నేడు కాళోజి శతజయంతి సందర్భంగా వరంగల్ లో సిఎం కేసీఆర్ కాళోజి విగ్రహావిష్కరణ

 ప్రజాకవి కాళోజి నారాయణ రావు శతజయంతి సందర్భంగా హన్మకొండ లోని బాలసముద్రంలో రెండెకరాల స్థలంలో కాళోజి కళా కేంద్రానికి తెలంగాణా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు.
ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.వరంగల్ నిట్ కు కెసిఆర్ హెలికాప్టర్ లో చేరుకొని అక్కడినుండి నుండి బాలసముద్రానికి చేరుకొని భూమి పూజ చేస్తారు.సుమారు 2000 మంది కూర్చొవడానికి వీలుగా కళాక్షేత్రం ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యానవనం ఏర్పాటు చేస్తారు.హైదరాబాద్ లోని రవీంద్ర భారతికి ఏమాత్రం తీసిపోకుండా ఈ కళాక్షేత్రం ఉండాలని కెసిఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.ఆడిటోరియం ముందుభాగంలో కాళోజి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.
జిల్లాలోని సమస్యలు,ప్రభుత్వం చేపట్టాల్సిన పనులగురించి కెసిఆర్ తన వరంగల్ పర్యటనలో జిల్లా ప్రతినిధులు,అధికారులతో చర్చిస్తారు.తిరిగి సాయంత్రం 3 గంటలకు హైదరాబాద్ చేరుకొని సాయంత్రం 6 గంటలకు రవీంద్ర భారతిలో జరిగే కాళోజి శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

No comments:

| Copyright © 2013 Radio Jalsa News