందరూ కలిసి రావాలని కేటిఆర్ పిలుపునిచ్చారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News